Car Engine Overheats: కారు ఇంజిన్‌ తరచుగా వేడెక్కుతుందా.. ఈ విషయాలు తెలుసుకోండి..!

Does the car engine overheat often know these things
x

Car Engine Overheats: కారు ఇంజిన్‌ తరచుగా వేడెక్కుతుందా.. ఈ విషయాలు తెలుసుకోండి..!

Highlights

Car Engine Overheats: కొంతమంది కష్టపడి, మరికొంతమంది ఇష్టపడి కారును కొంటారు. కానీ దాని మెయింటనెన్స్‌ తెలియకపోతే ఎక్కువ రోజులు నడపలేరు.

Car Engine Overheats: కొంతమంది కష్టపడి, మరికొంతమంది ఇష్టపడి కారును కొంటారు. కానీ దాని మెయింటనెన్స్‌ తెలియకపోతే ఎక్కువ రోజులు నడపలేరు. అంతేకాదు తీవ్రంగా నష్టపోతారు. అందుకే కారు గురించి కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు కారు ఇంజిన్‌ తరచుగా వేడెక్కుతుంటే ఏదో సమస్య ఉందని గుర్తించండి. ఓవర్ హీట్ అవ్వడం వల్ల ఒక్కోసారి కారులోంచి పొగ రావడం కూడా మొదలవుతుంది. కారు ఇంజిన్‌ టెంపరేచర్‌ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అసలు కారు ఎందుకు వేడెక్కుతుందో ఈ రోజు తెలుసుకుందాం.

కారు ఓవర్ హీటింగ్ అయితే ఇంజిన్ నుంచి పొగ రావడం మొదలవుతుంది. అంతేకాదు వైర్లు, రబ్బరు కాలిన వాసన వస్తుంది. కారు కూలెంట్ సరిగ్గా పనిచేయకపోతే లేదా కారులో తక్కువ కూలెంట్ ఉంటే కారు త్వరగా వేడెక్కుతుంది. ఇంజిన్ నుంచి వేడిని తొలగించడం రేడియేటర్ పని. రేడియేటర్‌లో ధూళి పేరుకుపోతే కారు వేడెక్కుతుంది. ఇంజిన్ టెంపరేచర్‌ను కంట్రోల్‌ చేయడానికి థర్మోస్టాట్ పనిచేస్తుంది. అయితే ఇందులో లోపం ఉంటే కారు త్వరగా వేడెక్కుతుంది.

కారు త్వరగా వేడెక్కకుండా ఉండాలంటే కూలెంట్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తూ ఉండాలి.రేడియేటర్‌లో దుమ్ము, ధూళి పేరుకుపోకుండా శుభ్రం చేయాలి. థర్మోస్టాట్‌లో ఎలాంటి లోపం ఉండకుండా చూసుకోవాలి. తరచుగా చెక్‌ చేస్తూ ఉండాలి. కారును క్రమం తప్పకుండా సర్వీస్ చేస్తూ ఉండాలి. వేసవిలో కారు వేడెక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆపకుండా ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంజిన్, రేడియేటర్ వేడిగా మారుతాయి. ఇలాంటి సమయంలో కారుకు కొద్దిసేపు రెస్ట్‌ అవసరమని గుర్తించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories