HUM E-Cycle Offer: 35 వేల 'హమ్' ఎలక్ట్రిక్ సైకిల్‌.. 4 వేలకే వచ్చేస్తోంది! ఫుల్ డీటెయిల్స్ ఇవే

HUM E-Cycle Offer
x

HUM E-Cycle Offer: 35 వేల 'హమ్' ఎలక్ట్రిక్ సైకిల్‌.. 4 వేలకే వచ్చేస్తోంది! ఫుల్ డీటెయిల్స్ ఇవే

Highlights

HUM E-Cycle Offer: ప్రస్తుతం ఎలక్ట్రిక్ సైకిల్‌ల హవా నడుస్తోంది. ఈ సైకిల్‌లకు పెట్రోల్‌ అవసరం లేదు, మెయింటెనెన్స్‌ కుడా చాలా తక్కువ.

HUM E-Cycle Offer: ప్రస్తుతం ఎలక్ట్రిక్ సైకిల్‌ల హవా నడుస్తోంది. ఈ సైకిల్‌లకు పెట్రోల్‌ అవసరం లేదు, మెయింటెనెన్స్‌ కుడా చాలా తక్కువ. అంతేకాదు ట్రాఫిక్ ఉందన్న భయం కూడా ఉండదు. సందుల్లో అయినా, రోడ్డుపై అయినా.. రయ్ రయ్ అంటూ దూసుకెళ్లొచ్చు. అందుకే ఒకప్పటి సైకిల్‌ల మాదిరిలా.. ఇప్పుడు ఈ సైకిల్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చాలానే ఈ సైకిల్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయితే భారత దేశ మొదటి మల్టీ యుటిలిటీ ఈ-సైకిల్ 'హమ్'కు మంచి క్రేజ్ ఉంది. ఈ సైకిల్ ధర రూ.30 వేలు కాగా.. కేవలం రూ.4 వేలకే మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో హమ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.34,849గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 6 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది. దాంతో రూ.32,749కే కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుపై 5 శాతం డిస్కౌంట్ ఉంది. దాంతో మరో రూ.1500 తగ్గనుంది. అప్పుడు హమ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ రూ.31,500కి మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. అయితే మీ వద్ద పూర్తి మొత్తం లేకుంటే.. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలకు రూ.1600 ఈఎంఐ ప్లాన్ ఎంచుకుంటే.. 24 నెలలు కట్టాల్సి ఉంటుంది. అదే రూ.3,886 ప్లాన్ ఎంచుకుంటే.. 9 నెలలు కట్టాలి. 3 నెలల నుంచి 24 నెలల వరకు ఈఎంఐ ప్లాన్స్ ఉన్నాయి.

హమ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ భారత దేశ మొదటి మల్టీ యుటిలిటీ ఈ-సైకిల్. కార్గో ఈ-సైకిల్ అని కూడా అంటున్నారు. సామాన్లు తీసుకెళ్లేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ సైకిల్ 120 కేజీల బరువును మోయగలదు. సామాన్యులకు బాగా ఉపయోగపడుతుంది. రోజువారీ అవసరాలకు వాడుకోవచ్చు. ఈ సైకిల్ అన్ని రకాల రోడ్లపై వెళ్లగలదు. దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 105 కిలోమీటర్ల ప్రయాణం ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీని బయటకు కూడా తీయొచ్చు. ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా ఇలా ఇచ్చారు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతుంది. ఇందులో డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, మల్టీ ఫంక్షనల్ డిస్‌ప్లే ఉంది. ఈ సైకిల్‌ని మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకుని.. జీపీఎస్ ట్రాకర్‌తో ఎక్కడుందో లొకేట్ చేసుకోవచ్చు. ఇది నీటిలో వెళ్లినా పాడవదు. హమ్ సైకిల్ బరువు 27 కేజీలు. హమ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ రంగుల్లో (ఆరెంజ్, బ్లాక్, బెర్రీ బ్లూ, కార్బన్ గ్రే) అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories