Car Sales: భారీ ఆఫర్లు ప్రకటించినా, ఈ కార్‌ను కొనేందుకు ఆసక్తి చూపని వినియోగదారులు..

Citroen c5 Aircross Have Zero Sales in May 2024 check full details
x

Car Sales: భారీ ఆఫర్లు ప్రకటించినా, ఈ కార్‌ను కొనేందుకు ఆసక్తి చూపని వినియోగదారులు..

Highlights

గణాంకాలను పరిశీలిస్తే, Citroen C5 Aircrossను మే 2024లో ఒక్క కస్టమర్‌ కూడా కొనలేదు. అంటే మేనెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడవ్వలేదు.

Citroen C5 Aircross: ఒకవైపు మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి కంపెనీలు భారత కార్ మార్కెట్‌లో లక్షల సంఖ్యలో వాహనాలను విక్రయిస్తుంటే, మరోవైపు అమ్మకాల పరంగా కొన్ని కంపెనీలు దిగజారిపోతున్నాయి. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ భారతదేశంలో కార్లను విక్రయించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కంపెనీ బడ్జెట్ కార్లతో పాటు ప్రీమియం కార్ల అమ్మకాల పనితీరు కూడా తగ్గుతోంది.

గణాంకాలను పరిశీలిస్తే, Citroen C5 Aircrossను మే 2024లో ఒక్క కస్టమర్‌ కూడా కొనలేదు. అంటే మేనెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడవ్వలేదు. ఇది కంపెనీ టాప్-లైన్ ప్రీమియం SUV. ఈ ఏడాది జనవరి-మే మధ్య ఐదు నెలల కాలంలో ఈ కారు కేవలం 2 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మేలో ఇతర సిట్రోయెన్ కార్ల అమ్మకాల పనితీరు ఎలా ఉందో తెలుసుకుందాం.

సిట్రోయెన్ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన కారు..

సిట్రోయెన్ eC3, ఇది కంపెనీ C3 ఎలక్ట్రిక్ మోడల్. గత నెలలో దీని మొత్తం విక్రయాలు 235 యూనిట్లుగా ఉన్నాయి. ఇతర మోడళ్ల గురించి చెప్పాలంటే, 155 యూనిట్ల C3, 125 యూనిట్ల C3 ఎయిర్‌క్రాస్ అమ్మకాలు నమోదయ్యాయి. మొత్తంమీద, సిట్రోయెన్ మే నెలలో 515 యూనిట్ల కార్ల విక్రయాలను నమోదు చేసింది.

Citroen C5 ఎయిర్‌క్రాస్: ఇంజిన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు..

Citroen C5 ఎయిర్‌క్రాస్ ధర రూ. 36.91 లక్షల నుంచి మొదలై రూ. 37.67 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ కారులో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ 177 PS పవర్, 400 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది.

కారు కొన్ని ప్రత్యేక ఫీచర్ల గురించి మాట్లాడితే, ఇందులో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.

భద్రత పరంగా, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, డ్రైవర్ డ్రస్‌నెస్ డిటెక్షన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్ అసిస్ట్, పార్క్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories