MINI Cooper SE: 270 కి.మీ మైలేజ్.. కేవలం 35 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్.. అదిరిపోయే ఫీచర్లు.. బీఎండబ్ల్యూ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్..!

270 KM Mileage and 80 Percent Charge in Just 35 Minutes 2020 MINI Cooper SE Electric Car From BMW
x

MINI Cooper SE: 270 కి.మీ మైలేజ్.. కేవలం 35 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్.. అదిరిపోయే ఫీచర్లు.. బీఎండబ్ల్యూ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్..!

Highlights

MINI Cooper SE: BMW కొత్త MINI కూపర్ SEని విడుదల చేసింది. ఇది ఎలక్ట్రిక్ కారు. MINI కూపర్ SE అనేది BMW i3 తర్వాత పూర్తిగా ఎలక్ట్రిక్ కారు రూపంలో విడుదల చేశారు.

MINI Cooper SE: BMW కొత్త MINI కూపర్ SEని విడుదల చేసింది. ఇది ఎలక్ట్రిక్ కారు. MINI కూపర్ SE అనేది BMW i3 తర్వాత పూర్తిగా ఎలక్ట్రిక్ కారు రూపంలో విడుదల చేశారు. అయితే ఇది i3లా అదే ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించారు. దీని డిజైన్ కూడా MINI కూపర్ Sని పోలి ఉంటుంది.

270 kmpl మైలేజ్..

కొత్త మినీ కూపర్ SE పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. 32.6 kWh బ్యాటరీని ప్యాక్‌తో విడుదల చేశారు. ఇది 184 బీహెచ్‌పీ పవర్, 270 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గంటకు 100 కిమీ వేగాన్ని అందుకోవడానికి 7.3 సెకన్లు పడుతుంది. 0 నుంచి 60 kmph వేగాన్ని అందుకోవడానికి 3.9 సెకన్లు పడుతుంది. ఇది పూర్తి ఛార్జ్‌తో 235 నుంచి 270 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.

35 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్..

BMW ఈ కారు 35 నిమిషాల్లో 80 శాతం (50 kW వరకు) వరకు ఛార్జ్ చేస్తుంది. అయితే ప్రామాణిక ఛార్జింగ్ 2 గంటల 30 నిమిషాల్లో 11 kW ఛార్జ్ చేస్తుంది. ఇది 80 శాతం వరకు మాత్రమే. టైప్ 2, CCS కాంబో 2 ప్లగ్‌లు ఎలక్ట్రిక్ మినీకి ఛార్జింగ్ కనెక్షన్‌లుగా అందించారు. వీటిలో AC, DC ఛార్జర్‌లను ఉపయోగించవచ్చు. సమీప భవిష్యత్తులో మార్కెట్లోకి రానున్న అన్ని కార్లు మరింత వేగంగా ఛార్జింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటాయని భావిస్తున్నారు. కొత్త 2020 మినీ కూపర్ SE నిస్సాన్ లీఫ్‌తో నేరుగా పోటీ పడుతుందని భావిస్తున్నారు. ధర ఎంతనేది ఇంకా ప్రకటించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories