Top Selling Cars: కార్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే 20 కార్లు ఇవే.. లిస్టులో టాప్ ఏదంటే?

From Maruti Suzuki WagonR to Kia Seltos these 20 Best Selling Cars in November 2023
x

Top Selling Cars: కార్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే 20 కార్లు ఇవే.. లిస్టులో టాప్ ఏదంటే?

Highlights

Best Selling Cars: భారత కార్ మార్కెట్‌కు నవంబర్ నెల బాగానే ఉంది. నవంబర్ 2023లో కార్ల మొత్తం అమ్మకాలు 3,34,868 యూనిట్లకు చేరాయి.

Top Selling Cars In November 2023: భారత కార్ మార్కెట్‌కు నవంబర్ నెల బాగానే ఉంది. నవంబర్ 2023లో కార్ల మొత్తం అమ్మకాలు 3,34,868 యూనిట్లకు చేరాయి. ఇది గత ఏడాది (2022) నవంబర్‌లో విక్రయించిన కార్ల కంటే 3.98% ఎక్కువగా ఉంది. ఎప్పటిలాగే, మారుతి సుజుకి ఈ కార్లను గరిష్ట సంఖ్యలో విక్రయించింది. అదే సమయంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్ల గురించి మాట్లాడితే, మారుతి వ్యాగన్ ఆర్ మొత్తం 16,567 యూనిట్లు విక్రయించి అగ్రస్థానంలో ఉంది.

నవంబర్ 2022లో 14,720 యూనిట్లు..

మారుతి వ్యాగన్ R అమ్మకాలు సంవత్సరానికి 13 శాతం పెరిగాయి. దీని తర్వాత మారుతీ డిజైర్, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. డిజైర్ 15,965 యూనిట్లు, స్విఫ్ట్ 15,311 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటి తర్వాత, టాటా నెక్సాన్ 14916 యూనిట్లతో నాల్గవ స్థానంలో ఉంది. నవంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన 20 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నవంబర్ 2023లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 20 కార్లు..

1. మారుతి సుజుకి వ్యాగన్ఆర్- 16567 యూనిట్లు అమ్ముడయ్యాయి.

2. మారుతి సుజుకి డిజైర్- 15965 యూనిట్లు అమ్ముడయ్యాయి.

3. మారుతి సుజుకి స్విఫ్ట్- 15311 యూనిట్లు అమ్ముడయ్యాయి.

4. టాటా నెక్సాన్- 14916 యూనిట్లు అమ్ముడయ్యాయి.

5. టాటా పంచ్- 14383 యూనిట్లు అమ్ముడయ్యాయి.

6. మారుతి సుజుకి బ్రెజ్జా- 13393 యూనిట్లు అమ్ముడయ్యాయి.

7. మారుతి సుజుకి బాలెనో- 12961 యూనిట్లు అమ్ముడయ్యాయి.

8. మారుతి సుజుకి ఎర్టిగా- 12857 యూనిట్లు అమ్ముడయ్యాయి.

9. మహీంద్రా స్కార్పియో- 12185 యూనిట్లు అమ్ముడయ్యాయి.

10. హ్యుందాయ్ క్రెటా- 11814 యూనిట్లు అమ్ముడయ్యాయి.

11. కియా సెల్టోస్- 11684 యూనిట్లు అమ్ముడయ్యాయి.

12. హ్యుందాయ్ వెన్యూ- 11180 యూనిట్లు అమ్ముడయ్యాయి.

13. మారుతి సుజుకి ఈకో- 10226 యూనిట్లు అమ్ముడయ్యాయి.

14. మారుతి సుజుకి ఫ్రాంక్స్- 9867 యూనిట్లు అమ్ముడయ్యాయి.

15. మహీంద్రా బొలెరో- 9333 యూనిట్లు అమ్ముడయ్యాయి.

16. హ్యుందాయ్ ఎక్స్‌టర్- 8325 యూనిట్లు అమ్ముడయ్యాయి.

17. మారుతి సుజుకి ఆల్టో- 8076 యూనిట్లు అమ్ముడయ్యాయి.

18. మారుతి గ్రాండ్ విటారా- 7937 యూనిట్లు అమ్ముడయ్యాయి.

19. మహీంద్రా XUV700 – 7221 యూనిట్లు అమ్ముడయ్యాయి.

20. టయోటా ఇన్నోవా క్రిస్టా- 6910 యూనిట్లు అమ్ముడయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories