Weekly Horoscope, October 20-26: వారఫలాలు :ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Weekly horoscope in Telugu October 20 to26
x

Weekly horoscope in Telugu October 20 to26

Highlights

Weekly Horoscope, October 20 to 26: వారఫలాలు :ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Weekly Horoscope, October 20-26: వారఫలాలు :ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. లావాదేవీలలో శుభ ఫలితాలు లభిస్తాయి. సోదరుల సహకారం కీలకం అవుతుంది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తోన్న శుభవార్త అందడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల కలయిక నూతన ఉత్తేజాన్నిస్తుంది. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి వృద్ధి చెందుతుంది. ఆస్తి క్రయవిక్రయాలు ఏమంత తృప్తిగా సాగవు. నోటి దురుసు వల్ల చిక్కుల్లో పడతారు. ఎవరికీ పూచీలు ఇవ్వకండి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం: దుర్గాదేవిని పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం

ఉత్సాహభరితంగా ఉంటుంది. ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ధన సంబంధ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. విందులకు హాజరవుతారు. మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. ఉన్నత స్థాయికి ఎదిగేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలకు సోదరవర్గం తోడుంటుంది. ఇరుగుపొరుగుతో సఖ్యత ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. బ్యాంకు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టంది. కంటి సమస్య ఉంటుంది.

పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. పసుపు వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం

కీలక వ్యవహారాల్లో అదృష్టం తోడుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగానే సాగుతాయి. వాహన యోగం ఉంది. మానసిక, శారీరక సౌఖ్యాలను పొందుతారు. బంధువులతో విందులకు హాజరవుతారు. విజ్ఞానం పెంపొందించుకునేందుకు అనువైన వారమిది. తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. కీర్తి పెరుగుతుంది. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాట తప్పడం వల్ల నింద పడాల్సి వస్తుంది. నోటి దురుసును తగ్గించుకోవడం మంచిది.

పరిహారం: సూర్యుణ్ణి ఆరాధించండి. లేత నీలపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

వ్యవహారాలు అనుకున్నదానికన్నా మెరుగ్గా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఇష్టులతో విందులకు హాజరవుతారు. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ఇంటికి సంబంధించిన వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. కీలక సందర్భంలో అదృష్టం తోడుంటుంది. మనస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిది కాదు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. తగాదాలు వస్తాయి.

పరిహారం: గాయత్రీ దేవిని పూజించండి. నశ్యపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

సింహం

అభీష్టం నెరవేరుతుంది. పనుల పూర్తికి అందరూ సహకరిస్తారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. ఎదుగుదలకు దోహదం పడే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులు పైఅధికారుల మన్ననలను పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన శుభకార్యాలపై దృష్టి పెడతారు. గౌరవం పెరుగుతుంది. బద్ధకాన్ని దూరంగా ఉంచండి. అనవసర ప్రయాణాలు మానండి.

పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. బంగారు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కన్య

అత్యంత యోగదాయకంగా ఉంటుంది. అభీష్టాలు నెరవేరతాయి. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. బంధువులు అన్నింట్లోనూ తోడుంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పెద్దల ఆశీస్సులను పొందుతారు. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో విందుకు హాజరవుతారు. సంతాన వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. ఇంటికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలొస్తాయి. కొత్త వస్తువులను కొంటారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది.

పరిహారం: గణపతిని పూజించండి. ముదురు ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల

ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ఇష్టకార్యం సిద్ధిస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగానే సాగుతాయి. ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబ అంశాలపై శ్రద్ధ పెడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధువులతో విందు, వినోదాలకు హాజరవుతారు. శత్రువులు అనూహ్యంగా దెబ్బతీసే అవకాశం ఉంది. వారి కదలికలను గమనిస్తూ ఉండండి. వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. సంతానం వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. త్వరగా అలసిపోతారు.

పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

పనులు సవ్యంగానే సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారంలో జీవిత భాగస్వామి సూచనలు ఉపకరిస్తాయి. నూతన విజ్ఞానాన్ని పొందేందుకు, పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనుకూలంగా ఉంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులను కలుస్తారు. కొత్తవారితోనూ బంధాలు బలపడతాయి. చెప్పుడు మాటలు నమ్మకండి. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. ఉద్రేకాన్ని తగ్గించుకోవాలి. వృథా ఖర్చులుంటాయి. జీర్ణ సంబంధ సమస్య వచ్చే వీలుంది.

పరిహారం: శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి రంగు దుస్తులను ధరించండి.

ధనుస్సు

కీలకమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించండి. ప్రయాణాలు ఆనందపరుస్తాయి. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. విందులో పాల్గొంటారు. వారం చివరలో అనుకోని వివాదం తలెత్తే సూచన ఉంది. జాగ్రత్త.

పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. గోధుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మకరం

యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ధన సంబంధ చిక్కులకు పరిష్కారం లభిస్తుంది. ఆత్మీయుల తోడ్పాటుతో వివాదాన్ని పరిష్కరిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. పోయిందనుకున్న వస్తువు తిరిగి లభిస్తుంది. బలహీనతలను జయిస్తారు. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. బంధాలు బలపడతాయి. వారాంతంలో బద్ధకం వల్ల చిక్కులొస్తాయి. సంతానం తీరు చికాకు పెడుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

పరిహారం: నవగ్రహాలను పూజించండి. ఊదా రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం

వ్యవహారాలు ఆశించిన రీతిలోనే సాగుతాయి. ధన సంబంధ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బలహీనతలను అధిగమిస్తారు. బంధుమిత్రులు సహకరిస్తారు. కోర్టు వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులను కొంటారు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. కీర్తి పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల కారణంగా మీకు సహకరించే వారిని దూరం చేసుకునే అవకాశం ఉంది. సంతానం వ్యవహారాలు చికాకు పరుస్తాయి. సొంత తెలివితేటలు వాడకండి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు.

పరిహారం: శనైశ్చరుడిని పూజించండి. నల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం

చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక ప్రయోజనాలనూ పొందుతారు. కొత్త వస్తువులను కొంటారు. సోదరులకు సంబంధించిన శుభ వార్త అందుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు లాభసాటిగానే ఉంటాయి. వారం ద్వితీయార్థంలో వృథా ఖర్చుల వల్ల డబ్బుకి ఇబ్బంది ఏర్పడుతుంది. సంతానం తీరు ఆవేదనను కలిగిస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మనసు నిలకడగా ఉండదు. వాత సంబంధ సమస్యలుంటాయి. గొడవలకు దూరంగా ఉండండి.

పరిహారం: శివుణ్ణి పూజించండి. రాగి రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.



Show Full Article
Print Article
Next Story
More Stories