ఈ 2 బైక్‌లు బద్ద శత్రువులు.. మార్కెట్‌లో విపరీతమైన పోటీ..!

Bajaj CT125x vs Honda Shine Features Price Check for all Details
x

ఈ 2 బైక్‌లు బద్ద శత్రువులు.. మార్కెట్‌లో విపరీతమైన పోటీ..!

Highlights

Honda Shine Bajaj ct125x: నేటి కాలంలో ఒక సామాన్యుడు ఒక బైక్‌ కొనాలంటే చాలా విషయాలు ఆలోచిస్తున్నాడు.

Honda Shine Bajaj ct125x: నేటి కాలంలో ఒక సామాన్యుడు ఒక బైక్‌ కొనాలంటే చాలా విషయాలు ఆలోచిస్తున్నాడు. బైక్‌ ధర నుంచి మైలేజ్‌, ఫీచర్స్‌ ఇలా అన్నిటిని పరిశీలిస్తున్నాడు. అయితే చాలామంది తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యాలు అందించే బైక్‌ని కొనాలని ఆలోచిస్తారు. అలాంటి రెండు బైక్‌ల మధ్య మార్కెట్‌లో పోటీ నెలకొంది. బజాజ్ CT125X, హోండా షైన్. ఈ రెండింటి ధరలు, ఫీచర్లు, ఇంజన్ స్పెసిఫికేషన్‌ల మధ్య పెద్దగా తేడా లేదు. దీని కారణంగా కస్టమర్లు తమకు ఏ బైక్ బెటర్ అని గందరగోళానికి గురవుతున్నారు.

డిజైన్, ఫీచర్లు

బజాజ్ CT125X, హోండా షైన్ రెండింటి డిజైన్ చాలా బాగుంది. బజాజ్ CT125X డిజైన్ గురించి మాట్లాడితే ఇది ఒక రౌండ్ హాలోజన్ హెడ్‌లైట్‌ని పొందుతుంది. దీంతో పాటు హెడ్‌లైట్ కవర్ అందుబాటులో ఉంది. అంతేకాదు హెడ్‌లైట్ పైభాగంలో LED స్లైడ్‌లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు హోండా షైన్‌లో హాలోజన్ హెడ్‌లైట్లు ఉన్నాయి. అయితే ఇది గుండ్రంగా లేదు. ఫీచర్ల గురించి చెప్పాలంటే అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ రెండింటిలోనూ ఉంది. CT125X USB ఛార్జర్, LED DRLలను పొందుతుంది. అయితే ఇక్కడ హోండా వెనుకబడి ఉంది. మరోవైపు హోండా షైన్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్‌ను పొందుతుంది. బ్రేకింగ్ సెటప్ కూడా రెండింటిలో ఒకే విధంగా ఉంది.

ధర

బజాజ్ CT125X 10 bhp శక్తిని, 11 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగల 125cc, ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. ఇది ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌ని పొందుతుంది. మరోవైపు హోండా షైన్ 123.9cc, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 10.59bhp శక్తిని, 11Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కూడా పొందుతుంది. CT125X ధర రూ.74,554 నుంచి ప్రారంభం కాగా షైన్ ధర రూ. 77,378 నుంచి ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories