వేగంలో రాజధాని, వందే భారత్‌లకు పోటీ.. ధరలో ప్యాసింజర్‌కు సమానం.. దేశంలోనే ఈ ట్రైన్‌కే ఫుల్ డిమాండ్..!

Check Sampoorna Kranti Express Train Speed and Ticket Price After Rajdhani Express and Vande Bharat in Indian Railway
x

వేగంలో రాజధాని, వందే భారత్‌లకు పోటీ.. ధరలో ప్యాసింజర్‌కు సమానం.. దేశంలోనే ఈ ట్రైన్‌కే ఫుల్ డిమాండ్..!

Highlights

Sampoorna Kranti Express: దసర అయినా, దీపావళి అయినా ఇలా ఏ పండుగైన సరే.. రైళ్లలో టిక్కెట్ల కోసం రద్దీ ఉంటుంది.

Sampoorna Kranti Express: దసర అయినా, దీపావళి అయినా ఇలా ఏ పండుగైన సరే.. రైళ్లలో టిక్కెట్ల కోసం రద్దీ ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రత్యేక రైళ్లు వేసినా.. అందులో సీట్ దొరకడం ఎంతో కష్టం. ఇక కొన్ని మార్గాల్లో రైళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజధాని, తేజస్, వందే భారత్ వంటి లగ్జరీ రైళ్లు నడుస్తోన్న ఈ మార్గంలో మరో రైలు కూడా పరుగులు పెడుతోంది. ఈ రైలు ఎంతో ప్రజాదరణ పొందింది. ప్రజలు దీనిని 'కామన్ మ్యాన్స్ రాజధాని ఎక్స్‌ప్రెస్' అని పిలుస్తుంటారు. న్యూ ఢిల్లీ, పాట్నాలోని రాజేంద్ర నగర్ టెర్మినల్ మధ్య నడుస్తున్న సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

దీనికి 18 మార్చి 1974న పాట్నాలో విద్యార్థులు, యువజన ఉద్యమం నుంచి ఉద్భవించిన నాయకుడు లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ పేరును పెట్టారు. సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ మొదటిసారి 16 ఫిబ్రవరి 2002న పట్టాలపై నడిచింది. దీని పేరు భారతీయ రైల్వే సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఒకటిగా చేర్చారు. దీని శక్తి రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే తక్కువేం కాదు. భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో ఒకటైన సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రాజధాని లాంటి సౌకర్యాలను తక్కువ ధరలకు అందించే రైళ్లలో ఒకటిగా పేరుగాంచింది. అటల్ బిహారీ వాయాపేయీ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఈ రైలును ప్రకటించారు.

న్యూఢిల్లీ, పాట్నా రాజేంద్ర నగర్ టెర్మినల్ మధ్య నడుస్తున్న ఈ రైలు పాట్నా రాజధాని ఎక్స్‌ప్రెస్ వెనుక నడుస్తుంది. దీని స్పీడ్ రాజధాని మాదిరిగానే ఉంటుంది. అయితే, ఛార్జీల పరంగా చాలా చౌకగా ఉంటుంది. బీహార్ వెళ్లడానికి ప్రజల మొదటి ఎంపికగా మారిన ఈ రైలు ఛార్జీ రాజధాని, తేజస్ ఎక్స్‌ప్రెస్ కంటే చాలా తక్కువ. సామాన్యుల బడ్జెట్‌తో కూడిన ఈ సూపర్‌ఫాస్ట్ రైలు టికెట్ విండో ఓపెన్ అయిన వెంటనే వెయింటింగ్ లిస్ట్‌లోకి వెళ్తుంది.

సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి నాన్-ఏసీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. దీని వేగం గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ రైలు ఢిల్లీ, పాట్నాల మధ్య 1001 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటలలోపే చేరుకుంటుంది.

సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ముందు, అన్ని రైళ్లు ICF కోచ్‌లతో నడిచాయి. ఈ రైలు హై స్పీడ్‌తోనే కాదు.. తక్కువ స్టాపేజ్‌లు ఉంచడంతో.. సామాన్యూలకు తక్కువ ధరలోనే సూపర్ ఫాస్ట్ ప్రయాణం అందుతుంది. తద్వారా ప్రయాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేస్తుంది. రైలు నంబర్ 12394 న్యూఢిల్లీ రాజేంద్ర నగర్ సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్ గతంలో మొఘల్‌సరాయ్, కాన్పూర్ మీదుగా న్యూఢిల్లీకి వెళ్లేది. ఆ సమయంలో కాన్పూర్‌లో రైలు టెక్నికల్‌గా నిలిచిపోయింది. తరువాత, ప్రజల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని స్టాఫ్‌లను పెంచారు. ఇప్పుడు రైలు కాన్పూర్, మీర్జాపూర్, పండిట్ దీనదయన్ ఉపాధ్యాయ్ జంక్షన్, అర్రా జంక్షన్ మీదుగా పాట్నా, రాజేంద్ర నంగర్ టెర్మినల్‌లకు చేరుకుంటుంది.

ఈ సూపర్ ఫాస్ట్ రైలు గంటకు 130 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇది ఢిల్లీ నుంచి పాట్నా వరకు ఉన్న దూరాన్ని తక్కువ సమయంలో కవర్ చేస్తుంది. రాజధానితో పోల్చితే ఎక్కువ ఆలస్యం లేకుండా సమయానికి గమ్యాన్ని చేరుకుంటుంది. అందుకే ప్రజలు దీనిని రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోల్చడం ప్రారంభించారు.

వేగంతో ఇది రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో పోటీపడుతుంది. కానీ, ఛార్జీలో ఇది సగం ఛార్జీలతో గమ్యాన్ని చేరుకుంటుంది. డైనమిక్ ధరతో ఢిల్లీ-పాట్నా రాజధాని ఎక్స్‌ప్రెస్ మూడవ AC ఛార్జీ కనీసం రూ. 2405లుగా ఉంది. అయితే సంపూర్ణ క్రాంతి ధర రూ. 1300 నుంచి 1500 మధ్య ఉంటుంది. అదేవిధంగా, డైనమిక్ రేటుతో, రాజధాని సెకండ్ ఏసీ కనీస ధర రూ. 3300 కాగా, సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో దాదాపు రూ. 1900లుగా ఉంది. డైనమిక్ ఫేర్‌లో డిమాండ్ పెరిగేకొద్దీ టికెట్ ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయని తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories