Hyundai Alcazar Safety Features: ఫ్యామిలీ ముఖ్యం బిగులు.. ఫుల్ సేఫ్టీతో వస్తున్న హ్యుందాయ్.. ఇవే హైలెట్..!

Hyundai Alcazar Safety Feature
x

Hyundai Alcazar Safety Feature

Highlights

Hyundai Alcazar Safety Features: 2024 అప్‌డేటెడ్ అల్కాజార్ లెవల్ 2 ADAS టెక్నాలజీ, 6 ఎయిర్‌బ్యాగ్‌లు అనేక సేఫ్లీ ఫీచర్లతో లాంచ్ కానుంది.

Hyundai Alcazar Safety Features: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన అప్‌డేటెడ్ అల్కాజార్ మూడు-వరుసల SUV ధరలను సెప్టెంబర్ 9, 2024న ప్రకటించనుంది. మార్కెట్లో లాంచ్ చేయడానికి ముందు కంపెనీ తన మెయిన్ డిజైన్ మార్పులు, ఫీచర్ అప్‌గ్రేడ్‌లను వెల్లడించటానికి అనేక ఫోటోలు, వీడియోలను విడుదల చేసింది. ఇటీవల దాని సేఫ్టీ ఫీచర్ల వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో మెయిన్ అప్‌గ్రేడ్ లెవల్ 2 ADAS టెక్నాలజీని చేర్చడం. దాని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కొత్త SUV అద్భుతమైన ADAS సూట్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇది లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అవాయిడెన్స్ అసిస్ట్, సరౌండ్ వ్యూ మానిటర్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లను అందిస్తుంది. కొత్త Alcazar స్టాండర్డ్ సేఫ్టీ కిట్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఆటో-డిమ్మింగ్ IRVM, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, మొత్తం 4 డిస్క్ బ్రేక్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి.

మెరుగైన భద్రతా ఫీచర్లతో పాటు కొత్త 2024 హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో వస్తుంది. దీనిలో ప్రతి స్క్రీన్ 10.25 అంగుళాలు ఉంటుంది. ఇందులో ఒక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరొకటి ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం ఉంటుంది. SUVలో టచ్-సెన్సిటివ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, 8-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ జోన్ AC, వెంటిలేటెడ్ ఫ్రంట్, మిడిల్ వరుస సీట్లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, మిడిల్ సీట్ కోసం వైర్‌లెస్ ఛార్జర్, మాగ్నెటిక్ ప్యాడ్, అనేకం ఉన్నాయి.

దీని ఇంజన్‌లో చాలా మార్పులు చేయవచ్చు. ప్రస్తుతానికి కొత్త 2024 హ్యుందాయ్ అల్కాజర్ 1.5L టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఎంపికలతో ఉంటుంది. దీని గ్యాసోలిన్ యూనిట్ 160 bhp పవర్‌‌నా ఉత్పత్తి చేయగలదు. అయితే డీజిల్ ఇంజన్ గరిష్టంగా 115bhp పవర్ రిలీజ్ చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌లో 6-స్పీడ్ మాన్యువల్ (స్టాండర్డ్), 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ (డీజిల్ మాత్రమే), 7 స్పీడ్ DCT (పెట్రోల్ మాత్రమే). ఫీచర్లు, డిజైన్ అప్‌గ్రేడ్‌లను పరిశీలిస్తే కొత్త Alcazar ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. SUV ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లు ప్రస్తుతం రూ. 16.77 లక్షల నుండి రూ. 21.28 లక్షల మధ్య ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories