Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (డిసెంబర్ 8 - 14)

Weekly Horoscope
x

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (డిసెంబర్ 8 - 14)

Highlights

Weekly Horoscope in Telugu, 2024 December 8 to 14: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Weekly Horoscope in Telugu, 2024 December 8 to 14: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

జీవితంలో ఉన్నతస్థాయికి చేరాలన్న ప్రయత్నం అనుకూలిస్తుంది. అదృష్టం తోడుగా నిలుస్తుంది. ధనలాభం ఉంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. బాల్య స్నేహితులను కలుస్తారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. అనవసరంగా పోటీలకు దిగకండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. ఎవరికీ పూచీగా ఉండకండి.

పరిహారం: శ్రీ లక్ష్మీనారాయణులను పూజించండి. ముదురు ఎరుపు రంగు కలిసిన వస్త్రాలను ధరించండి.

వృషభం

ఇష్టకార్యం సిద్ధిస్తుంది. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. రుణ విముక్తి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఇతరుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. సంతాన సంబంధ శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వాహన యోగం ఉంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులను పొందుతారు. మనసుకి నచ్చే బాధ్యతలు లభిస్తాయి. విదేశీ ప్రయాణానికి అనుకూలం. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోండి. వివాదాల జోలికి వెళ్లకండి.

పరిహారం: పార్వతీ దేవిని పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం

యోగదాయకమైన కాలమిది. అన్ని వ్యవహారాల్లోనూ అనుకూల ఫలితాలు దక్కుతాయి. ఉద్యోగులు నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటారు. అధికారుల మన్ననలను పొందుతారు. కొత్త బాధ్యతల్లో ఒదిగిపోతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విదేశాల్లో స్థిర నివాస యత్నం అనుకూలిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. సంతాన సంబంధ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకోండి.

పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

అభీష్టం నెరవేరుతుంది. చేపట్టిన ప్రతి కార్యం సఫలం అవుతుంది. అన్ని రంగాల వారికీ శుభంగా ఉంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అధికార వృద్ధి ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. జీవనోపాధి మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. సంతానం వృద్ధిలోకి వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. భవిష్యత్‌ ప్రణాళికలను రూపొందిస్తారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

పరిహారం: గాయత్రీ మాతను పూజించండి. లేత నశ్యపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

సింహం

ఇష్టంతో చేపట్టిన పని విజయవంతం అవుతుంది. వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. అధికార వృద్ధి గోచరిస్తోంది. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. సంతానం అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. గౌరవం పెరుగుతుంది. చెప్పుడు మాటల వల్ల అపోహలు పెరుగుతాయి. ఇతరుల గురించి చెడుగా ఆలోచిస్తారు. తగాదాలకు ఆస్కారముంది. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు.

పరిహారం: శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించండి. తెల్లటి రంగు వస్త్రాలను ధరించండి.

కన్య

పనులు అనుకున్న స్థాయిలోనే జరుగుతాయి. ధనలాభం ఉంది. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కీలక కుటుంబ వ్యవహారాన్ని చక్కదిద్దుతారు. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. బంధువులను కలుస్తారు. కొత్త బంధాలు బలపడతాయి. ప్రయాణ సౌఖ్యాన్ని పొందుతారు. నిజాయితీకి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగులు బాధ్యతతో మెలగాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల ఇష్టం లేని చోటికి బదిలీ అవుతారు. ఆరోగ్యం జాగ్రత్త. వివాదాల పరిష్కారంపై దృష్టి పెట్టండి.

పరిహారం: దుర్గాదేవిని పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల

సుఖవంతంగా గడుస్తుంది. స్వస్థానప్రాప్తి ఉంది. బంధువులు సహకరిస్తారు. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పోటీల్లో గెలుస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. న్యాయ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి సూచనలు బాగా మేలు చేస్తాయి. కీర్తి పెరుగుతుంది. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. బంధాలు బలపడతాయి. స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కీళ్ల నొప్పులు వేధిస్తాయి.

పరిహారం: సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. లేత పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. బలహీనతలను జయిస్తారు. మానసిక, శారీరక సౌఖ్యాలను పొందుతారు. కీలకమైన పనికి అడ్డంకులు తొలగిపోతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. ఇతరులతో బాంధవ్యాలు బలపడతాయి. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శుభ కార్యాల్లో పాల్గొంటారు. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి.

పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. ముదురు నీలిరంగు కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు

వ్యవహారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. మిత్రులు సహకరిస్తారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. బలహీనతలను జయిస్తారు. న్యాయ వివాదాలు అనుకూలంగా సాగుతాయి. అదృష్టం తోడుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. పోయిన వస్తువు తిరిగి దొరుకుతుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. అవసరమైన వేళకు తెలివితేటలు అక్కరకు రావు. ఆత్మీయుల సూచనలు పాటించండి. ఆస్తి విక్రయ ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. బద్ధకాన్ని వదిలి కృషి చేయాలి.

పరిహారం: శనైశ్చరుడిని పూజించండి. నలుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మకరం

వ్యవహారాల్లో విశేష లాభముంది. ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. సోదరుల సహకారంతో మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. అవసరమైన వేళ నాయకత్వ లక్షణం ప్రదర్శిస్తారు. దగ్గరి ప్రాంతానికి ప్రయాణిస్తారు. స్థిరాస్తి, విద్యారంగంలోని వారు అప్రమత్తంగా ఉండాలి. వృథా ఖర్చులు తగ్గించాలి. సంతాన సంబంధ వ్యవహారాలు వేదనకు గురిచేస్తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. నీటి వనరుల సమీపంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

పరిహారం: ఆంజనేయ స్వామిని పూజించండి. సిందూరపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం

ఒడుదుడుకులు ఎదురైనా పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కీలక సమయంలో ధైర్యసాహసాలను ప్రదర్శిస్తారు. సోదరుల సమస్యను పరిష్కరిస్తారు. నాయకత్వ పటిమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. కంటి సమస్యను నిర్లక్ష్యం చేయకండి. తల్లి ఆరోగ్యం కలవర పెడుతుంది.

పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. లేత ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం

అన్ని కార్యాలూ సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం అనుకూలిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోడబుట్టిన వారి అండతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఇరుగు పొరుగుతో సఖ్యత పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్నిస్తుంది. ఉద్యోగులకు విశేష లాభముంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అదృష్టం వరిస్తుంది. ఆంతరంగిక వ్యవహారాలను బయటపెట్టకండి. అనవసర జోక్యం వల్ల అవమానం ఎదురవుతుంది.

పరిహారం: సూర్య భగవానుడిని పూజించండి. లేత బంగారు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories