Bajaj Freedom 125 CNG Bike: ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైక్ విడుదల.. ఫుల్ ట్యాంక్‌తో 330 కిమీల మైలేజీ.. ధరెంతంటే?
Bajaj Freedom 125 CNG Bike: బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ ఫ్రీడమ్ 125 ను భారతదేశంలో నేడు విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 95,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
Bajaj CNG Bike: బజాజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ ఫ్రీడమ్ 125 ను భారతదేశంలో నేడు విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 95,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. డిస్క్ LED, డ్రమ్ LED, డ్రమ్ అనే మూడు వేరియంట్‌లలో కంపెనీ దీనిని పరిచయం చేసింది. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధర రూ.95,000లు కాగా, డ్రమ్ ఎల్ఈడీ ధర రూ.1,05,000, డిస్క్ ఎల్ఈడీ ధర రూ.1,10,000లుగా పేర్కొంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ప్రకారం ఉన్నాయి.
📍 𝐏𝐮𝐧𝐞
— Nitin Gadkari (@nitin_gadkari) July 5, 2024
𝙇𝙖𝙪𝙣𝙘𝙝𝙚𝙙 𝙩𝙝𝙚 𝙒𝙤𝙧𝙡𝙙’𝙨 🌏 𝙁𝙞𝙧𝙨𝙩 𝘾𝙉𝙂 𝙈𝙤𝙩𝙤𝙧𝙘𝙮𝙘𝙡𝙚 🏍 𝙗𝙮 𝘽𝙖𝙟𝙖𝙟 𝘼𝙪𝙩𝙤 𝙞𝙣 𝐏𝐮𝐧𝐞 𝙩𝙤𝙙𝙖𝙮.
This groundbreaking innovation promises significant savings in operating costs and pollution reduction. With this eco-friendly… pic.twitter.com/TLyiLP38At
ఫ్రీడమ్ 125 CNG బైక్‌లో LED హెడ్‌లైట్, మోనోషాక్ రియర్ సస్పెన్షన్, LED హెడ్‌లైట్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అనేక రకాల క్రాష్ టెస్ట్‌ల ద్వారా ధృవీకరించిన ఈ బైక్‌కు కంపెనీ బలమైన డిజైన్‌ను అందించింది. ఈ బైక్‌లో 2 కిలోల సీఎన్‌జీ ట్యాంక్, 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌ను అమర్చారు.
ఇంజిన్, పవర్..
కంపెనీ ఇందులో 125సీసీ డ్యూయల్ ఫ్యూయల్ ఇంజన్‌ను ఏర్పాటు చేసింది. ఇది 9.5PS పవర్, 9.7 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
మైలేజీ ఎంత?
ఫ్రీడమ్ 125లో 2 లీటర్ CNG ట్యాంక్, 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉన్నాయి. బైక్‌లో ఇంధనాన్ని ఎంచుకోవడానికి హ్యాండిల్‌పై స్విచ్ కూడా అందించింది. ఈ బైక్‌ను నడపడం చాలా పొదుపుగా ఉంటుంది. ఈ బైక్ 330 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది. సమాచారం ప్రకారం, కంపెనీ త్వరలో బైక్ డెలివరీని ప్రారంభించవచ్చు.
బజాజ్ ఫ్రీడమ్ బైక్ ఫీచర్లు..
బజాజ్ ఫ్రీడమ్ మూడు వేరియంట్‌లను కలిగి ఉంది. ఇందులో డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ బ్రేకింగ్ సిస్టమ్‌లు అందుబాటులో ఉన్నాయి.
బజాజ్ ఫ్రీడమ్ సమకాలీన స్టైలింగ్‌తో పొడవైన, వెడల్పాటి సీటు (785 MM) కలిగి ఉంది.
బజాజ్ ఫ్రీడమ్ బలమైన ట్రేల్లిస్ ఫ్రేమ్, ఇన్నోవేటివ్ టెక్ ప్యాకేజింగ్, లింక్డ్ మోనోషాక్‌ని కలిగి ఉంది.
బజాజ్ ఫ్రీడమ్ 7 రంగులలో ప్రారంభించారు. ఇందులో మోడల్ కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్-గ్రే, ఎబోనీ బ్లాక్-రెడ్, ప్యూటర్ గ్రే-బ్లాక్, ప్యూటర్ గ్రే-ఎల్లో, రేసింగ్ రెడ్‌తో పాటు సైబర్ వైట్‌లలో లభిస్తుంది.
బజాజ్ ఫ్రీడమ్ బైక్‌లో 2 లీటర్ పెట్రోల్ ట్యాంక్ + 2 లీటర్ సీఎన్‌జీ ట్యాంక్ ఉన్నాయి.
బజాజ్ ఫ్రీడమ్ 125CC పెట్రోల్ ఇంజన్‌ని పొందుతుంది. దీనితో ఇది 9.5 PS పవర్, 9.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire