Bajaj Chetak 3201: బజాజ్ చెతక్ స్పెషల్ ఎడిషన్.. సింగిల్ ఛార్జ్‌‌తో 136 కిమీ పరుగెడుతుంది !

Bajaj Chetak 3201: బజాజ్ చెతక్ స్పెషల్ ఎడిషన్.. సింగిల్ ఛార్జ్‌‌తో  136 కిమీ పరుగెడుతుంది !
x

Bajaj Chetak 3201

Highlights

Bajaj chetak 3201: బజాజ్ చెతక్ 3201 ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషల్ ఎడిషన్‌ లాంచ్ చేసింది. ఇది సింగిల్ ఛార్జ్‌తో 136 కిమీ రేంజ్ ఇస్తుంది.

Bajaj Chetak 320: బజాజ్ ఆటో తన చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త ఎడిషన్ 3201 విడుదల చేసింది. దీన్ని దాని టాప్-స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా డిజైన్ చేశారు. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై136 కిమీ రేంజ్ అందిస్తోంది. ఇందులో ఇది 3.2kWh బ్యాటరీ ప్యాక్‌ అందించారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించారు. ఈ ధర EMPS-2024 స్కీమ్‌లో ఉంది. అందువల్ల రూ.10 వేల తక్కువకే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ స్కూటర్‌ను అమోజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ స్కూటర్ దాని టాప్-స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇది బ్రూక్లిన్ బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ స్పెషల్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది IP67 రేటింగ్‌‌‌తో వస్తుంది. అదే సమయంలో బ్లూటూత్ కనెక్టివిటీ, చేతక్ యాప్, కలర్ TFT డిస్‌ప్లే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హజార్డ్ లైట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్‌లో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇది స్టీల్ బాడీతో మాత్రమే రానుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషల్ ఎడిషన్‌లో సైడ్ ప్యానెల్, స్కఫ్ ప్లేట్, డ్యూయల్-టోన్ సీటుపై 'చేతక్' డీకాల్స్ ఉన్నాయి. ఇది బాడీ కలర్ రియర్ వ్యూ మిర్రర్, శాటిన్ బ్లాక్ గ్రాబ్ రైల్, మ్యాచింగ్ పిలియన్ ఫుట్‌రెస్ట్, హెడ్‌ల్యాంప్ కేసింగ్‌కు చార్కోల్ బ్లాక్ ఫినిషింగ్‌ను పొందుతుంది.

ఇది డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్, LED లైటింగ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, మెటల్ బాడీ ప్యానెల్, IP67 వాటర్‌ఫ్రూఫింగ్‌తో కూడిన బ్యాటరీతో వస్తుంది. బ్రేకింగ్ కోసం, రెండు వైపులా డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్స్, కాల్ అలర్ట్‌లు, కస్టమైజ్‌డ్ థీమ్‌లతో కలర్ TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫాలో మీ హోమ్ లైట్, బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి.

బజాజ్ చేతక్ 3201 టెక్‌ప్యాక్ సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలో హిల్-హోల్డ్ కంట్రోల్, అదనపు 'స్పోర్ట్' రైడ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది. దీనిలో 3.2kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 136 కిమీల రేంజ్ ఇస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి 5.30 గంటల టైమ్ తీసుకుంటుంది. ఇది ప్రస్తుత ప్రీమియం మోడల్ రేంజ్ 127కిమీ కంటే ఎక్కువ. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 73కిమీ. ఇది Ather Rizzta Z, Ola S1 Pro, TVS i-Cube వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories