Car Cleaning Tips: రూ. 10 ఖర్చు చేస్తే చాలు.. క్షణాల్లో మీ కార్ ధగాధగా మెరవాల్సిందే..!

clean your car by using toothpaste and bucket water like new car shining
x

Car Cleaning Tips: రూ. 10 ఖర్చు చేస్తే చాలు.. క్షణాల్లో మీ కార్ ధగాధగా మెరవాల్సిందే..

Highlights

Car Cleaning Tips: ఈ పద్ధతిలో కారును శుభ్రపరిచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Car Cleaning Tips: చాలా మంది తమ కారును మెరిసేలా చేసేందుకు ప్రతిరోజూ శుభ్రం చేస్తుంటారు. అయినప్పటికీ కొంత దుమ్ము, ధూళిని సరిగ్గా శుభ్రం చేయరు. అయితే, ఇందుకు రూ. 300 నుంచి రూ. 500 మధ్య ఖర్చు అవుతుంది. ఇది ప్రతి ఒక్కరూ భరించడం చాలా కష్టం. అయితే, ఇందుకోసం చౌకైన పద్ధతిని తెలుసుకుందాం.. టూత్‌పేస్ట్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది దంతాల మెరుపు కోసం ఉపయోగిస్తుంటాం. అయితే, టూత్‌పేస్ట్‌తోనూ కార్‌ను తలాతలా మెరిసేలా చేయోచ్చు.

టూత్‌పేస్ట్‌తో శుభ్రం..

ఈ పద్ధతిలో కారును శుభ్రపరిచేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారు టైర్, రిమ్, కారు విండ్‌షీల్డ్‌తో ఇతర భాగాలను శుభ్రం చేయవచ్చు. వీటిని శుభ్రం చేయడానికి ఇంట్లో ఉన్న ఏదైనా సాధారణ టూత్‌పేస్ట్ తీసుకొని ఈ భాగాలపై అప్లై చేసి చేతులతో రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత నీటితో శుభ్రం చేయాలి. దీంతో టూత్‌పేస్ట్‌లో ఉండే సోడా కారణంగా కారులోని ఈ భాగాలు మెరుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories