Best Electric Scooters: తక్కువ బడ్జెట్‌లో 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. అద్భుతమైన ఫీచర్లు.. ధరలు ఎలా ఉన్నాయంటే?

From Hero Electric Optima To Okinawa Praise Pro These 5 Best Low Budget Electric Scooters Under One Lakh Rupees
x

Best Electric Scooters: తక్కువ బడ్జెట్‌లో 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. అద్భుతమైన ఫీచర్లు.. ధరలు ఎలా ఉన్నాయంటే?

Highlights

Low Budget Electric Scooters: మీరు తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. మీ కోసం మార్కెట్లో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. వాటి విశేషాల గురించి తెలుసుకుందాం..

Best Electric Scooters Under On Lakh Budget: ఎలక్ట్రిక్ స్కూటర్ క్రేజ్ మార్కెట్లో క్రమంగా పెరగడం ప్రారంభించింది. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా కంపెనీలు భారతీయ మార్కెట్లో బడ్జెట్ ధరల శ్రేణిలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. వీటిలో చాలా వరకు మీడియం స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. మీరు కూడా తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. మీరు ఈ బెస్ట్ ఆప్షన్‌ల గురించి తప్పక తెలుసుకోవాలి. Okinawa, Pure EV, Okaya, Lectrix, Hero Electric వంటి కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకోవచ్చు.

1. Hero Electric Optima

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 67, 190 నుంచి రూ.85, 190ల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ పేర్కొంది. Hero Electric Optima 45 kmph వేగంతో నడుస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

2. Okinawa Praise Pro

ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకినావా ప్రైజ్ ప్రో కూడా మార్కెట్లో బాగా సేల్ అవుతోంది. ఒకినావా ప్రైజ్ ప్రో ఎక్స్-షోరూమ్ ధర రూ.99,645లుగా ఉంది. ఒకినావా ప్రైజ్ ప్రో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 88 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 58 కి.మీ.

3. Okaya Faast F2B

ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya F2B ఎక్స్-షోరూమ్ ధర రూ.99,950. ఇందులో మీరు 6 కలర్ ఆప్షన్‌లను పొందుతారు. ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya F2B ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ. పూర్తిగా ఛార్జ్ కావడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.

4. Lectrix EV LXS

ఎలక్ట్రిక్ స్కూటర్ Lectrix EV LXS ఎక్స్-షోరూమ్ ధర రూ.91, 253. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 89 కి.మీల దూరం వెళ్తుంది. లెక్ట్రిక్స్ EV LXS గరిష్టంగా 50 kmph వేగాన్ని కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటల సమయం పడుతుంది.

5. PURE EV Epluto 7G

ఎలక్ట్రిక్ స్కూటర్ ప్యూర్ Epluto 7G ఎక్స్-షోరూమ్ ధర రూ.86, 999 కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 90-120 కి.మీ. దీని గరిష్ట వేగం గంటకు 60 కి.మీలు. పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories