Car Modification: కారు మోడిఫై చేస్తున్నారా.. ఇన్సూరెన్స్‌ విషయంలో పెద్ద ఎదురుదెబ్బ..!

Are you Modifying the car you Will Face Difficulties in the Matter of Insurance Claim
x

Car Modification: కారు మోడిఫై చేస్తున్నారా.. ఇన్సూరెన్స్‌ విషయంలో పెద్ద ఎదురుదెబ్బ..!

Highlights

Car Modification: కొత్త కారుని కొనేటప్పుడు చాలామంది బేస్‌మోడల్‌ కారుని కొంటారు. ఎందుకంటే దీని ధర చాలా తక్కువగా ఉంటుంది.

Car Modification: కొత్త కారుని కొనేటప్పుడు చాలామంది బేస్‌మోడల్‌ కారుని కొంటారు. ఎందుకంటే దీని ధర చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని రోజులు వాడిన తర్వాత పాతదిగా మారుతుంది. తర్వాత కస్టమర్లు ఇలాంటి వాటిని మోడిఫై చేయాలని అనుకుంటారు. ఎందుకంటే అధిక డబ్బులు ఖర్చు చేసి మళ్లీ కొత్తకారు కొనలేరు కాబట్టి. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ కారు మోడిఫై చేయడం వల్ల కారు ఇన్సూరెన్స్‌ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

చాలా ఇన్సూరెన్స్‌ కంపెనీలు మోడిఫైడ్ కార్ల క్లెయిమ్‌లను తిరస్కరిస్తాయి. కారు బేస్ మోడల్‌లో ఇంజిన్‌ను మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే అస్సలు మంచిది కాదు. కారుని సాధారణ వేగం కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత కారు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ చేయలేరు. అలాగే కారు పెయింట్‌ను మార్చాలనుకుంటే ముందుగా దాని గురించి కారు ఇన్సూరెన్స్‌ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. భవిష్యత్తులో కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.

కారు ఫ్యాక్టరీ టైర్‌లను మార్చడం వల్ల కారు మైలేజీపై ఎఫెక్ట్‌ పడుతుంది. కారులో సాధారణ మ్యూజిక్ సిస్టమ్‌కు బదులుగా జింగిల్ మ్యూజిక్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఇబ్బందుల్లో పడుతారు. అలాగే కారు ఇంటీరియర్ బ్రేక్‌లు, సస్పెన్షన్‌లను మార్చినట్లయితే కారు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ చేయలేరు. ఏదైనా కారణం చేత పార్ట్స్‌ని మార్చబోతున్నట్లయితే దాని గురించి ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌కి తెలియజేయాలని గుర్తుంచుకోండి. లేదంటే ఈ మార్పులని సాకుగా చూపి కారు ఇన్సూరెన్స్‌ తిరస్కరిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories