Weekly Horoscope 18 To 24 August 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 18 To 24 August 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు
(18-08-2024 నుంచి 24-08-2024 వరకు)
మేషం :
వారమంతా యోగదాయకంగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. అవసరానికి తగిన డబ్బు అందుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. గృహావసరాలను తీరుస్తారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. సంతానం పురోభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. శుభ కార్యాచరణకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. నిరుద్యోగులను అదృష్టం వరిస్తుంది. దూరప్రయాణం గోచరిస్తోంది. అనవసర గొడవల్లో తలదూర్చకండి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించంది. ఏ దశలో బద్ధకం మంచిది కాదు.
వృషభం :
ఈ వారమంతా పట్టింది బంగారంలా ఉంటుంది. ఇష్టకార్యాలన్నీ నెరవేరతాయి. ధన సంబంధ చికాకులు తొలగిపోతాయి. రుణ చెల్లింపు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పోటీల్లో మీకే విజయం లభిస్తుంది. అధికారులు, పెద్దల అభిమానాన్ని పొందుతారు. అధికారవృద్ధి ఉంది. అవకాశాలను అందిపుచ్చుకోండి. కుటుంబంపై శ్రద్ధ పెరుగుతుంది. ఇరుగు పొరుగుతో సఖ్యత ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మనశ్శాంతి కలుగుతుంది. వృథాఖర్చులను తగ్గించండి. బద్ధకం వీడండి.
మిథునం :
వ్యవహారాలన్నింటా శుభ ఫలితాలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. దీర్ఘకాలంగా ఊరిస్తోన్న కార్యం నెరవేరుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అన్ని రంగాల్లోని వారికీ మేలైన అవకాశాలు లభిస్తాయి. పోటీల్లో ఫలితం మీకే అనుకూలంగా వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి అవసరాలను తీరుస్తారు. బంధువులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
కర్కాటకం:
పనులకు ఆటంకాలు ఎదురైనా, చాకచక్యంగా అధిగమిస్తారు. కాస్త శ్రమ అధికమైనా అభీష్టం నెరవేరుతుంది. అధికారులు, పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మేలిమి అవకాశాలు అందివస్తాయి. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఇష్టం లేకున్నా కొన్ని పనులను చేయడమే మంచిది. అపోహలను తొలగించుకోండి. వృథా ఖర్చులు తగ్గించండి. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందిస్తారు. కుటుంబం విషయాలపై శ్రద్ధ పెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
సింహం :
కీలకమైన కార్యాలను వారం ప్రారంభంలోనే చేపట్టండి. ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులను కలుస్తారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఇతరుల వ్యవహారాల్లో జోక్య చేసుకోకండి. అనవసర ఖర్చుల కారణంగా అప్పు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యలపై శ్రద్ధ పెట్టండి.
కన్య :
వారమంతా శుభప్రదంగా ఉంటుంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. గృహావసరాలను తీరుస్తారు. జీవిత భాగస్వామితో అనురాగం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి యోగదాయకం. విందుల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర వ్యవహారాల్లో జోక్యం వద్దు. వారాంతంలో వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త.
తుల :
ప్రారంభంలో స్వల్ప ఒడుదుడుకులుగా ఉన్నా.. చేపట్టిన ప్రతి పనీ సఫలం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ధన సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. కుటుంబ అవసరాలపై శ్రద్ధ పెడతారు. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. గృహోపకరణాలను కొంటారు. వాహన యోగం ఉంది. అందరితోనూ సత్సంబంధాలు వృద్ధి చెందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విజ్ఞాన సముపార్జనకు అనుకూలం. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. వృథా ఖర్చులు తగ్గించడం మంచిది.
వృశ్చికం :
వ్యవహారాలన్నింటా అప్రమత్తంగా ఉండాలి. శత్రువుల కదలికలు పెరుగుతాయి. అడుగడుగునా ఆటంకాలు వస్తాయి. డబ్బుకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు లభించదు. అపోహలు, అనుమానాలకు దూరంగా ఉండండి. అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కీలక సమయంలో మిత్రుల సహకారంతో. సమస్య నుంచి బయట పడతారు. ఆస్తి విక్రయ ప్రయత్నాలు వాయిదా వేయండి. అనవసర వివాదాల్లోకి వెళ్లకండి. తల్లి ఆరోగ్యం జాగ్రత్త. స్వస్థానం చేరతారు. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు :
పనులు అనుకున్న రీతిలో సాగవు. ప్రతి పనీ ఆలస్యంగా పూర్తవుతుంది. బుద్ధి నిలకడ లోపిస్తుంది. బంధువులతోనే విరోధం తలెత్తుతుంది. మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి ఉంది. కీలక నిర్ణయాల్లో సోదర వర్గం సలహాలు పాటించండి. ముఖ్యమైన సమాచారం అందుతుంది. అత్యవసర వేళల్లో మీ పరాక్రమానికి ప్రశంసలు అందుతాయి. ఆత్మీయులను కలుస్తారు. సంతాన సంబంధ విషయాలు చికాకు పరుస్తాయి. ధన సంబంధ వ్యవహారాల్లో జాగ్రత్త. ముఖ్యంగా వృథా ఖర్చులు తగ్గించండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.
మకరం :
పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. అవరోధాలు వస్తుంటాయి. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. అయితే, వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వల్ల నిందలు భరించాల్సి వస్తుంది. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. బుద్ధి నిలకడ లేమి కారణంగా బంధువులతోనూ విరోధం ఏర్పడుతుంది. సోదరుల తోడ్పాటుతో కీలక సమస్య నుంచి బయటపడతారు. ముఖ్యమైన సమాచారం ఆనందాన్నిస్తుంది. ఆత్మీయులను కలుస్తారు. భూసంబంధ వ్యవహారాలు లాభసాటి కాదు.
కుంభం :
ఆటంకాలను అధిగమిస్తారు. లక్ష్యాన్ని చేరుకుంటారు. ధనలాభం ఉంది. చక్కటి సౌకర్యాలు సమకూరతాయి. నిరుద్యోగులకు శుభదాయకంగా ఉంటుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. గౌరవం పెరుగుతుంది. కీలక సమయంలో మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరులతో సఖ్యత ఉంటుంది. అదృష్టం తోడవుతుంది. ఎవరికీ అనవసర హామీలు ఇవ్వకండి. నింద భరించాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం తృప్తినిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. కంటి సమస్య వేధిస్తుంది.
మీనం :
మిశ్రమ ఫలితాలుంటాయి. పనుల పూర్తికి బాగా కష్టపడాల్సి వుంటుంది. ధన సంబంధ చికాకులు వస్తాయి. అనుకున్న రీతిలో సౌకర్యాలు సమకూరవు. బంధువులను కలుస్తారు. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఇతరుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. ఎవరికీ పూచీలు ఇవ్వకండి. అనవసర నిందలకు ఆస్కారం ఏర్పడుతుంది. మిత్రులతో విభేదాలు వచ్చే వీలుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కీలక సందర్భంలో అదృష్టం తోడుగా నిలుస్తుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. విందుకు హాజరవుతారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire