Car AC: పార్క్ చేసిన కారులో ఏసీ ఆన్ చేసి చిల్ అవుతున్నారా.. భారీ ప్రమాదంలో పడ్డట్లే..

Are you Using AC in Parked Car check here for full details
x

Car AC: పార్క్ చేసిన కారులో ఏసీ ఆన్ చేసి చిల్ అవుతున్నారా.. భారీ ప్రమాదంలో పడ్డట్లే..

Highlights

Use AC in Parked Car or Not: వేసవి కాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏసీని ఉపయోగించడం సర్వసాధారణం. అయితే, పార్క్ చేసిన కారులో ఏసీని నడపడం సరైనదో, కాదో తెలుసా?

Car AC Tips: ప్రస్తుతం జూన్ నెల కొనసాగుతోంది. దేశంలో తీవ్రమైన వేడి తగ్గముఖం పడుతోంది. అయితే, చాలా ప్రాంతాలు ఇప్పటికీ వేడితో మండిపోతున్నాయి. ఈ వేడి కారణంగా, ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితిలో, ప్రజలు ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే, వారు కారును ఉపయోగిస్తుంటారు. వేడిని తట్టుకోవడానికి కారులో ఏసీని ఉపయోగిస్తుంటారు. అయితే పార్క్ చేసిన కారులో ఏసీ ఉపయోగించాలా వద్దా అనే విషయంలో చాలా మంది అయోమయంలో ఉంటారు.

కదులుతున్న కారులో ఏసీని నడపడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. వేసవి కాలంలో డ్రైవింగ్‌లో ఏసీ ఉపయోగించడం సర్వసాధారణం. కానీ, పార్క్ చేసిన వాహనంలో ఏసీ నడపడం ఏమాత్రం సరికాదు. ఇలా చేయడం వల్ల చాలా నష్టాలు ఉండవచ్చు. ముఖ్యంగా వాహనం ఇంజన్ పాడైపోయే అవకాశం ఉంది. కారు పార్క్ చేయగానే పరిస్థితి మారిపోతుంది.

ఇంజిన్‌పై ఒత్తిడి..

AC కంప్రెసర్ కారు ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. పార్క్ చేసిన వాహనంలో AC నడుస్తున్నప్పుడు, ఇంజిన్ నిరంతరం పని చేయాల్సి ఉంటుంది. దాని కారణంగా ఇంజిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఇంజిన్ భాగాలకు హాని కలిగించవచ్చు.

పెరిగిన ఇంధన వినియోగం..

వాహనం ఇంజిన్‌ను నడపడానికి ఇంధనం అవసరం. AC రన్నింగ్ ఇంజిన్‌పై అదనపు లోడ్‌ను పెంచుతుంది. దీని కారణంగా ఇంధన వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా, పార్క్ చేసిన వాహనంలో AC నడుస్తున్నప్పుడు, AC ని నడపడానికి మాత్రమే ఇంజిన్ పని చేయాల్సి ఉంటుంది. దాని కారణంగా ఇంధన వినియోగం మరింత పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories