Cars Sales: భారీగా పడిపోయిన కార్ల సేల్స్.. పండగ వేళ భారీ డిస్కౌంట్లతో కార్ల కంపెనీలు, ఏ కంపెనీ డిస్కౌంట్ ఎంతంటే..?

Car sales have fallen heavily Car companies with huge discounts during the festival
x

Cars Sales: భారీగా పడిపోయిన కార్ల సేల్స్.. పండగ వేళ భారీ డిస్కౌంట్లతో కార్ల కంపెనీలు, ఏ కంపెనీ డిస్కౌంట్ ఎంతంటే..?

Highlights

Cars Sales: దసరా, దీపావళి వచ్చింది అంటేనే పెద్ద ఎత్తున కార్ల అమ్మకాలు ఉంటాయి అని వ్యాపార వర్గాలు అంచనా వేస్తూ ఉంటాయి. ఎందుకు తగ్గట్టుగానే పలు కంపెనీలు సైతం కొత్త మోడల్స్ అందుబాటులోకి తెస్తుంటాయి. సంవత్సరం మొత్తం తో పోల్చి చూసినట్లయితే.. ఈ ఒక్క నెలలోనే పెద్ద ఎత్తున కార్లను కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

దసరా దీపావళి అనేవి కార్లు టూ వీలర్స్ కొనుగోలు చేయడానికి మంచి అనుకూలమైన సమయంగా మార్కెట్ భావిస్తుంది. అయితే అనూహ్యంగా 2024 సంవత్సరం మాత్రం కార్ల సేల్స్ పెద్దగా లేవని కంపెనీలు వాపోతున్నాయి. ముఖ్యంగా డీలర్లు తమ వద్ద కార్లు అమ్ముడుపోక పెద్ద ఎత్తున నిలిచిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. సెప్టెంబర్ నెలలో దాదాపు 20 శాతంపైగా కార్ల సేల్స్ పడిపోయాయి.

ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం 79 వేల కోట్ల విలువైన ఎనిమిది లక్షల కార్లు డీలర్ల వద్ద మిగిలిపోయాయి అని తమ ప్రకటనలో పేర్కొంది. వీటి విలువ దాదాపు 90 రోజుల స్టాక్ తో సమానమని పేర్కొంది. సెప్టెంబర్ నెలలో రిటైల్ కార్ల అమ్మకాలు దాదాపు 20% పైగా తగ్గుముఖం పట్టాయని ఈ రిపోర్టులోనే తెలిపింది. అలాగే టూ వీలర్ అమ్మకాలు సైతం దాదాపు తొమ్మిది శాతం వరకు తగినట్లు పేర్కొంది. ఇక కమర్షియల్ వాహనాల అమ్మకాలు సైతం 11 శాతం వరకు తగ్గాయి.

టాటా కార్లపై 1.30 లక్షల రూపాయల డిస్కౌంట్ :

మరోవైపు తమ కార్ల సేల్స్ పెంచుకోవాలని పలు కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్ దాదాపు తమ 6 మోడల్స్ పై భారీ తగ్గింపు ప్రకటించింది ఇందులో టాటా టియాగో, టాటా ఆల్ట్రోస్, టాటా పంచ్, టాటా నెక్సన్, టాటా సఫారీ, టాటా హరియర్ ఉన్నాయి, వీటిపై దాదాపు రూ. 1.30 లక్షల వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

హుందాయి కార్ల మోడల్స్ పై భారీ డిస్కౌంట్ :

హుందాయి కార్లపై కూడా పెద్ద ఎత్తున డిస్కౌంట్ అందించేందుకు కంపెనీ వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ ఫెస్టివల్ సీజన్లో ఎలాగైనా సరే సేల్స్ పెంచుకోవాలని, హ్యుందాయ్ తమ మోడల్స్ ఎక్స్ టర్, ఐ 10, ఐ 20 కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. వీటిలో ప్రధానంగా సిఎన్జి మోడల్ లపై ఈ ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories