Car Parking: కారుని ఎండలో పార్క్‌ చేస్తున్నారా.. ప్రయోజనాలు, సమస్యలు తెలుసుకోండి..!

Are You Parking Your Car In The Sun Know The Benefits And Problems
x

Car Parking: కారుని ఎండలో పార్క్‌ చేస్తున్నారా.. ప్రయోజనాలు, సమస్యలు తెలుసుకోండి..!

Highlights

Car Parking: కారు పార్క్‌ చేసే విషయంలో చాలామంది వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.

Car Parking: కారు పార్క్‌ చేసే విషయంలో చాలామంది వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. స్థలం లేక ఎండలో పార్క్‌ చేస్తే పర్వాలేదు కానీ నీడపాటి పార్కింగ్‌ ప్రదేశం ఉన్నప్పటికీ ఎండలో పార్క్‌ చేస్తే తప్పు చేసినవారవుతారు. ఎండలో కారు పార్క్‌ చేయడం వల్ల స్వల్ప ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎక్కువగా అప్రయోజనాలే ఉన్నాయి. ఎండలో కారు పార్క్‌ చేసినప్పుడు దానిపై కవర్‌ కప్పడం మంచి పద్దతి. దీనివల్ల సూర్యకాంతి నేరుగా కారుపై పడదు. ఎండలో కారు పార్క్‌ చేయడం వల్ల కలిగే లాభనష్టాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ప్రయోజనాలు

చలికాలంలో కారును ఎండలో పార్క్ చేయడం వల్ల కారు లోపలి భాగం వెచ్చగా ఉంటుంది. సీట్లు, స్టీరింగ్ చల్లగా ఉండవు కాబట్టి కారులో కూర్చున్నప్పుడు సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఎండలో కారును పార్కింగ్ చేయడం వల్ల కారు లోపల తేమ తగ్గుతుంది. దీనివల్ల వల్ల కారు లోపల చెడు వాసన పోతుంది. వర్షాకాలంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ప్రతిరోజూ అవసరం లేదు. కారును ఎండలో పార్క్ చేసినప్పుడు దాని ఉపరితలంపై ఉండే అనేక రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు చనిపోతాయి. దీని కోసం రోజూ ఎండలో కారు పార్క్ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోండి.

నష్టాలు

ఎండలో కారును పార్కింగ్ చేయడం వల్ల దాని రంగు దెబ్బతింటుంది. తీవ్రమైన ఎండవల్ల రంగు షేడ్‌ అవుతుంది. ఇది కారు లుకింగ్‌ని దెబ్బతీస్తుంది. కారును ఎండలో పార్క్ చేయడం వల్ల దాని క్యాబిన్ ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల కారులో కూర్చున్నప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. AC కారును చల్లబరచడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మొబైల్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్ వంటివి కారులో ఉంచి ఎక్కువసేపు ఎండలో పార్క్ చేసినట్లయితే ఈ వస్తువులు చెడిపోయి వాటిలో మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. అందుకే కారుని ఎండలో పార్క్‌ చేయకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories