Bajaj Chetak: వేగంగా అమ్ముడవుతున్న బజాజ్ చేతక్ ఈవీ.. కొనేముందు బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చు గురించి తెలుసుకోండి ?

Bajaj Chetak Electric Scooter
x

Bajaj Chetak: వేగంగా అమ్ముడవుతున్న బజాజ్ చేతక్ ఈవీ.. కొనేముందు బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చు గురించి తెలుసుకోండి ?

Highlights

Bajaj Chetak Electric Scooter: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‌లో 3 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించింది.

Bajaj Chetak Electric Scooter: గత రెండు మూడు నెలలుగా భారతీయ మార్కెట్లో సంచలనాలను సృష్టించిన ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్. ఈ నెలల్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్ ఎనర్జీ కూడా అమ్మకాలలో వెనుకబడి ఉన్నాయి. మొత్తమ్మీద, ఇది ఇప్పుడు దేశంలో పాపులర్ స్కూటర్‌గా పేర్గాంచింది. ఇందులో అనేక ఆఫ్షన్లు రావడం మొదలయ్యాయి. ఇది వినియోగదారులకు చేరుకోవడం సులభం చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.95,998. మరోవైపు, టీవీఎస్ ఐక్యూబ్ ప్రారంభ ధర రూ. 89,999, ఓలా ఎలక్ట్రిక్ ప్రారంభ ధర రూ. 59,999.

మొత్తంమీద, ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే బజాజ్ చేతక్ చాలా ఖరీదైనది. మీరు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీరు దాని బ్యాటరీ ధరను కూడా తెలుసుకోవాలి. కంపెనీ తన స్కూటర్ బ్యాటరీపై సుదీర్ఘ వారంటీని ఇస్తుంది. అయితే, ఈ వారంటీ బ్యాటరీ నష్టాన్ని కవర్ చేయదు. మీరు కొత్త బ్యాటరీని తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొత్త బ్యాటరీ ధర కూడా తెలుసుకోవాలి. బజాజ్ పోర్ట్‌ఫోలియో చేతక్ 2930 వేరియంట్‌తో ప్రారంభమవుతుంది. ఇందులో 2.8kWh బ్యాటరీ ప్యాక్ ఉంది.

ఎవిండియా నివేదిక ప్రకారం.. బజాజ్ బ్యాటరీ సామర్థ్యం 2.8kWh నుండి 3.2kWh వరకు ఉంది. కంపెనీ తన అన్ని వాహనాల్లో రెండు ఆఫ్షన్లను అందిస్తుంది అంటే స్టాండర్డ్, టెక్‌ప్యాక్. ఈ కొత్త బ్యాటరీల ధరలు రూ.60,000 నుంచి రూ.80,000 వరకు ఉన్నాయి. అంటే, స్కూటర్, బ్యాటరీ ధర మధ్య సగానికి పైగా వ్యత్యాసం ఉంటుంది. అయితే, దాని బ్యాటరీ ధరను నిర్ధారించడం లేదు. దీని కోసం మీరు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలి.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‌లో 3 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును అధిగమించింది. జనవరి 2020లో ప్రారంభించినప్పటి నుండి అక్టోబర్ 2024 వరకు డేటా ప్రకారం మొత్తం 3,03,621 యూనిట్లను విక్రయించింది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అక్టోబర్ 2024లో అత్యధిక నెలవారీ షిప్‌మెంట్‌లను నమోదు చేసింది. బజాజ్ చేతక్ ఈ మైలురాయిని చేరుకోవడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. జూన్ 2024లో 2 లక్షల యూనిట్ల మార్కును దాటిన తర్వాత, బజాజ్ చేతక్ కేవలం నాలుగు నెలల్లో గత లక్ష యూనిట్ల విక్రయాలను సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories