Car Care Tips: హ్యాండ్‌బ్రేక్ వేసేటప్పుడు ఈ పొరపాటు చేయవద్దు.. సరైన విధానం తెలుసుకోండి..!

Dont Make This Mistake While Applying the Handbrake Know the Right Way
x

Car Care Tips: హ్యాండ్‌బ్రేక్ వేసేటప్పుడు ఈ పొరపాటు చేయవద్దు.. సరైన విధానం తెలుసుకోండి..!

Highlights

Car Care Tips: ప్రతి ఒక్కరూ తమ కారు చాలా సంవత్సరాలు నడపాలని కోరుకుంటారు.

Car Care Tips: ప్రతి ఒక్కరూ తమ కారు చాలా సంవత్సరాలు నడపాలని కోరుకుంటారు. దీని కోసం సరైన విధానంలో డ్రైవింగ్‌ చేయడం అవసరం. కారులోని అన్నిపార్ట్స్‌ని సరైన విధానంలో ఉపయోగించాలి. అయితే కారులో హ్యాండ్‌బ్రేక్ కూడా ఒక ముఖ్యమైన భాగం. ఇది కారును ఒకే చోట ఆపడంలో సహాయపడటమే కాకుండా కష్ట సమయాల్లో మీ ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతుంది. అయితే చాలామందికి హ్యాండ్‌బ్రేక్‌ను ఏ విధంగా ఉపయోగించాలో తెలియదు. ఇది కాకుండా కారును ఎక్కువసేపు పార్కింగ్ చేసేటప్పుడు హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాలా వద్దా అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతూ ఉంటుంది. ఈ రోజు ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హ్యాండ్‌బ్రేక్ అంటే ఏమిటి..?

చాలా కార్లలో హ్యాండ్‌బ్రేక్ కోసం ఒక లివర్ ఉంటుంది. దీనిని లాగడం వల్ల అది యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ రోజుల్లో వచ్చే ఆధునిక కార్లు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లతో వస్తున్నాయి. ఇందులో చిన్న బటన్‌ను నొక్కడం వల్ల హ్యాండ్‌బ్రేక్‌ను వేయవచ్చు. దీనినే పార్కింగ్ బ్రేక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కారును పార్క్ చేస్తున్నప్పుడు దీనిని ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇది కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కారును వేగంగా ఆపడానికి హ్యాండ్‌బ్రేక్‌ను కూడా ఉపయోగించవచ్చు.

హ్యాండ్‌బ్రేక్‌ను ఎప్పుడు ఉపయోగించాలి..

1. మీరు కారును ఎక్కడైనా పార్క్ చేయాల్సి వస్తే అప్పుడు హ్యాండ్‌బ్రేక్‌ను అప్లై చేయాలి. ముఖ్యంగా వాలుగా ప్రదేశంలో హ్యాండ్‌బ్రేక్‌ ఉపయోగించాలి. దీనివల్ల కారు ముందుకు లేదా వెనుకకు వెళ్లకుండా ఉంటుంది.

2. కారు ట్రాఫిక్ లైట్ వద్ద ఆగిన తర్వాత హ్యాండ్‌బ్రేక్‌ను వర్తింపజేయవచ్చు. ఇలా చేయడం వల్ల కారు ముందుకు వెనుకకు కదలదు. ముందు ఉండే వాహనాలకి తగలకుండా ఉంటుంది.

3. మీరు కొండ ప్రాంతం లేదా వాలు ఉన్న ప్రదేశంలో డ్రైవింగ్ చేస్తుంటే అక్కడ హ్యాండ్‌బ్రేక్‌ను అప్లై చేయడం వల్ల కారును ఆపవచ్చు. ఇలా చేయడం వల్ల కారు రోలింగ్ నుంచి కాపాడవచ్చు.

4. కారును ఎక్కువసేపు పార్క్ చేసినప్పుడు హ్యాండ్‌బ్రేక్‌ను ఎక్కువసేపు వేయడం వల్ల బ్రేక్ ప్యాడ్‌లు, డ్రమ్‌లో ఇరుక్కుపోయి హ్యాండ్‌బ్రేక్ చెడిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి కారును ఎక్కువసేపు పార్క్‌ చేయాలని భావిస్తే హ్యాండ్‌బ్రేక్‌ను వేయకపోవడం ఉత్తమం. ఒకవేళ హ్యాండ్‌బ్రేక్‌ని బలవంతంగా అప్లై చేస్తే వారానికి లేదా 10 రోజులకు ఒకసారి కారును కొద్దిగా డ్రైవ్ చేస్తే బాగుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories