Petrol vs CNG: పెట్రోల్ వర్సెస్ సీఎన్‌జీ.. రెండిటిలో ఏది బెటర్.. వేల రూపాయలు ఆదా చేయొచ్చు..!

Petrol vs CNG
x

Petrol vs CNG 

Highlights

Petrol vs CNG: కార్లకు పెట్రోల్ కంటే సీన్ఎన్‌జీ బెటర్‌గా ఉంగటుంది. ఫ్యూయల్‌పై డబ్బు ఆదా చేయవచ్చు.

Petrol vs CNG: కారు కొనుగోలు చేసేటప్పుడు ఫ్యూయల్ పెద్ద సమస్య. ప్రతి ఒక్కరూ మంచి మైలేజీని కోరుకుంటారు. అయితే కొంతమంది పెట్రోల్‌తో మాత్రమే కారు నడపాలని కోరుకుంటారు. మరికొందరు ఇంధన ధరను తగ్గించడానికి CNG తో కూడా కారును నడపాలని కోరుకుంటారు. రెండు ఇంధనాలపై కారు నడుపుతున్న ఖర్చు గురించి మాట్లాడినట్లయితే రెండూ భిన్నంగా ఉంటాయి. మీరు CNG కారును కొనుగోలు చేసినట్లయితే ఈ లెక్కతో మీరు రెండు ఇంధనాలపై నెలవారీ ధరను సులభంగా అంచనా వేయవచ్చు. రండి, ప్రతిరోజూ 50 కిలోమీటర్లు కారు నడపడం ఆధారంగా ఒక నెలలో ఇంధన ఖర్చులను అర్థం చేసుకుందాం. వాటి మధ్య ఖర్చుల వ్యత్యాసాన్ని కూడా తెలుసుకుందాం.

Petrol
మీరు రోజూ మీ కారును పెట్రోల్‌తో నడుపుతున్నారంటే.. మీరు దానిని ఒక లెక్కతో అర్థం చేసుకోవచ్చు. మీ కారు పెట్రోల్‌పై 15 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందనుకుందాం. మీ సిటీలోని ఒక లీటర్ పెట్రోల్ ధర ₹103.44. దీని ప్రకారం ఒక రోజులో 50 కిలోమీటర్లు ప్రయాణించడానికి మీకు మొత్తం 3.3 లీటర్ల పెట్రోల్ అవసరం. అంటే లీటరు పెట్రోల్ ధర ప్రకారం మీ రోజువారీ ఖర్చు, లెక్క ప్రకారం రూ. 342.99 వస్తుంది. అంటే ఒక నెలలో (30 రోజులు) మీ పెట్రోల్ ఖర్చు రై. 10,289.70 అవుతుంది.

CNG
ఇప్పుడు మీరు మీ కారును ప్రతిరోజూ CNGతో నడుపుతున్నప్పటికీ, మీరు దానిని లెక్కల ద్వారా అర్థం చేసుకోవచ్చు. MGAutoGas ఫ్యూయల్ కాలిక్యులేటర్ ప్రకారం మీ అదే కారు CNGలో 24.75 కిలోమీటర్ల మైలేజీని ఇస్తే మీ సిటీలో ఒక కిలో CNG ధర రూ. 75 అయితే, మీరు ఒక రోజులో 50 కిలోమీటర్లు ప్రయాణించడానికి 2.02 కిలోగ్రాముల CNG అవసరమవుతుంది. అంటే CNG ధర ప్రకారం ఒక రోజులో కారు డ్రైవింగ్ ఖర్చు రూ. 151.50. అంటే ఒక నెలలో CNG ఖర్చు రూ. 4545 అవుతుంది.

ఇంధనంపై ఒక నెల ఖర్చులో పెట్రోల్, CNG ధరలో భారీ వ్యత్యాసం ఉన్నట్లు లెక్కను బట్టి స్పష్టమవుతుంది. మొత్తంమీద CNGతో కారును నడపడం ద్వారా మీరు నెలలో రూ. 5744.70 ఆదా చేస్తారు. CNGతో కారు నడపడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీరు కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహకరిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories