BYD emax 7: టాప్ ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ఇక ఛార్జింగ్ సమస్య లేనట్లే!

BYD has released a new car named eMAX7 in India
x

BYD emax 7: టాప్ ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి కొత్త కార్ వచ్చేసింది.. ఇక ఛార్జింగ్ సమస్య లేనట్లే!

Highlights

BYD emax 7: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనల తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్స్ (BYD) ఇండియాలో eMAX7 పేరుతో సరికొత్త కారును మార్కెట్లోకి రిలీజ్ చేసింది. గతంలో తీసుకొచ్చిన బీవైడీ ఈ6 కి కొనసాగింపుగా ఈమ్యాక్స్ 7 పేరుతో ఈ కారును లాంఛ్ చేసింది.

BYD emax 7: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనల తయారీ సంస్థ బిల్డ్ యువర్ డ్రీమ్స్ (BYD) ఇండియాలో eMAX7 పేరుతో సరికొత్త కారును మార్కెట్లోకి రిలీజ్ చేసింది. గతంలో తీసుకొచ్చిన బీవైడీ ఈ6 కి కొనసాగింపుగా ఈమ్యాక్స్ 7 పేరుతో ఈ కారును లాంఛ్ చేసింది. చూడటానికి అచ్చం టొయొటా ఇన్నోవా లాగా ఉన్న ఈ కారు మార్కెట్లోకి రిలీజై అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ కారు ఫీచర్స్ ఏంటి. ధర ఎంత? ఈ కారు స్పెషల్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ధర

BYD emax 7 కారు ప్రీమియం అండ్ సుపీరియర్ రెండు మోడల్స్ లో లభిస్తుంది. రెండు వేరియంట్లలోనూ 6,7 సీటింగ్ కెపాసిటీ ఆప్షన్స్ ను కంపెనీ అందిస్తోంది. దీని ప్రారంభ ధర 26.90 లక్షలుగా ఉంది. హైఎండ్ వేరియంట్ ధర 29.90 లక్షలుగా ఉంది.

బ్యాటరీ

ప్రీమియం వేరియంట్లో 55.4 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. ఇది సింగిల్ ఛార్జ్ తో 420 కిలోమీటర్లు వెళ్లగలుగుతుంది. సుపీరియర్ వేరియంట్ లో 71.8 కిలోవాట్ల బ్యాటరీని అమర్చారు. ఈ వేరియంట్ సింగిల్ ఛార్జ్ తో 530 కిలోమీటర్ల వరకూ వెళ్లగలదు.

ఫీచర్లు

కారు ముందుభాగంలో LED హెడ్ ల్యాంప్స్ తో పాటు డేటైం రన్నింగ్ లైట్స్ ( DRL) ఉన్నాయి. అంతేగాకుండా బ్యాక్ సైడ్ లెడ్ టెయిల్ ల్యాంప్స్, కారులోపలి భాగంలో లెడ్ రీడింగ్ లైట్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్స్ ఉన్నాయి. 6 స్పీకర్స్ మ్యూజిక్ సిస్టం తో పాటుగా యాపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ఆప్షన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్రైవర్ తో పాటుగా ముందుసీట్లో ఉన్న ప్యాసింజర్ సీట్లను ఎలక్ట్రానిక్ విధానంలో అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుంది.

సేఫ్టీ

ఇక సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్, క్రిటికల్ కండిషన్స్ లో కారును హ్యాండిల్ చేసేలా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. అంతేగాకుండా వెహికిల్ డైనమిక్ కంట్రోల్ సిస్టం, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం, పార్కింగ్ సెన్సార్స్, 360 డిగ్రీ కెమెరా అండ్ సేఫ్టీ అండ్ కంఫోర్ట్ కోసం అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

అంతేగాకుండా ఈ కారులో బ్యాటరీపై 8 ఏళ్లు / 1.6 లక్షల కిలోమీటర్లు వరకు బీవైడీ స్టాండర్డ్ వారెంటీ ఇస్తోంది. మోటార్ పై 8 సంవత్సరాలు/ 5 లక్షల కిలోమీటర్ల వరకూ వారెంటీ ఇస్తోంది. ఈ కారు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రతీ సంవత్సరం దసరా పండుగ సీజన్‌లో కార్ల అమ్మాకాలు అధికంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో దేశీయ కంపెనీ కార్లకు గట్టి పోటీ ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories