Ather Rizta Offer: ఇలాంటి ఆఫర్ జన్మలో దొరకదు.. జీరో డౌన్ పేమెంట్‌.. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఇంటికి తీసుకెళ్లండి..!

Ather Rizta Offer
x

Ather Rizta Offer

Highlights

Ather Rizta Offer: ఏథర్ ఎనర్జీ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్, ఈజీ ఈఎమ్‌ఐతో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.

Ather Rizta Offer: దేశంలోని మధ్యతరగతి ప్రజలు బైక్ కొనేందుకు నానా అవస్థలు పడుతుంటారు. టూవీలర్ కొనాలన్నా కోరిక ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థిలు కారణంగా వెనుకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఏథర్ ఎనర్జీ ఇండియా శుభవార్త చెప్పింది. సామాన్య ప్రజల ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేందుకు లోన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు అత్యధిక డిమాండ్ ఉంది. ఈ క్రమంలో రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇవి ఫీచర్లు, రేంజ్ పరంగా అద్భుతంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 109,999. అయితే, మీరు దీన్ని సులభమైన EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. దాని EMI గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి అనేక సులభమైన మార్గాలు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేసింది. ఇందులో జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మీరు ఈ స్కూటర్‌ను నెలవారీ EMIలో ఎలాంటి డబ్బు చెల్లించకుండా కొనుగోలు చేయవచ్చు. విశేషమేమిటంటే స్కూటర్ కొనుగోలుసపై 5 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో లభిస్తుంది. ఈ రుణాన్ని 5 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. మీరు రోజూ 50కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే, పెట్రోల్‌తో పోలిస్తే మీరు రూ. 2768 పొదుపు చేయవచ్చు. ఎందుకంటే దాని నెలవారీ ఛార్జింగ్ ఖర్చు రూ. 357, అయితే పెట్రోల్ ధర రూ. 3125.

మీరు రిజ్టా బేస్ వేరియంట్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారని అనుకుందాం. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 109,999. ఈ ధర వద్ద కంపెనీ 5.5 శాతం వడ్డీ రేటుతో ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా 5 సంవత్సరాల పాటు మీకు లోన్ ఇస్తుంది. అప్పుడు ఈ స్కూటర్ నెలవారీ EMI సుమారు రూ. 2,199 అవుతుంది. బీమా, RTO ఇతర ఖర్చులు ఇందులో ఉండవు. మీరు మీ జేబులో నుండి ఆ ఖర్చులను చెల్లించాలి. దీనిపై కూడా లోన్ తీసుకుంటే ఈఎంఐ పెరుగుతుంది.

రూ. 109,999 ధర కలిగిన స్కూటర్ 20 శాతం డౌన్ పేమెంట్ రూ. 21,999. అదే సమయంలో 80 శాతం రుణం మొత్తం రూ. 87,999 అవుతుంది. అయితే మీరు 5.5 శాతం వడ్డీతో 5 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే మీ నెలవారీ EMI దాదాపు రూ. 1,681గా ఉంటుంది. ఇందులో బీమా, RTO, ఇతర ఖర్చులు ఉండవని కూడా మీరు గుర్తుంచుకోవాలి.

ఈ స్కూటర్‌ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో రివర్స్ మోడ్‌ ఉంటుంది. ఇది రివర్స్ చేయడం సులభం చేస్తుంది. స్కూటర్ టైర్లు స్కిడ్ కంట్రోల్ ప్రకారం డిజైన్ చేయబడ్డాయి. స్కూటర్ సహాయంతో మీరు మీ లైవ్ లొకేషన్‌ను ఏ ఇతర స్మార్ట్‌ఫోన్‌లోనైనా షేర్ చేయవచ్చు. ఇందులో యాంటీ థెఫ్ట్ ఫీచర్ కూడా ఉంది. మీరు మీ ఫోన్ సహాయంతో పార్కింగ్ ప్రాంతంలో స్కూటర్‌ను గుర్తించొచ్చు. ఇందులో ఫాల్ సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. అంటే స్కూటర్ నడుపుతున్నప్పుడు పడిపోతే, దాని మోటార్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. విశేషమేమిటంటే ఇందులో గూగుల్ మ్యాప్ అందుబాటులో ఉంది. కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, పుష్ నావిగేషన్, ఆటో రిప్లై ఎస్ఎంఎస్ వంటి ఫీచర్లు కూడా అందించబడ్డాయి.

ఇది 2.9 kWh బ్యాటరీ, 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో వస్తుంది. చిన్న బ్యాటరీ ప్యాక్ రేంజ్ 123 కిమీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ పరిధి 160 కిమీ. అన్ని వేరియంట్‌ల గరిష్ట వేగం గంటకు 80 కిమీ. 2.9 kWh బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్ సమయం 6.40 గంటలు. అయితే 3.7 kWh బ్యాటరీ ప్యాక్ ఛార్జింగ్ సమయం 4.30 గంటలు మాత్రమే. దీని మూడు వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధర రూ. 109,999, రూ. 124,999, రూ. 144,999. రిజ్టా 7 కలర్ ఆప్షన్లలో లాంచ్ అయింది. ఇందులో 4 డ్యూయల్ టోన్ కలర్స్, 3 సింగిల్ టోన్ కలర్స్ ఉన్నాయి. కంపెనీ బ్యాటరీ, స్కూటర్‌పై 3 సంవత్సరాలు లేదా 30,000 కిమీ వారంటీని కూడా ఇస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories