Weekly Horoscope 15 To 21 September 2024: ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. కొత్త పరిచయాలతో కొండంత అండ.. 12 రాశుల వారి వార ఫలాలు

Weekly Horoscope 15 To 21 September 2024: ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. కొత్త పరిచయాలతో కొండంత అండ.. 12 రాశుల వారి వార ఫలాలు
x

Weekly Horoscope 15 To 21 September 2024: ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. కొత్త పరిచయాలతో కొండంత అండ.. 12 రాశుల వారి వార ఫలాలు

Highlights

Weekly Horoscope 15 To 21 September 2024: ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే.. కొత్త పరిచయాలతో కొండంత అండ.. 12 రాశుల వారి వార ఫలాలు.

వారఫలం(15-09-2024 నుంచి 21-09-2024 వరకు)

మేషం

కోరికలు తీరతాయి. స్నేహితులే కాకుండా ఇతరులూ సహకరిస్తారు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతానం సంబంధ సౌఖ్యాన్ని ఆస్వాదిస్తారు. అప్పులు తీర్చే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులను కొంటారు. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. అత్యవసరమైన సమయంలో అదృష్టం తోడుగా ఉంటుంది. అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు.

దూర ప్రయాణాల వల్ల నష్టం తప్పదు. అనవసర జోక్యాల వల్ల అవమానాలు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఉద్యోగాలు ఊడే స్థితి ఉంటుంది. బద్ధకం వల్ల చిక్కులొస్తాయి. కోర్టు వివాదాల్లో జాగ్రత్త.

పరిహారం: సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల వ్యతిరేక ఫలితాలు తగ్గే వీలుంది. కీలక వ్యవహారాల్లో పసుపు కలిసిన దుస్తులు ధరించడం మేలు.

వృషభం

చేపట్టిన పని పూర్తవుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పోటీలలో ప్రత్యర్థులను జయిస్తారు. ఉద్యోగులు, అధికారుల అభిమానాన్ని పొందుతారు. రివార్డులు, ఉన్నత అవకాశాలు పొందుతారు. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. అప్పులు చెల్లించే క్రమంలో ఇతరుల సహకారాన్ని పొందుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. పెద్దల కలయిక మేలు చేస్తుంది. విదేశీ నివాస యత్నం ఫలిస్తుంది.

బంధుమిత్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వారి వైద్య చికిత్స కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావచ్చు. వృథా ఖర్చులుంటాయి. కోర్టుల్లో వ్యతిరేక ఫలితం గోచరిస్తోంది. ఒంటరితనం తప్పకపోవచ్చు.

పరిహారం: కనకదుర్గమ్మను పూజించడం వల్ల వ్యతిరేక ఫలితాలు దూరమవుతాయి. ఎరుపు రంగు కలిసిన దుస్తులు ధరించడం మంచిది.

మిథునం

పట్టింది బంగారంలా సాగుతుంది. ఆశించిన ప్రయోజనం సిద్ధిస్తుంది. దీర్ఘకాలంగా ఊరిస్తోన్న కార్యం సఫలం అవుతుంది. పోటీలలోను, వాగ్వావాదాల్లోనూ శత్రువులపై విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. కొత్త పరిచయాలు మేలు చేస్తాయి. బుద్ధి స్థిరంగా ఉంటుంది. సంతాన సంబంధ శుభకార్యాల గురించిన చర్చ చేస్తారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

బలహీనతలను బయటపెట్టడం వల్ల శత్రువుల పీడ పెరిగే వీలుంది. కడుపులో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఖర్చులు బాగా తగ్గించాలి. దూర ప్రదేశానికి వెళ్లాల్సి రావచ్చు. పనుల్లో త్వరగా అలసిపోతారు.

పరిహారం: ఇష్ట దైవాన్ని పూజించడం వల్ల మేలు కలుగుతుంది. గులాబీ రంగు కలిసిన దుస్తులను దరించడం వల్ల శుభఫలితాలు లభిస్తాయి.

కర్కాటకం

స్థిర చిత్తంతో చేపట్టే పనులు విజయవంతం అవుతాయి. మీ కార్యదక్షతకు పెద్దల ఆశీస్సులు తోడవుతాయి. అభీష్టం నెరవేరుతుంది. బంధువులతో వినోద కార్యాల్లో పాల్గొంటారు. జీవితంలో పురోభివృద్ధికి తగిన అవకాశాలు అందివస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వృత్తి నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుంది. ఇంటి పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. విదేశాల్లో స్థిర నివాసానికి చేసే ప్రయత్నాల్లో కదలిక ఉంటుంది.

అపోహల వల్ల చెడు ఫలితాలు వచ్చే వీలుంది. వారం మొదట్లో కొంతమేర ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. పోటీల్లో అనూహ్య పరాజయం గోచరిస్తోంది. బలహీనతల వల్ల కొత్త సమస్యలు వస్తాయి.

పరిహారం: నవగ్రహాలకు పూజ చేయించడం ప్రతికూలతలు తగ్గుతాయి. నలుపు రంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల మేలు కలుగుతుంది.

సింహం

సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు ఎంతో మేలు చేస్తాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగానే సాగుతాయి. ప్రయాణం లాభిస్తుంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సూచనలు పాటించడం మంచిది. సంతాన సంబంధ విషయాలు సంతృప్తినిస్తాయి. స్వేచ్ఛ విలువను తెలుసుకుంటారు. వాహన యోగం ఉంది. కొత్త విజ్ఞానాన్ని పొందేందుకు, జ్ఞానాన్ని అప్‌డేట్ చేసుకునేందుకు వారం మొదట్లో అనుకూలంగా ఉంటుంది.

అపోహలు సృష్టించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు పెరుగుతారు. ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే సూచన ఉంది. సంతానం తీరు ఆందోళనకు గురి చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలుంటాయి.

పరిహారం: గణపతిని పూజించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి. తెల్లటి రంగు ఉన్న దుస్తులను ధరించడం వల్ల అశుభాలు తొలగిపోతాయి.

కన్య

చేపట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుంది. ఆర్థిక వృద్ధి ఉంది. వివాదాలు పరిష్కారమవుతాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. పోటీ పరీక్షల్లో గెలుపు, ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పోయిందనుకున్న వస్తువు దొరికే సూచన ఉంది. కీర్తి పెరుగుతుంది. ఆత్మీయులతో వినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది.

వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారసత్వ ఆస్తి వ్యవహారాలు కొలిక్కి రావు. ఇతరుల విషయంలో జోక్యం వల్ల తగాదాలకు ఆస్కారం ఉంది. ఆకస్మిక ధన నష్టం గోచరిస్తోంది. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం: శివారాధన వల్ల గోచారం వల్ల ఏర్పడిన వ్యతిరేకతలు తగ్గుముఖం పడతాయి. ఊదారంగు కలిసిన దుస్తులను ధరించడం శుభం చేకూరుస్తుంది.

తుల

అన్ని పనుల్లోనూ శుభ ఫలితాలను పొందుతారు. దీర్ఘకాలంగా ఊరిస్తోన్న విజయం సొంతం అవుతుంది. ధన సంబంధ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. గృహోపకరణాలను సమకూర్చుకుంటారు. ధర్మ సంబంధ కార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ బంధాలు బలపడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. సరికొత్త విషయాలు తెలుస్తాయి. విందుల్లో పాల్గొంటారు.

ఆటంకాలు కల్పించే వారి కదలికలపై నిఘా ఉంచండి. బద్ధకం వల్ల పెద్ద చిక్కే వస్తుంది. చెడు ఆలోచనలను నియంత్రించుకోండి. సొంత తెలివితేటలు, విశ్లేషణ శక్తికి పెద్దగా గుర్తింపు ఉండదు. వృథా ఖర్చులుంటాయి.

పరిహారం: శ్రీసీతారామ సహిత ఆంజనేయ స్వామిని పూజించడం మేలు చేస్తుంది. సింధూర రంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల ప్రతికూలతలు తొలగుతాయి.

వృశ్చికం

ఆశించిన లబ్ది చేకూరుతుంది. అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. రుణ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. వ్యక్తిగత బలహీనతలను అధిగమిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పోటీలు, కోర్టు వివాదాల్లో అదృష్టం తోడుగా ఉంటుంది. పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి.

ఆస్తి క్రయవిక్రయాలు నష్టపరుస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. రక్త సంబంధీకుల ఆరోగ్యం ఆందోళన పెడుతుంది. వాహన, గనుల సంబంధ వ్యాపారాల్లో జాగ్రత్త. సంతానంతో విభేదిస్తారు. బద్ధకాన్ని వదలండి.

పరిహారం: నాగ ప్రతిమలకు పాలతో అభిషేకం చేయడం వల్ల మేలు కలుగుతుంది. నీలి రంగు కలిసిన వస్త్రాలను ధరించడం వల్ల శుభఫలితాలుంటాయి.

ధనుస్సు

అందరి నుంచీ సహకారం లభిస్తుంది. కార్యజయం ఉంది. ధన సంబంధ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త వస్త్రాలను కొంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సోదరులు సహకరిస్తారు. కీలక సమాచారం ఆనందాన్నిస్తుంది. ఆత్మీయుల కలయికతో నూతన ఉత్తేజాన్ని పొందుతారు. కీలక కార్యంలో సహోద్యోగుల సహకారం వల్ల లబ్దిని పొందుతారు. మీలోని ధైర్యసాహసాలకు గుర్తింపు లభిస్తుంది.

సంతానం ప్రవర్తన చికాకు పెడుతుంది. మిమ్మల్ని బలపరిచే వారే వ్యతిరేకిస్తారు. స్థిరాస్తులు కొనుగోళ్ల వల్ల నష్టం గోచరిస్తోంది. విలువైన వస్తువులు దొంగతనమయ్యే సూచన ఉంది. వృథా ఖర్చులను తగ్గించండి.

పరిహారం: అశ్వత్థ వృక్షాన్ని పూజించి ప్రదక్షిణలు చేయడం వల్ల మేలు కలుగుతుంది. గోధుమ వర్ణపు దుస్తులను ధరించడం వల్ల ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం

పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగానే ఉంటాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కీలక సమాచారం ఈ వారం అందుతుంది. విశేష లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. సోదరుల వల్ల లబ్ది చేకూరుతుంది. నాయకత్వ పటిమకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది.

ఇతరుల వల్ల ఇబ్బంది తప్పదు. అనవసర జోక్యాలకు దూరంగా ఉండండి. వృథా ఖర్చులు వేదనకు గురి చేస్తాయి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ముందుకు సాగవు. తగాదాలకు ఆస్కారముంది. ఆరోగ్యం జాగ్రత్త.

పరిహారం: శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేయడం శుభ ఫలితాలనిస్తుంది. లేత ఆకుపచ్చ రంగు కలగలిసిన దుస్తులను ధరించడం మేలు.

కుంభం

అన్నివిధాలా అనుకూలమైన వారమిది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. వాహన యోగం ఉంది. శారీరక, మానసిక సౌఖ్యాలను పొందుతారు. మనసు ఉత్సాహంగా ఉంటుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ నడవడిక పెద్దల ప్రశంసలను పొందుతుంది. స్వస్థానం, బాల్యం గురించిన ఆలోచనలు వస్తాయి. అదృష్టం తోడవడంతో ముఖ్య వ్యవహారం అనుకూలంగా మారుతుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం మంచిది కాదు. ఇచ్చిన మాట నిలుపుకోని కారణంగా నింధ భరించాల్సి వస్తుంది. బ్యాంకు లావాదేవీల్లో తొందరపాటు వద్దు. కుటుంబ వ్యవహారాల్లో అశ్రద్ధ వల్ల సమస్యలొస్తాయి.

పరిహారం: శ్రీ లక్ష్మీనృసింహ స్వామిని పూజించడం వల్ల ప్రతికూలతలు తొలగుతాయి. ఊదారంగు కలిసిన దుస్తులను ధరించడం వల్ల శుభం చేకూరుతుంది.

మీనం

చేపట్టిన పని విజయవంతం అవుతుంది. అవసరమైన మేరకు డబ్బు సర్దుబాటు అవుతుంది. కుటుంబ సౌఖ్యానికి లోటుండదు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ వ్యక్తిత్వం పెద్దవారిని ఆకర్షిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే వీలుంది. అదృష్టం తోడుంటుంది. ఉన్నత లక్ష్య సాధన దిశగా అడుగులు పడతాయి. నిరుద్యోగులకు అనుకూలం. మనోల్లాసాన్ని పొందుతారు.

బద్ధకం వల్ల చిక్కులొచ్చే వీలుంది. ముందు చూపు లేని నిర్ణయాల కారణంగా ఇబ్బంది పడతారు. ఇతరులతో జాగ్రత్తగా నడచుకోవాలి. బ్యాంకు లావాదేవీలు నష్టదాయకంగా ఉంటాయి. ఎవరికీ పూచీగా ఉండకండి.

పరిహారం: శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించినా, గురువును గౌరవించినా వ్యతిరేక ఫలితం తగ్గుతుంది. తెలుపు రంగు దుస్తులను ధరించడం శుభప్రదం.

Show Full Article
Print Article
Next Story
More Stories