న్యూ ఇయర్ లో భారీగా పెరగనున్న ఈ కంపెనీల బైక్, కార్ల ధరలు.. కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!

Car and BMW Motorrad Models Bike Scooter Price Hike in New Year
x

న్యూ ఇయర్ లో భారీగా పెరగనున్న ఈ కంపెనీల బైక్, కార్ల ధరలు.. కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!

Highlights

BMW: మీరు కొత్త బైక్ లేదా కారుతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నారా.. పొరపాటు చేస్తున్నట్లే.

BMW: మీరు కొత్త బైక్ లేదా కారుతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నారా.. పొరపాటు చేస్తున్నట్లే. ఈ బైక్‌ను ఇప్పుడైతే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కొత్త సంవత్సరంలో ఈ బైక్ ధరలు 2.5 శాతం పెరగవచ్చు. నూతన సంవత్సరంలో కొన్ని కార్లు చౌకగా మారగా, కొన్నింటి ధరలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఎండబ్ల్యూ కంపెనీ తన బైక్ ధరను పెంచేందుకు సిద్ధమవుతోంది. BMW Motorrad ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను జనవరి 1 నుండి పెంచబోతోంది. ఏయే కార్లు, బైక్‌ల ధరలు పెరగబోతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

బీఎండబ్ల్యూ మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని మోడళ్ల ధరలను పెంచే అవకాశం ఉంది. వాటిలో కొన్నింటి ధర,పేరు ఇక్కడ ఈ వార్తలో తెలుసుకుందాం. ఈ బైక్‌లు, స్కూటర్లు, కార్ల ధరలు పెరగనున్నాయి.

BMW Motorrad మోడల్స్, ధరలు

* BMW Motorrad 27 మోడళ్లలో 24 బైక్‌లు, మూడు స్కూటర్లు ఉన్నాయి. స్కూటర్ల గురించి మాట్లాడినట్లయితే.. ఈ మూడు స్కూటర్లలో CE 02, CE 04, C 400 GT ఉన్నాయి.

* ఇందులో, BMW CE 04 భారతదేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని తర్వాత రూ. 5 లక్షల ధరతో CE 02 వస్తుంది.

* TVS కంపెనీ సహకారంతో తయారు చేయబడిన G 310 R బీఎండబ్ల్యూ చౌకైన బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 2.90 లక్షలు.

* BMW అత్యంత ఖరీదైన బైక్ M 1000 RR. ఈ బైక్ ధర చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఈ బైక్ ధర దాదాపు రూ.55 లక్షలు.

మెర్సిడెస్ బెంజ్ కార్లు

* మెర్సిడెస్ బెంజ్ కంపెనీ కూడా కొత్త సంవత్సరంలో తన కారు ధరను పెంచబోతోంది. కంపెనీ ప్రకారం, జనవరి 1, 2025 న, మెర్సిడెస్ వాహనాల ధరలు 3 శాతం వరకు పెరుగుతాయి.

* భారతదేశంలో Mercedes-Benz ద్వారా ధరలు పెంచబోతున్న మోడల్‌లలో GLC, Mercedes-Maybach ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ధర రూ.2 లక్షల మేర పెరగనుండగా, మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 680 లగ్జరీ లిమోసిన్ ధర రూ.9 లక్షల మేర పెరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories