Affordable 7-Seater Cars: తక్కువ బడ్జెట్‌లోనే 7 సీటర్ కార్లు.. మైలేజీలోనే కాదు.. ఫీచర్లలోనూ అదుర్స్..!

From Maruti Ertiga to Renault Triber These Affordable 7 seater cars
x

Affordable 7-Seater Cars: తక్కువ బడ్జెట్‌లోనే 7 సీటర్ కార్లు.. మైలేజీలోనే కాదు.. ఫీచర్లలోనూ అదుర్స్..!

Highlights

7-Seater Cars: మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, సరసమైన 7-సీటర్ కార్ల కోసం మీ ఎంపికలు పరిమితంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ కోసం 5 సరసమైన 7-సీటర్ కార్ల జాబితాను రూపొందించాం.

Affordable 7-Seater Cars In India: మీ కుటుంబంలో ఆరు లేదా ఏడుగురు సభ్యులు ఉన్నట్లయితే 7-సీటర్ కారుని కొనుగోలు చేయాల్సిందే. కానీ, మీ బడ్జెట్ తక్కువగా ఉంటే, సరసమైన 7-సీటర్ కార్ల కోసం మీ ఎంపికలు పరిమితంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ కోసం 5 సరసమైన 7-సీటర్ కార్ల జాబితాను రూపొందించాం. ఇందులో రెనాల్ట్ ట్రివర్, మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా రూమియన్, మహీంద్రా బొలెరో, మహీంద్రా బొలెరో నియో ఉన్నాయి. పూర్తి జాబితాను ఓసారి పరిశీలిద్దాం..

Renault Triber..

రెనాల్ట్ ట్రైబర్ భారతీయ మార్కెట్లో అత్యంత పాకెట్-ఫ్రెండ్లీ MPV. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ AMT ఎంపికతో 71bhp, 96Nm ఉత్పత్తి చేసే 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. గ్లోబల్ NCAP దీనికి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. దీని ధర రూ. 6.34 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Maruti Suzuki Eritga/Toyota Rumion..

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న MPV మారుతి ఎర్టిగా. Toyota Rumion కూడా దీని ఆధారంగానే రూపొందించారు. రెండింటిలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి. ఈ ఇంజన్ 102bhp, 136.8Nm ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (పాడిల్ షిఫ్టర్‌లతో) ఎంపిక ఇచ్చారు. ఎర్టిగా ధర రూ. 8.64 లక్షల నుంచి ప్రారంభం కాగా, రూమియన్ ధర రూ. 10.29 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Mahindra Bolero/Bolero Neo..

బొలెరో నియో అనేది బాడీ-ఆన్-ఫ్రేమ్ SUV. ఇది దేశంలోనే అత్యంత సరసమైన 7-సీటర్ డీజిల్ SUV. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 99bhp, 260Nm ఉత్పత్తి చేస్తుంది. బొలెరో నియో ధర రూ. 9.63 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

బొలెరో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో mHawk D75 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 76 PS, 210 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. బొలెరో ధర రూ. 9.78 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories