Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (డిసెంబర్ 22 - 28)
Weekly Horoscope in Telugu, 2024 December 22 to 28: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Weekly Horoscope in Telugu, 2024 December 22 to 28: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం
అన్ని వ్యవహారాల్లో శుభ ఫలితాలుంటాయి. ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది. సంతానం గురించిన చింత తగ్గుతుంది. కొత్త బంధాలు బలపడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణ లాభాలుంటాయి. నిజాయితీకి తగిన ఫలం లభిస్తుంది. స్వేచ్ఛా జీవితంపై ఆసక్తి పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. చెప్పుడు మాటలను నమ్మకండి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి.
పరిహారం : నవగ్రహాలకు ప్రదక్షిణం చేయండి. నలుపు రంగు కలిసిన దుస్తులు ధరించండి.
వృషభం
అభీష్టం సిద్ధిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన లాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అపార్థాలు తొలగిపోతాయి. కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. అదృష్టం తోడుగా నిలుస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. సంతానాన్ని కోరుకునే వారి ఆకాంక్ష నెరవేరే సూచన ఉంది. బంధువులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధాలు బలపడతాయి. వేదన తగ్గుతుంది. అనవసరమైన చోట మీ తెలివితేటలను ప్రదర్శించకండి. విలువైన వస్త్రాభరణాలు జాగ్రత్త.
పరిహారం : సూర్యభగవానుడిని ఆరాధించండి. నారింజ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మిథునం
శుభ ఫలితాలుంటాయి. వ్యవహారాల్లో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. స్వస్థాన ప్రాప్తి ఉంది. ఒక్కో సమస్యను తెలివిగా పరిష్కరిస్తారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. సోదరవర్గం సహకారంతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందుల్లోకి నెడతాయి. స్థిరాస్తి, వాహన, విద్య, సేవా రంగాలకు ఏమంత ఆశాజనకంగా ఉండదు. సంతాన సంబంధమైన చింత ఏర్పడుతుంది. తగాదాలకు దూరంగా ఉండండి. వృథా ఖర్చులు తగ్గించాలి.
పరిహారం : గాయత్రీమాతను పూజించండి. ఎర్రటి రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కర్కాటకం
వ్యవహారాలను సాహసోపేతంగా పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. నూతన వస్త్రాభారణాలను కొంటారు. తల్లి యోగక్షేమాలపై శ్రద్ధపెడతారు. సోదరులు సహకరిస్తారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. ముఖ్యమైన సమాచారం ఆనందాన్ని పెంచుతుంది. ఆస్తి అమ్మే ప్రయత్నాలు ఫలించవు. వారం మధ్యలో అనుకోని అడ్డంకుల వల్ల పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక అంశాలు ఉత్తేజాన్నిస్తాయి. వాహన సంబంధ సమస్య వస్తుంది. శ్వాస సంబంధ అనారోగ్యం సూచిస్తోంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు.
పరిహారం : పార్వతీదేవిని పూజించడం మంచిది. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
సింహం
పనులు ఆశించినట్లే జరుగుతాయి. ఆదాయం మెరుగవుతుంది. నాయకత్వ పటిమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబసౌఖ్యాన్ని పొందుతారు. సహచరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో విందుకు హాజరవుతారు. ఆత్మీయుల కలయిక ఉత్తేజం కలిగిస్తుంది. హామీలను నెరవేర్చని కారణంగా నిందలు పడతారు. కంటికి సంబంధించిన సమస్య వస్తుంది. రెండో పెళ్లి వ్యవహారంలో జాప్యం ఏర్పడుతుంది. మనశ్శాంతి లోపిస్తుంది. ఆలోచన విధానాన్ని మార్చండి.
పరిహారం : శ్రీ లక్ష్మీనృసింహుణ్ణి పూజించండి. ముదురు ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కన్య
పనులు ఆశించినట్లే జరుగుతాయి. ధనలాభం ఉంది. జీవితంలో ఎదిగే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విశిష్ట వ్యక్తిత్వంతో పెద్దల మనసులను గెలుస్తారు. ధైర్య సాహసాలు, నాయకత్వ లక్షణాలతో శుభ ఫలితాలను సాధిస్తారు. కీలక సందర్భంలో అదృష్టం తోడుంటుంది. బాల్యస్నేహితులను కలుస్తారు. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. సహచరులు, ఇరుగుపొరుగుతో సఖ్యత పెరుగుతుంది. సోదరుల అండతో ప్రత్యర్థులను జయిస్తారు. అహంకారాన్ని దగ్గరకు రానీయకండి. నోటిదురుసుతో వ్యవహారాలు చెడిపోయే ఆస్కారముంది.
పరిహారం : శ్రీసుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. లేత పుసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
తుల
అన్ని రంగాల వారికీ అనుకూల ఫలితాలే ఉంటాయి. ఐశ్వర్యాభివృద్ధి ఉంది. అదృష్టం కూడా సహకరిస్తుంది. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. వాహన యోగం ఉంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. విదేశీ ప్రయాణ ప్రయత్నం అనుకూలిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటికి దూరంగా ఒంటరిగా గడపాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఆత్మీయుల వైద్యం కోసం ఖర్చు చేస్తారు. కోపాన్ని తగ్గించండి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కంటి సమస్య ఉంటుంది.
పరిహారం : శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. బంగారు వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.
వృశ్చికం
ఆనందంగా సాగుతుంది. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆత్మీయుల నుంచి తగిన సహకారం లభిస్తుంది. ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. రుణ విముక్తి యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. కుటుంబ శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సంతాన సంబంధ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలివితేటలకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఖర్చు తగ్గించండి.
పరిహారం : శివుడిని పూజించండి. గోధుమ వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.
ధనుస్సు
ఇష్టకార్యం నెరవేరుతుంది. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. అవకాశాలను చేజార్చుకోరాదు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మిత్రులు అండగా ఉంటారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆత్మీయులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. దూర ప్రాంతాల్లో స్థిర నివాసం కోసం ప్రయత్నిస్తారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల ధనం నష్టపోయే సూచన కనిపిస్తోంది.
పరిహారం : శ్రీ శనైశ్చరుడిని నువ్వుల నూనెతో అభిషేకించండి. నీలం రంగు కలిసిన దుస్తులను ధరించండి.
మకరం
యోగదాయకంగా ఉంటుంది. నిర్దేశితలక్ష్యాన్ని చేరుకుంటారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నైపుణ్యం, సమర్థతలకు తగ్గ హోదా లభిస్తుంది. జీవితంలో స్థిరపడేందుకు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను పొందుతారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఇష్టమైన వారితో విందుకు హాజరవుతారు. రుణ విముక్తికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దూరప్రయాణం సూచిస్తోంది. తొందరపాటు వల్ల పరిహారం చెల్లించాల్సి రావచ్చు. అప్రమత్తంగా ఉండండి.
పరిహారం : కనకదుర్గమ్మను ఆరాధించండి. ముదురు ఎరుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.
కుంభం
అభీష్టం నెరవేరుతుంది. నిర్దేశించుకున్న కార్యం సఫలం అవుతుంది. జీవితంలో స్థిరత్వం దిశగా అడుగులు వేస్తారు. చక్కటి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తి నైపుణ్యం పెరుగుతుంది. ఉద్యోగులు, ఉన్నతాధికారుల అభిమానాన్ని పొందుతారు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. తండ్రి సామాజిక స్థితి మెరుగవుతుంది. ఇతరులపై అపోహలు పెరిగేందుకు ఆస్కారం ఉంది. విచక్షణతో వ్యవహరించండి. పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. వేళకుభోజనం లేక జీర్ణ సమస్య ఏర్పడుతుంది.
పరిహారం : సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులు ధరించండి.
మీనం
అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. వాహన సౌఖ్యం ఉంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన సమయం. ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. బంధాలు బలపడతాయి. స్వేచ్ఛాజీవితంపై ఆసక్తి పెరుగుతుంది. నిజాయితీకి తగ్గ గుర్తింపును పొందుతారు. సంతానం వ్యవహారాలు తృప్తినిస్తాయి. తగాదాలకు దూరంగా ఉండాలి. బాధత్యల నిర్వహణలో నిర్ల్ష్యం వల్ల ఇబ్బంది పడతారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. అనవసరంగా పోటీల్లో పాల్గొనకండి.
పరిహారం : శ్రీదత్తాత్రేయ స్వామిని పూజించండి. గురుస్తోత్రం పఠించండి. తెల్లటి రంగు దుస్తులు ధరించండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire