Car Care Tips: చలికాలంలో కార్లు త్వరగా స్టార్ట్​కావు.. కారణాలు నివారణలు తెలుసుకోండి..!

Cars do not start Quickly in Winter know the Reasons and Remedies
x

Car Care Tips: చలికాలంలో కార్లు త్వరగా స్టార్ట్​కావు.. కారణాలు నివారణలు తెలుసుకోండి..!

Highlights

Car Care Tips: చలికాలం వచ్చేసింది దీంతో ఉదయం పూట వాహనాలు అంత త్వరగా స్టార్ట్​ కావు. ముఖ్యంగా కార్లు బాగా ఇబ్బందిపెడుతాయి.

Car Care Tips: చలికాలం వచ్చేసింది దీంతో ఉదయం పూట వాహనాలు అంత త్వరగా స్టార్ట్​ కావు. ముఖ్యంగా కార్లు బాగా ఇబ్బందిపెడుతాయి. చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్​, డీజిల్​ రెండు రకాల కార్లలో ఈ సమస్య ఉంటుంది. కానీ ఎక్కువగా డీజిల్​ కార్లలో సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కారు స్టార్ట్ కాకపోవడానిక అనేక కారణాలు ఉండవచ్చు. కానీ వాటిని సులభంగా నివారించవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కారు స్టార్ట్ కాకపోవడానికి కారణాలు

చలి కారణంగా ఇంజిన్ ఆయిల్ చిక్కగా మారుతుంది. దీనివల్ల ఇంజిన్ పిస్టన్‌ను సిలిండర్‌లో పైకి కిందికి తరలించడానికి ఎక్కువ శక్తి అవసరం. ఇది స్టార్టర్ మోటారుపై ఒత్తిడిని పెంచుతుంది. చలి కారణంగా బ్యాటరీ సామర్థ్యం కూడా తగ్గుతుంది. దీనివల్ల స్టార్టర్ మోటారు కొన్నిసార్లు అవసరమైన కరెంట్‌ను ఉత్పత్తి చేయలేదు. ఇది కారును స్టార్ట్ చేయడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. చలి కారణంగా ఇంధనం మండటం సరిగ్గా జరగదు. దీనివల్ల ఇంజిన్ స్టార్ట్ కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమస్య పెట్రోల్ కార్లలో కంటే డీజిల్ కార్లలో ఎక్కువగా కనిపిస్తుంది.

చలికాలంలో కారు స్టార్ట్ చేసే చిట్కాలు

కారు బ్యాటరీని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. బ్యాటరీ ఛార్జింగ్ స్థాయి ఎల్లప్పుడూ 12.6 వోల్ట్‌ల కంటే ఎక్కువగా ఉండాలి. చలికాలం ప్రారంభమయ్యే ముందు బ్యాటరీని చెక్​ చేయాలి. అవసరమైతే కొత్తది మార్చాలి. చలికాలంలో కారును బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయవద్దు. దీనివల్ల చలి పెరిగి కారు ఇంజిన్, బ్యాటరీ ఎక్కువగా ప్రభావితమవుతాయి. దీనిని నివారించాలంటే కారును కవర్ షెడ్‌లో పార్క్ చేయడం ఉత్తమం. కారు స్టార్ట్ కాకపోతే మరొక కారు బ్యాటరీ లేదా కార్ జంక్షన్‌ని ఉపయోగించవచ్చు. దీనితో కారు స్టార్టర్ మోటార్ తగినంత కరెంట్ పొందగలుగుతుంది. దీని తర్వాత కూడా కారు స్టార్ట్ కాకపోతే కారు ఇంజిన్ వేడెక్కేలా కొన్ని ఏర్పాట్లు చేసి ఆపై కారుని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories