Best Mileage Bike: తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్.. ఒక్క లీటర్‌తో 75 కి.మీలు..!

Bajaj Platina 100 Low Cost With Highest Mileage Bike in India Check Price and Mileage Features
x

Best Mileage Bike: తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్.. ఒక్క లీటర్‌తో 75 కి.మీలు..!

Highlights

Low Cost And Best Mileage Bike: అలాగే 4 రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ నాలుగు వేరియంట్స్ ధరలను ఓసారి పరిశీలిస్తే.. ప్రారంభ వేరియంట్ ధర రూ.62,638ల్లో లభిస్తుండగా.. టాప్ వేరియంట్ రూ.79,282లకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ బైక్..

Low Cost And Best Mileage Bike: ప్రస్తుతం బైక్స్ మనలో ఓ భాగంగా మారిపోయాయి. అయితే, ఎక్కువగా తక్కువ ధరలో లభించే బెస్ట్ బైక్స్ కోసం వెతుకుతుంటారు. అందుకే ఇలాంటి ఓ అద్భుతమైన బైక్‌ను తీసుకొచ్చాం. ఈ బైక్ ఫీచర్స్ తెలిస్తే కచ్చితంగా అవాక్కవుతారంతే. దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రతీరోజూ బైక్‌పై తిరగాలంటే.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాల్సిందే. ఇప్పుడు చెప్పబోయే బైక్ ఒక లీటరు పెట్రోల్‌తో 75 కిలోమీటర్లు చుట్టేయోచ్చు. ఆ బైక్ మరెంటో కాదు.. బజాజ్ ప్లాటినా 100. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్‌లో అగ్రస్థానంలో బజాజ్ ప్లాటినా 100 ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ బైక్స్ ఫీచర్స్ ఏంటో ఇప్పడు తెలుసుకుందాం..

భారత మార్కెట్లో ఈ బైక్‌కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలో బజాజ్ ప్లాటినా 100 ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఇదే ఈ బైక్‌కు అధిక డిమాండ్ ఇచ్చేలా చేసింది. బజాజ్ ప్లాటినా 100 బైక్ 4 వేరియంట్స్‌లో లభిస్తుంది. అలాగే 4 రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ నాలుగు వేరియంట్స్ ధరలను ఓసారి పరిశీలిస్తే.. ప్రారంభ వేరియంట్ ధర రూ.62,638ల్లో లభిస్తుండగా.. టాప్ వేరియంట్ రూ.79,282లకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ బైక్ గ్రామీణ ప్రాంతాల్లోని కస్టమర్ల అవసరాల మేరకు తయారు చేసిన బైక్. బజాజ్ ప్లాటినా 100 బైక్ కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్ వెర్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇందులో మరో స్పెషాలిటీ ఏంటంటే.. బైక్ ఫ్రంట్ బ్రేక్స్, రియర్ బ్రేక్స్ రెండూ డ్రమ్ బ్రేక్స్‌తో సిద్ధం చేశారు.

ఫీచర్స్, స్పెసిఫికేషన్స్..

ఇది 7.79 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే 102 సీసీ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 11 లీటర్లు. ఈ బైక్‌లో ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. భద్రత కోసం మోటార్‌సైకిల్‌లో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు. మోటార్‌సైకిల్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో పాటు టెలిస్కోపిక్ ఫోర్, డ్యూయల్ షాక్ సస్పెన్షన్‌ను అందించారు. అయితే దాని టాప్ వేరియంట్‌లో ఎలక్ట్రిక్ స్టార్ట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. మోటారుసైకిల్ విస్తృత పొడవైన సీటును కలిగి ఉంది. ఇది ప్రయాణాన్ని చాలా సౌకర్యవంతంగా చేస్తుంది. అదే సమయంలో, కార్బ్యురేటర్‌ను తొలగించడం ద్వారా ఫ్యూయెల్ ఇంజెక్షన్ టెక్నాలజీని అమర్చిన ఈ మోటార్‌సైకిల్ బరువు కూడా 111 కిలోలే. దీని కారణంగా సిటీ రైడ్‌కి కూడా ఇది మంచి ఎంపికగా మారుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories