BMW: 35 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్.. 635కిమీల మైలేజీ.. కళ్లు చెదిరే ఫీచర్లతో వచ్చిన BMW iX xDrive50.. ధర తెలిస్తే షాకే..!

BMW iX xDrive 50 launched with high class features and price Rs 139 crore
x

BMW: 35 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్.. 635కిమీల మైలేజీ.. కళ్లు చెదిరే ఫీచర్లతో వచ్చిన BMW iX xDrive50.. ధర తెలిస్తే షాకే..!

Highlights

bmw ix xdrive50: BMW ఇండియా తన సరికొత్త iX xDrive50ని దేశంలో రూ. 1,39,50,000 (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది.

BMW ix xdrive50: BMW ఇండియా తన సరికొత్త iX xDrive50ని దేశంలో రూ. 1,39,50,000 (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ SUV పూర్తిగా లోడ్ చేసిన సింగిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. CBU మార్గం ద్వారా భారతదేశానికి తీసుకొచ్చారు.

ఈ ఎలక్ట్రిక్ SUVలో ఫ్రీస్టాండింగ్ 14.9-అంగుళాల కర్వ్డ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, 18-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సరౌండ్-వ్యూ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

BMW iX xDrive50 111.5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్-మోటార్ సెటప్‌తో అందించింది. ఇది 516bhp శక్తిని, 765Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 635 కిమీల పరిధిని అందిస్తుంది. 195 kW వరకు DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories