Flying Car: మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ ఎగిరే కార్.. ఇంటి పైకప్పు నుంచే టేకాఫ్, ల్యాండింగ్.. తక్కువ ధరలోనే.. రిలీజ్ ఎప్పుడంటే?

Flying Electric Car From Maruti Suzuki Check Launch Date And Price Skydrive Taxi Service
x

Flying Car: మారుతి సుజుకి నుంచి ఎలక్ట్రిక్ ఎగిరే కార్.. ఇంటి పైకప్పు నుంచే టేకాఫ్, ల్యాండింగ్.. తక్కువ ధరలోనే.. రిలీజ్ ఎప్పుడంటే?

Highlights

Maruti Suzuki Flying Electric Car: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ (SMC) సహకారంతో ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ కారును

Maruti Suzuki Flying Electric Car: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన మాతృ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ (SMC) సహకారంతో ఫ్లయింగ్ ఎలక్ట్రిక్ కారును తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్‌ను ఇంటి పైకప్పు నుంచి ఎగురవేయవచ్చు. అక్కడే ల్యాండ్ కూడా చేయవచ్చు.

మీడియా నివేదికల ప్రకారం, ఎగిరే కారును అభివృద్ధి చేయడానికి జపాన్ స్టార్టప్ స్కైడ్రైవ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు SMCL వద్ద గ్లోబల్ ఆటోమొబైల్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ కెంటో ఒగురా తెలిపారు. దీని పేరు స్కైడ్రైవ్ కావచ్చు.

ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ కాప్టర్ అంటే ఎగిరే కారు డ్రోన్ కంటే పెద్దదిగా ఉంటుంది. కానీ, సాంప్రదాయ హెలికాప్టర్ కంటే చిన్నదిగా ఉంటుంది. అందులో పైలట్‌తో సహా ముగ్గురు కూర్చునే అవకాశం ఉంటుంది. ఇది పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ టాక్సీ సేవగా ఉపయోగించవచ్చు.

దీని తయారీ భారతదేశంలోనే జరుగుతుంది. ధర కూడా తక్కువగా ఉంటుంది.

ఆర్థిక కారణాల రీత్యా భారతదేశంలో ఫ్లయింగ్ కార్ల తయారీని కూడా కంపెనీ పరిశీలిస్తోంది. "ఇంకా నిర్దిష్ట కాలక్రమం లేదు. అయినప్పటికీ భారతదేశంలో తయారీ మంచిది" అని ఒగురా తెలిపారు. ఇందుకోసం విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. మేక్ ఇన్ ఇండియా కింద ఇక్కడికి వస్తే ఎగిరే కార్లు ఖచ్ఛితంగా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

జపాన్-అమెరికా తర్వాత ఇది భారత మార్కెట్లో విక్రయించబడుతుందని

ఒగురా చెప్పుకొచ్చారు. 'ఇది జపాన్‌లో 2025 ఒసాకా ఎక్స్‌పోలో 12 యూనిట్ల మోటార్, రోటర్‌లతో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. అన్నింటిలో మొదటిది, ఈ ఫ్లయింగ్ కారు జపాన్, అమెరికన్ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీని తరువాత, 'మేక్ ఇన్ ఇండియా' కింద భారతదేశంలో విక్రయించే ప్రణాళిక ఉంది. భారతదేశంలో కస్టమర్లు, భాగస్వాములను కనుగొనడానికి మేం మార్కెట్ పరిశోధన చేస్తున్నాం అని తెలిపాడు.

సాంప్రదాయ హెలికాప్టర్ బరువులో సగం..

ఈ ఎయిర్ కాప్టర్ బరువు సంప్రదాయ హెలికాప్టర్ బరువులో దాదాపు సగం ఉంటుంది. దాని తక్కువ బరువు కారణంగా, భవనం పైకప్పులు టేకాఫ్, ల్యాండింగ్ కోసం ఉపయోగించవచ్చు. విద్యుదీకరణ కారణంగా విమాన భాగాల సంఖ్య గణనీయంగా తగ్గిందని మీడియా నివేదికలో కూడా చెప్పబడింది. దీని వల్ల తయారీ, నిర్వహణ ఖర్చులు తగ్గాయి.

ప్రారంభంలో 15 కిలోమీటర్ల పరిధి..

ఓగురా మొదట్లో ముగ్గురు ప్రయాణికుల ఎడిషన్ పరిధి 15 కిలోమీటర్లుగా ఉంటుందని చెప్పారు. దీని తరువాత, ఇది 2029 నాటికి 30 కిలోమీటర్లకు, 2031 నాటికి 40 కిలోమీటర్లకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. 'భారతదేశం ఒక పెద్ద దేశం, మనకు ఖచ్చితంగా 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కావాలి' అని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories