Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (నవంబరు 17 - 23)
Weekly Horoscope in Telugu, November 17 to 23, 2024: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
Weekly Horoscope in Telugu, November 17 to 23, 2024: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
మేషం
పనులు సవ్యంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాచరణల్లో పాల్గొంటారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. మిత్రుల కారణంగా కీలక వ్యవహారం కొలిక్కి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సహోద్యోగులు అండగా నిలుస్తారు. స్థిరాస్తి లావాదేవీలు వాయిదా వేయడం మంచిది. సంతానం తీరు ఒకింత నిరాశకు గురి చేస్తుంది. ముఖ్య కార్యాల నిర్వహణలో ఆత్మీయుల సూచనలను పాటించండి. వృథా ఖర్చు తగ్గించుకోవాలి.
పరిహారం: శ్రీలక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
వృషభం
వ్యవహారాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. విశేష ధనలాభం ఉంది. సాహసంతో చేసే పనుల్లో విశేష ఫలితాలు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆత్మీయుల కలయిక నూతన ఉత్తేజాన్ని నింపుతుంది. కీలక సమయంలో నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. కీలక సమాచారం ఆనందాన్నిస్తుంది. ఇచ్చిన మాటను తప్పడం వల్ల నింద భరించాల్సి రావచ్చు. ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. రెండో పెళ్లి ప్రయత్నాలు వాయిదా వేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
పరిహారం: సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. ఊదా రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మిథునం
యోగదాయకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. బంధువులతో కలిసి విందులకు హాజరవుతారు. నిరుద్యోగులకు శుభ వర్తమానం అందుతుంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరాలన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. బాల్యస్నేహితులను కలుస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు రివార్డులు అందుతాయి. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. నోటిదురుసుతనం వల్ల గొడవలొస్తాయి. వేళకు భోజనముండదు.
పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కర్కాటకం
పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. ధనలాభం ఉంది. అవసరమైన వేళ అదృష్టం తోడుగా నిలుస్తుంది. సమాజంలో గౌరవం వృద్ధి చెందుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ప్రయాణం లాభిస్తుంది. బాల్య స్మృతులు గుర్తుకొస్తాయి. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. సామాజిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. మానసిక స్థితి ఉత్సాహభరితంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యుల కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. వృథా ఖర్చులు తగ్గించాలి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి.
పరిహారం: శ్రీగాయత్రీ మాతను పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.
సింహం
అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతాన సంబంధ శుభకార్యాల గురించి చర్చిస్తారు. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలక సమయంలో అనుకోని రీతిలో అదృష్టం వరిస్తుంది. పెద్దవారి ఆశీస్సులు లభిస్తాయి. శారీరక, మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. కంటి సంబంధ సమస్య ఉంటుంది.
పరిహారం: శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.
కన్య
పట్టింది బంగారంలా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు, తమ కృషితో, రివార్డులను పొందుతారు. ఉన్నతాధికారుల అండతో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. నూతన విషయాలను గ్రహిస్తారు. విజ్ఞానాన్ని అప్‌డేట్ చేసుకునేందుకు సరైన సమయమిది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రుణ విముక్తి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సంతానం వ్యవహారాలు తృప్తిగా సాగుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృథా ఖర్చు తగ్గించాలి.
పరిహారం: పార్వతీదేవిని పూజించండి. నశ్యపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
తుల
ఇష్ట కార్యం సిద్ధిస్తుంది. స్థిర చిత్తంతో చేసే ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ధనదాయం వృద్ధి చెందుతుంది. గృహోపకరణాలను కొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. వృత్తిపరమైన సమర్థతతో గొప్ప అవకాశాలను సొంతం చేసుకుంటారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
పరిహారం: శ్రీఆంజనేయ స్వామిని పూజించండి. సిందూరపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
వృశ్చికం
ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల మన్ననలు లభిస్తాయి. వృత్తిపర నిపుణతకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విదేశాల్లో స్థిరపడేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనవసర జోక్యాలు వద్దు. వృథా ఖర్చులు తగ్గించండి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. పైత్య సమస్య ఉంటుంది.
పరిహారం: గణపతిని పూజించండి. ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
ధనుస్సు
ఒడుదుడుకులు ఎదురైనా కార్యాలు జయప్రదం అవుతాయి. జీవిత భాగస్వామి సూచనలు శుభం చేకూరుస్తాయి. సంతాన సంబంధ శుభకార్యం నిర్వహిస్తారు. బంధువులతో విందులో పాల్గొంటారు. ఇతరులతో బంధాలు బలపడతాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు తృప్తినిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. తగాదాలకు ఆస్కారముంది. నోటిదురుసు తగ్గించండి. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది.
పరిహారం: శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మకరం
అన్ని పనులూ సవ్యంగా సాగుతాయి. ధనలాభం ఉంది. స్వస్థాన ప్రాప్తి గోచరిస్తోంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. గృహోపకరణాలను కొంటారు. మానసిక చికాకులు తొలగిపోతాయి. గొడవలు సద్దు మణగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ శుభవార్తను వింటారు. అంతర్గత ఆనందాలు తీరతాయి. పోటీల్లో తలదూర్చకండి. వీలునామా వ్యవహారాలు వాయిదా వేయండి. జీర్ణ సమస్య ఉంటుంది.
పరిహారం: సూర్యుణ్ణి ప్రార్థించండి. లేత నీలపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కుంభం
మేలిమి కాలం నడుస్తోంది. వ్యవహారాన్నింట్లోనూ విజయం లభిస్తుంది. డబ్బు చికాకులు తొలగిపోతాయి. కొత్త వస్తువులను కొంటారు. బలహీనతలను అధిగమిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కనిపించకుండా పోయిన వస్తువు మళ్లీ దొరుకుతుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించడం మేలు. స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి వృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. వృథా ఖర్చు తగ్గించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. నల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మీనం
కీలక కార్యాలు విజయవంతంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన సమస్య పరిష్కారానికి ధర్మమార్గాన్ని అనుసరిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులు సహకరిస్తారు. మనోవేదన తొలగిపోతుంది. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. స్థిరాస్తి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. రక్తసంబంధీకుల గురించిన వార్త వేదనకు గురిచేస్తుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త.
పరిహారం: శివుణ్ణి పూజించండి. బూడిద రంగు కలిసిన దుస్తులను ధరించండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire