Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (డిసెంబర్ 15 - 21)

Weekly Horoscope
x

Weekly Horoscope: ఈ వారం మీ రాశిఫలం (డిసెంబర్ 15 - 21)

Highlights

Weekly Horoscope in Telugu, 2024 December 15 to 21: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

Weekly Horoscope in Telugu, 2024 December 15 to 21: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.

మేషం

వ్యవహార జయం ఉంది. పురోభివృద్ధి దిశగా ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్ని కీలక వ్యవహారాల్లోనూ సోదరులు అండగా ఉంటారు. స్వయంకృషికితగిన ఫలితం లభిస్తుంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సహోద్యోగుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఖర్చులను బాగా తగ్గించాలి. సంతానంతో సఖ్యత చెడుతుంది. విలువైన వస్తువులు జాగ్రత్త. స్థిరాస్తి వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. కాషాయపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృషభం

అన్ని వైపుల నుంచీ శుభ ఫలితాలు లభిస్తాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. వస్త్రాభరణాలను కొంటారు. ఆత్మీయులను కలుస్తారు. విందులకు హాజరవుతారు. ధైర్యసాహసాలకు కొదవ ఉండదు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సహచరుల సహకారం ఎంతో మేలు చేస్తుంది. సోదరులు ప్రతి అడుగులోనూ అండగా నిలుస్తారు. పరిస్థితులు ఇంత అనుకూలంగా ఉన్నా, తొందరపాటు నిర్ణయాల వల్ల వాటి ఫలితాలను పొందలేరు. నోటిదురుసు కూడా గొడవలను తెచ్చిపెడుతుంది. వాహన సమస్య వస్తుంది.

పరిహారం: పార్వతీదేవిని పూజించండి. కుంకుమ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మిథునం

అదృష్టం వరిస్తుంది. అన్ని వ్యవహారాల్లోనూ సత్ఫలితాలు వస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. బంధువులతో విందులకు హాజరవుతారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరే ప్రయత్నం అనుకూలిస్తుంది. కీలక సమస్యల పరిష్కారంలో మెదడు పాదరసంలా పనిచేస్తుంది. సోదరులు అండగా నిలుస్తారు. కొత్త విషయాలను గ్రహిస్తారు. బాల్యస్మృతులను నెమరువేసుకుంటారు. బ్యాంకు లావాదేవీలను నిర్లక్ష్యం చేయకండి. కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టండి. కంటి సమస్యలుంటాయి.

పరిహారం: నవగ్రహాలను దర్శించండి. ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కర్కాటకం

పనులు ఆశించిన రీతిలోనే సాగుతాయి. ధన సంబంధ వ్యవహారాలు తృప్తినిస్తాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు శుభప్రదంగా ఉంటుంది. శారీరక సౌఖ్యం లభిస్తుంది. వ్యక్తిగత రహస్య ఆకాంక్ష నెరవేరుతుంది. చిన్ననాటి స్నేహితులను కలిసి వినోదాల్లో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. పూచీగా ఉండకండి.

పరిహారం: శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించండి. ముదురు నీలి వర్ణం కలిసిన దుస్తులను ధరించండి.

సింహం

లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శుభకార్యాల నిర్వహణపై దృష్టి పెడతారు. బంధువులతో పాటు, సన్నిహితుల సహకారం లభిస్తుంది. రుణ విముక్తి ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. కీలక సమస్య పరిష్కారంలో అదృష్టం మీవైపే ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. నిర్లక్ష్యం కారణంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృథా ఖర్చులు తగ్గించాలి. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించండి. సిందూరపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కన్య

యోగదాయకంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. యత్నకార్యాలన్నీ సఫలం అవుతాయి. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కాలం ఆనందదాయకంగా సాగుతుంది. ఉద్యోగులకు పైఅధికారుల ప్రశంసలు లభిస్తాయి. సంతాన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. దూర ప్రయాణం సూచిస్తోంది. వృథా ఖర్చులను అదుపు చేయాలి.

పరిహారం: శివుణ్ణి పూజించండి. ఊదారంగు కలిసిన దుస్తులను ధరించండి.

తుల

పట్టింది బంగారంలా ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అవలీలగా చేరుకుంటారు. ఇతరులతో విరోధంలో విజయం మీకే సొంతమవుతుంది. వృత్తి నైపుణ్యం ప్రదర్శిస్తారు. సమర్థతకు తగ్గ అవకాశాలు అందివస్తాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు అనువైన కాలమిది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి.ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్లి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు గౌరవాన్ని పెంచుతాయి. మనశ్శాంతిని పొందుతారు.

పరిహారం: గణపతిని పూజించండి. లేత ఆకుపచ్చ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

వృశ్చికం

వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. జీవనోపాధి మార్గాలు పెరుగుతాయి. పోటీలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులు అధికారుల అభిమానానికి పాత్రులవుతారు. వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. చెప్పుడు మాటలను నమ్మడం వల్ల అనవసర సమస్యల్లో చిక్కుకుంటారు. తగాదాలకు ఆస్కారముంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. త్వరగా అలసిపోతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

పరిహారం: శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. పసుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

ధనుస్సు

స్థిరచిత్తంతో చేపట్టే కార్యాలు విజయవంతం అవుతాయి. కొన్ని ఒడుదుడుకులు ఎదురైనా ఆర్థిక వ్యవహారాలు సజావుగానే సాగుతాయి. జీవిత భాగస్వామి సూచనలు మేలు చేస్తాయి. ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపారంలో భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. ఆవేశాన్ని తగ్గించుకోవాలి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి.

పరిహారం: శనిని, నల్ల నువ్వుల నూనెతో అభిషేకించండి. ముదురు నీలం రంగు దుస్తులను ధరించండి.


మకరం

వారమంతా విజయవంతంగా సాగుతుంది. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సజావుగానే సాగుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ సమస్యను పరిష్కరిస్తారు. బలహీనతలను జయిస్తారు. మానసిక, శారీరక సౌఖ్యాన్ని పొందుతారు. దాయాదులతో గొడవలు సద్దు మణుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఉపకరిస్తాయి. తెలియని రంగాల్లో పనులను చేపట్టకండి. వీలునామాకు అనువైన కాలం కాదు. రెండో పెళ్లి ప్రయత్నం వద్దు.

పరిహారం: సూర్యుణ్ణి పూజించండి. లేత వంకాయ రంగు కలిసిన దుస్తులను ధరించండి.

కుంభం

శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ధర్మమార్గంలో నడుస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకుంటారు. అపార్థాలు తొలగిపోతాయి. విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అనుకూలం. ప్రయాణం లాభిస్తుంది. నిజాయితీకి తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. శత్రుపీడ తగ్గుతుంది. సంతాన సంబంధ సమస్యలు తీరతాయి. కీలక వ్యవహారాల్లో బద్ధకిస్తే నష్టపోతారు. మీ విశ్లేషణలు పెద్దగా ఆకట్టుకోవు. విలువైన ఆభరణాలు జాగ్రత్త.

పరిహారం: గాయత్రీమాతను పూజించండి. ముదురు ఎరుపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

మీనం

చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. పూర్వవైభవం సాధించేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులతో పాటు మిత్రుల సహకారమూ లభిస్తుంది. వృథా ఖర్చులను నియంత్రించగలిగితే ఆర్థిక వ్యవహారాలు తృప్తినిస్తాయి. కోర్టు వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. అపార్తాలు తొలగిపోతాయి. రహస్య జీవితం గురించిన గుట్టు రట్టయ్యే సూచన ఉంది. బుద్ధి నిలకడ లోపిస్తుంది. సంతాన సంబంధ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టాలి. ప్రేమికులకు కష్టకాలమే. ఉద్యోగులు విధినిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం: శ్రీఆంజనేయ స్వామిని పూజించండి. సిందూరపు రంగు కలిసిన దుస్తులను ధరించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories