Affordable Bikes: వన్ మినిట్ ప్లీజ్.. కొత్త బైక్ కొంటున్నారా.. తక్కువ ప్రైస్‌లో హై మైలేజ్ ఇచ్చే బైక్స్ ఇవేగా..!

Affordable Bikes
x

Affordable Bikes

Highlights

Affordable Bikes: 2024 హీరో గ్లామర్, TVS జూపిటర్ 110 , ఓలా రోడ్‌స్టర్ బైకులు ఆగస్టులో లాంచ్ అయ్యాయి. తక్కువ ప్రైస్‌లో ఎక్కువ మైలేజ్ అందిస్తాయి.

Affordable Bikes: భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివశిస్తుంటారు. వీరి రోజువారి అవసరాలు తీర్చడానికి బైక్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆఫీసుకు వెళ్లాలన్నా, మార్కెట్‌ నుంచి కూరగాయలు తీసుకురావాలన్నా.. చాలామంది బైక్‌లను ఉపయోగిస్తారు. దేశీయ మార్కెట్‌లో సరసమైన అధిక మైలేజ్ ఇచ్చే బైకులు అత్యధికంగా అమ్ముడవడానికి కారణం ఇదే. ఆటో కంపెనీలు కూడా తమ టూవీర్‌లను నిరంతరం అప్‌డేట్ చేస్తున్నాయి. అలానే కొత్త బైక్‌లను కూడా విడుదల చేస్తున్నాయి. గత నెల ఆగస్టులో కూడా దేశీయ విపణిలో అనేక స్కూటర్లు, బైకులు విడుదలయ్యాయి. వీటిలో ప్రధానంగా హీరో గ్లామర్, టీవీఎస్ జూపిటర్, ఓలా రోడ్‌స్టర్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

2024 Hero Glamour
2024 కొత్త హీరో గ్లామర్ బైక్ 'బ్లాక్ మెటాలిక్ సిల్వర్' కలర్ ఆప్షన్‌లో మార్కెట్‌లో సందడి చేస్తుంది. గ్లామర్ డ్రమ్ బ్రేక్ వేరియంట్, కొత్త కలర్‌తో పాటు, రూ. 83,598. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 87,598 (ఎక్స్-షోరూమ్). ఈ హీరో గ్లామర్ బైక్‌లో 124.7 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 10.72 bhp పవర్, 10.6 Nm గరిష్ట టార్క్‌ రిలీజ్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. అలాగే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

TVS Jupiter 110
2024 అప్‌డేట్ చేయబడిన TVS జూపిటర్ 110 స్కూటర్ ధర రూ. 73,700, రూ. 87,250 (ఎక్స్-షోరూమ్). ఇది 113cc సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 7.91 HPపవర్, 9.8 Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. కొత్త TVS జూపిటర్ 110 స్కూటర్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటెలిజెంట్ స్టార్ట్/స్టాప్, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, USB ఛార్జర్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణీకులకు మంచి భద్రతను అందించడానికి ముందు 220 mm డిస్క్, వెనుక 130 mm డ్రమ్ బ్రేక్ ఉన్నాయి.

Ola Roadster
ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా గత నెలలో విడుదల చేశారు. ఓలా ఈ బైక్‌ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. వీటిలో రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ఎక్స్, రోడ్‌స్టర్ ప్రో వంటి వేరియంట్‌లు ఉన్నాయి. వాటి ధర రూ.74,999 నుండి రూ.2,49,999 ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది. Ola రోడ్‌స్టర్ 2.5kWh, 3.5kWh, 4.5kWh, 6kWh, 8kWh, 16kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలను కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ బైక్ వేరియంట్‌ను బట్టి 200 కిమీ నుండి 579 కిమీల రేంజ్ ఇస్తుంది. ఇది 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో సహా అనేక ఫీరచ్లను కలిగి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories