Affordable 7-Seater Cars: ఎరిట్గా నుంచి బొలెరో వరకు.. 5 చౌకైన 7-సీటర్ కార్లు ఇవే.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

From Mahindra Bolero to Bolero Neo these top 5 most affordable 7 Seater Cars in India Check Price and Features
x

Affordable 7-Seater Cars: ఎరిట్గా నుంచి బొలెరో వరకు.. 5 చౌకైన 7-సీటర్ కార్లు ఇవే.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Highlights

Most Affordable 7-Seater Cars: ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ప్రయాణించాలనుకునే కుటుంబాలకు 7-సీటర్ కార్లు మంచి ఎంపిక.

Most Affordable 7-Seater Cars: ఐదుగురు కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ప్రయాణించాలనుకునే కుటుంబాలకు 7-సీటర్ కార్లు మంచి ఎంపిక. ఈ కార్లు సాధారణంగా పెద్దవి. మూడు వరుసలను కలిగి ఉంటాయి. మీరు MPV (మల్టీపర్పస్ వెహికల్), SUV (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్), మినీవాన్‌లలో 7-సీటింగ్ లేఅవుట్‌ను పొందుతారు. 7 సీట్ల కార్లు ఖరీదైనవి అయినప్పటికీ దేశంలో చౌకైన 7-సీటర్ కార్లు కూడా ఉన్నాయి. దేశంలో చౌకైన 7-సీటర్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రెనాల్ట్ ట్రైబర్..

ట్రైబర్ మార్కెట్లో అత్యంత పాకెట్-ఫ్రెండ్లీ MPV మాత్రమే కాదు, ఇది భారతదేశంలో రెనాల్ట్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ కూడా. ట్రైబర్ 96Nm, 71bhpతో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్. 5-స్పీడ్ AMT ఎంపికను కలిగి ఉంది. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇందులో చాలా అవసరమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 6.34 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి సుజుకి ఎరిట్గా, టయోటా రూమియన్..

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న MUV ఎర్టిగా. దీని ఆధారంగానే టొయోటా రూమియన్ రూపొందించారు. రెండూ 102bhp, 136.8Nm ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తాయి. వీటిలో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్‌లు ఉన్నాయి. ఎర్టిగా ధర రూ. 8.64 లక్షలు కాగా, రూమియన్ ధర రూ. 10.29 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

మహీంద్రా బొలెరో, బొలెరో నియో..

బొలెరో నియో అత్యంత సరసమైన 7-సీటర్ డీజిల్ SUV. ఇది బాడీ-ఆన్-ఫ్రేమ్ SUV. ఇందులో ఒక డీజిల్ ఇంజన్ ఎంపిక మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 1.5-లీటర్ డీజిల్ యూనిట్. ఇది 99bhp, 260Nm ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కలదు. అయితే, బొలెరోలో mHawk D75 1.5 లీటర్ డీజిల్ ఉంది. ఇది 76 PS, 210 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉంది. బొలెరో నియో ధర రూ.9.63 లక్షల నుంచి ప్రారంభం కాగా, బొలెరో ధర రూ.9.78 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories