Alert‌: వాహనదారులు అలర్ట్‌.. 8 ఏళ్లు దాటిన వాహనాలు రోడ్డెక్కాలంటే ఇది తప్పనిసరి..!

Fitness Certificate Will be Mandatory for 8 year Old Commercial Vehicles
x

Alert‌: వాహనదారులు అలర్ట్‌.. 8 ఏళ్లు దాటిన వాహనాలు రోడ్డెక్కాలంటే ఇది తప్పనిసరి..!

Highlights

Alert‌: భద్రత, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుంచి కొత్త నిబంధన అమలు చేయబోతోంది.

Alert‌: భద్రత, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2023 నుంచి కొత్త నిబంధన అమలు చేయబోతోంది. దీని ప్రకారం 8 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలకు ప్రతి సంవత్సరం ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించడం తప్పనిసరి చేసింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 2న దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ దీనిపై అభ్యంతరాలు, సూచనలను కోరింది. 8 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి ఉన్న ట్రక్కులు లేదా బస్సులు మొదలైనవి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. జాబితా చేయబడిన ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ స్టేషన్‌లో మాత్రమే ఈ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహిస్తారు.

ఒకవేళ ఫిట్‌నెస్ పరీక్ష లేకుండా రోడ్డెక్కిన వాహనాలకి భారీ జరిమానా విధిస్తారు. అంతేకాదు అలాంటి వాహనాలను రోడ్డుపైకి అనుమతించరు. ఇలాంటి వాహనాలు ఆయిల్ ఎక్కువగా వినియోగించడంతోపాటు పర్యావరణానికి హాని చేస్తున్నాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు కారణమవుతాయి. వీటిని అరికట్టడం ద్వారా ప్రయాణికుల భద్రత పెరగడంతో పాటు పర్యావరణం మెరుగుపడుతుంది.

10 రాష్ట్రాల్లో సెంటర్లు

స్క్రాపేజ్ విధానం కోసం భారత ప్రభుత్వం 10 రాష్ట్రాల్లో ఫిట్‌నెస్ పరీక్ష హైటెక్ R&C కేంద్రాలను ఏర్పాటు చేయబోతోంది. ఇందుకోసం కేంద్రం 22 డిసెంబర్ 2021న నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ కేంద్రాల్లో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల, ప్రైవేట్‌, వాణిజ్య వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్ష అనంతరం సర్టిఫికెట్లు అందజేసి ఈ వాహనాలపై ప్రత్యేక స్టిక్కర్లు వేస్తారు. పీయూసీ విచారణ ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించే వాహనం, దాని యజమానికి సంబంధించిన మొత్తం సమాచారం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఈ వెబ్‌సైట్ సెంట్రల్ డేటాకు లింక్ అయి ఉంటుంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇటువంటి వాహనాల పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇక్కడ బాడీ, ఛాసిస్, వీల్స్, టైర్లు, బ్రేకింగ్, స్టీరింగ్ వంటి అనేక భాగాలను లైట్లతో హైటెక్ యంత్రాల ద్వారా తనిఖీ చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories