7 Seater Car: 7 సీటర్ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. రూ. 10 లక్షలలోపే మతిపోయే ఫీచర్లు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

From Maruti Suzuki Ertiga to Mahindra Bolero these 5 cars best 7 seater cars under 10 lakh in india low budget car for big family
x

7 Seater Car: 7 సీటర్ కార్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. రూ. 10 లక్షలలోపే మతిపోయే ఫీచర్లు.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Highlights

మారుతి సుజుకి ఎర్టిగా ఇంధన సామర్థ్యంతోపాటే, మైలేజీకి ప్రసిద్ధి చెందింది. ఈ కారు పెట్రోల్, CNG వేరియంట్లలో అందుబాటులో ఉంది.

7 Seater Car: పెద్ద కుటుంబాల కోసం 7 సీట్ల కార్ల డిమాండ్ దేశంలో నిరంతరం పెరుగుతూనే ఉంది. దీని వెనుక కారణం ఏమిటంటే, ఈ కార్లు సౌకర్యవంతంగా, కుటుంబంతో దూర ప్రయాణాలకు అనువుగా ఉంటాయి. అనేక కార్ కంపెనీలు భారతీయ మార్కెట్లో 7 సీటర్ కార్ల ఎంపికను అందిస్తున్నాయి. అయితే అన్నింటి ధరలు ఒకేలా ఉండవు. కొన్ని కార్లు రూ. 10 లక్షల కంటే తక్కువ ధరకు లభిస్తాయి. వీటిలో చాలా మంచి ఫీచర్లను కూడా పొందవచ్చు. కాబట్టి, మీరు రూ. 10 లక్షల లోపు కొనుగోలు చేయగల 5 ఉత్తమ 7 సీటర్ కార్లను ఇప్పుడు చూద్దాం..

మారుతి సుజుకి ఎర్టిగా ఇంధన సామర్థ్యంతోపాటే, మైలేజీకి ప్రసిద్ధి చెందింది. ఈ కారు పెట్రోల్, CNG వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎర్టిగాలో SmartPlay ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ABS, ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి భద్రత పరంగా కూడా అద్భుతమైనవి. దీని ధర రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుంది. ఇది బడ్జెట్‌కు అనుకూలమైనది.

మహీంద్రా బొలెరో దాని బలంతో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. దీని మైలేజ్ కూడా బాగుంది. బొలెరో ప్రారంభ ధర సుమారు రూ. 9 లక్షలు. ఇది బడ్జెట్‌లో కూడా సరిపోతుంది.

రెనాల్ట్ ట్రైబర్ అనేది 7 సీట్ల కార్ సెగ్మెంట్‌లో అభివృద్ధి చెందుతున్న పేరు. దీని మాడ్యులర్ సీటింగ్ అరేంజ్‌మెంట్, స్మార్ట్ ఇంటీరియర్స్ దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని ధర సుమారు రూ. 5.50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ట్రైబర్ మైలేజ్ కూడా చాలా బాగుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు మంచి ఎంపిక.

మహీంద్రా బొలెరో నియో 7 సీట్ల కారు. దీని ధర రూ. 9.95 లక్షల నుంచి రూ. 12.15 లక్షల మధ్య ఉంటుంది.

మారుతి ఈకో అనేది బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటుంది. దీని ధర రూ. 5.32 లక్షల నుంచి రూ. 6.58 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారు తక్కువ ధరకు, మంచి మైలేజీకి ప్రసిద్ధి చెందింది.

Show Full Article
Print Article
Next Story
More Stories