Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (నవంబరు 24 - 30)
Weekly Horoscope in Telugu, 2024 November 24 to 30: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
Weekly Horoscope in Telugu, 2024 November 24 to 30: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.
మేషం
బలహీనతలను జయిస్తారు. వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలను పొందుతారు. ప్రత్యర్థులకు బుద్ధి చెబుతారు. మానసిక వేదన తొలగుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభాన్నిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త బంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. కీర్తి పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసర జోక్యాలకు దూరంగా ఉండండి. వేళకు భోజనం ఉండదు. జీర్ణ సమస్య ఎదురవుతుంది.
పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
వృషభం
అన్నింటా శుభ ఫలితాలను పొందుతారు. బంధువుల సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. విందుల్లో పాల్గొంటారు. శత్రుపీడ ఉండదు. అపార్థాలు తొలగిపోతాయి. న్యాయ వివాదాలు ఊరటనిస్తాయి. నూతన వస్తు, వాహన యోగం ఉంది. విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అనువైన కాలం. బంధాలు బలపడతాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. స్వేచ్ఛా జీవితంపై ఇష్టం పెరుగుతుంది. సంతానం తీరు చికాకు పరుస్తుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
పరిహారం: సూర్యుణ్ణి ఆరాధించండి. లేత నీలం రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మిథునం
అడ్డంకులను అధిగమిస్తారు. వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పురోభివృద్ధిన సాధిస్తారు. మిత్రులు తోడ్పాటునందిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. ప్రత్యర్థులను జయిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రితో సఖ్యత చెడుతుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. స్థిరాస్తి, విద్యారంగాల్లోని వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్యుమెంట్లు భద్రం. రక్తసంబంధీకుల వైద్యానికి ఖర్చు చేయాల్సి రావచ్చు. నీటి ప్రవాహాల దగ్గర వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.
పరిహారం: దుర్గాదేవిని పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కర్కాటకం
వ్యవహారాలు సవ్యంగానే సాగుతాయి. ధనాదాయం పెరుగుతుంది. కీలక ప్రయత్నం విజయవంతం అవుతుంది. ధైర్యసాహసాలు పెరుగుతాయి. ఆత్మీయులను కలుస్తారు. విందులకు హాజరవుతారు. సోదరులతో సత్సంబంధాలుంటాయి. దాయాదుల వల్ల చికాకులు తొలగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. నాయకత్వ లక్షణానికి తగిన గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆచితూచి నడచుకోవాలి.
తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణ సంబంధ చికాకులు విచారాన్ని కలిగిస్తాయి. బద్ధకం వద్దు.
పరిహారం: శ్రీవేంకటేశ్వర స్వామిని పూజించండి. తెల్లటి రంగు కలిసిన దుస్తులను దరించండి.
సింహం
ప్రయత్నాలు ఫలిస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. అన్నివైపులా మంచే జరుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో విశేష లాభాన్ని పొందుతారు. మిత్రుల సహకారం లభిస్తుంది. నూతన వస్త్రాభరణాలను కొంటారు. ఆత్మధైర్యం పెరుగుతుంది. ప్రియతముల కలయిక సరికొత్త ఉత్తేజాన్నిస్తుంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. తోబుట్టువుల వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. అనవసర హామీలను ఇవ్వకండి. నిందలు ఎదురవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలను వీలైనమేర వాయిదా వేయండి.
పరిహారం: శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. నల్లటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కన్య
అన్ని పనులూ శుభప్రదంగా సాగుతాయి. అభీష్టం నెరవేరుతుంది. ఉన్నత స్థితిని పొందేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ధైర్యసాహసాలకు గుర్తింపు ఉంటుంది. ముఖ్యమైన విషయంలో అదృష్టం తోడుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. కుటుంబసౌఖ్యాన్ని పొందుతారు. ప్రియతములను కలుస్తారు. విందుకు హాజరవుతారు. తొందరపడి ఎవరికీ హామీ ఇవ్వకండి. పిత్రార్జిత ఆస్తి వ్యవహారాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.
పరిహారం: శివుణ్ణి ఆరాధించండి. ఊదా రంగు కలిసిన దుస్తులను ధరించండి.
తుల
పనులు ఆశించిన ప్రకారమే జరుగుతాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. చక్కటి వ్యక్తిత్వంతో పెద్దలను మెప్పిస్తారు. మెరుగైన స్థితిని పొందే ప్రయత్నంలో ఉన్నతస్థానంలోని వ్యక్తులు సహకరిస్తారు. అంతులేని ఆనందాన్ని పొందుతారు. బాల్యానికి సంబంధించిన విషయాలు గుర్తుకొస్తాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. శిక్షలకు ఆస్కారముంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. బంధువుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. అసూయను జయించండి. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. బద్ధకాన్ని వదిలిపెట్టండి.
పరిహారం: గాయత్రీ మాతను పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.
వృశ్చికం
చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. రుణ విముక్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా వుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇతరులూ సహకరిస్తారు. ఆకాంక్ష నెరవేరుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సంతానం వృద్ధిలోకి వస్తుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలను చేపడతారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఖర్చులు తగ్గించాలి. అపాత్ర దానం పనికిరాదు.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. గోధుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
ధనుస్సు
పట్టింది బంగారంలా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. స్థిర చిత్తంతో చేసే ప్రతి పనీ విజయవంతం అవుతుంది. అధికారిక హోదా పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇతరులతో విరోధంలో విజయం మీకే దక్కుతుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతాన సంబంధ శుభ కార్యాలను నిర్వహిస్తారు. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. బద్ధకం వద్దు.
పరిహారం: శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.
మకరం
పట్టింది బంగారంలా సాగుతుంది. అన్ని ప్రయత్నాలూ సఫలం అవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో చక్కటి ఎదుగుదల ఉంటుంది. శత్రుపీడ తొలగి పోతుంది. జీవితంలో స్థిరత్వం దిశగా అడుగులు పడతాయి. కుటుంబ వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. స్థిరనివాసం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ కలుగుతుంది.
పరిహారం: గణపతిని పూజించండి. లేత ఆకుపచ్చ రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.
కుంభం
అభీష్టం నెరవేరుతుంది. ప్రయత్నించిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. మేలిమి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఉన్నత స్థాయికి చేరాలన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తగాదాలకు దూరంగా ఉండండి. అనవసరంగా పోటీలకు దిగకండి. దురభిప్రాయాలు ఏర్పడతాయి. మోకాలి సమస్య ఉంటుంది. దైవచింతన పెరుగుతుంది.
పరిహారం: శ్రీ లక్ష్మీనారాయణులను పూజించండి. బంగారు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మీనం
ప్రయత్నాలు సఫలం అవుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ధనలాభం ఉంది. కొత్త విషయాలు ఆశ్చర్య పరుస్తాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. బంధువులతో విందులకు హాజరవుతారు. ప్రయాణం లాభిస్తుంది. జీవిత భాగస్వామి సూచనలు పాటించండి. వాహనయోగం ఉంది. ఓదశలో ఇష్టం లేని పనిచేయాల్సి వస్తుంది. మనసును నిగ్రహించుకోండి. దురాలోచనలను దూరంగా ఉంచండి. ఆరోగ్యం జాగ్రత్త. సంతానం శైలి ఇబ్బంది పెడుతుంది. పెద్దల కోపానికి గురవుతారు. భవిష్యత్తుపై బెంగ ఏర్పడుతుంది.
పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire