Weekly Horoscope 08 To 14 September 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు
Weekly Horoscope 08 To 14 September 2024: ఆర్థిక సమస్యల ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం..12 రాశుల వారికి వారఫలాలు
(08-09-2024 నుంచి 14-09-2024 వరకు)
మేషం
శ్రమ ఎక్కువగా ఉంటుంది. అభీష్టం నెరవేరుతుంది. అవసరానికి సరిపడా డబ్బు అందుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. గృహావసరాలను తీరుస్తారు. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోహల వల్ల తగాదాలు, ఆందోళనలు పెరుగుతాయి. అవకాశాలు చేజారకుండా చూసుకోండి. సంతానం తీరు చికాకు పరుస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి.
వృషభం
పనులు అనుకున్న స్థాయిలో జరగవు. బద్ధకం వల్ల ఇబ్బంది వస్తుంది. వృథా ఖర్చుల వల్ల డబ్బు నిల్వ ఉండదు. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. బంధువులను కలుస్తారు. ఇతరులతోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులపై అపోహలు ఏర్పడతాయి. ఉద్యోగులు అధికారుల కోపానికి గురయ్యే వీలుంది. ఉన్నత విద్యాయత్నాలు అనుకూలించవు. సంతాన వ్యవహారాలు బాధిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. జీవితభాగస్వామి సూచనలు పాటించండి.
మిథునం
ఆశించిన ప్రయోజనం పొందుతారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్త వస్తువులను కొంటారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. బంధువులు సహకరిస్తారు. అపార్థాలు తొలగిపోతాయి. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అనువైన కాలమిది. విందుల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉద్రేకాన్ని అదుపు చేసుకోండి. ఇతరుల వ్యవహారాలు తలదూర్చకండి. వృథా ఖర్చులను నియంత్రించాలి.
కర్కాటకం
ప్రారంభంలో కాస్త ఒడుదుడుకులుగా అనిపించినా, కార్యాలన్నీ విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సంతానంతో విభేదాలు తొలగిపోతాయి. ప్రత్యర్థులపై పైచేయిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలించవు. ప్రయాణాలు లాభిస్తాయి. సహచరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. వృథా ఖర్చులు తగ్గించాలి. మానసిక ప్రశాంతతను పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అనవసరమైన సలహాలు ఇవ్వడం మానుకోండి. విలువైన వస్తువులు జాగ్రత్త.
సింహం
కార్యాల్లో ఆచితూచి వ్యవహరించండి. బుద్ధి నిలకడగా ఉండదు. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. అనవసర నిందలు వస్తాయి. మానసిక ప్రశాంతత కరువవుతుంది. వారం చివరల్లో పరిస్థితి కాస్త మెరుగవుతుంది. అవసరానికి తగినంత డబ్బు సమకూరుతుంది. ఆస్తి క్రయ, విక్రయ వ్యవహారాలను వాయిదా వేయడం మంచిది. సంతానం తీరు ఆవేదనకు కారణమవుతుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. రాజీ ప్రయత్నాలు ముందుకు సాగవు. కోర్టు కేసులను నిర్లక్ష్యం చేయకండి. ఖర్చులు తగ్గించండి.
కన్య
మిశ్రమ ఫలితాలుంటాయి. పనుల్లో తీవ్ర జాప్యం ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తు, వస్త్రాలను కొంటారు. సోదరుల గురించిన ఆలోచనలు చేస్తారు. ఆత్మీయుల కలయిక అమితానందాన్ని ఇస్తుంది. సహోద్యోగుల తీరు కోపానికి కారణమవుతుంది. తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. వృథా ఖర్చులు తగ్గించడం మంచిది. సంతానం శైలి చిరాకు పెడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో అనవసర జోక్యం మంచిది కాదు. అయినవారితోనే విరోధం గోచరిస్తోంది. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది.
తుల
పనులు సవ్యంగా సాగవు. బ్యాంకు లావాదేవీల్లో జాగ్రత్త. ఆర్థిక నష్టం గోచరిస్తోంది. మాట నిలుపుకోని కారణంగా అవమానం ఎదురవుతుంది. నిందలను భరించాల్సి వస్తుంది. సోదరుల సహకారంతో కీలక సమస్యను పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి తీరు ఆందోళన కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలను వాయిదా వేయండి. ఆత్మీయుల సూచనలు ఉత్సాహాన్నిస్తాయి. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు ఉంటాయి. వృథా ఖర్చుల వల్ల డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది.
వృశ్చికం
ఆటంకాలను అవలీలగా దాటేస్తారు. కార్యాలను విజయవంతంగా ముగిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కాస్త అప్రమత్తత అవసరం. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. వాహన యోగం ఉంది. ఎదురు చూస్తున్న వర్తమానం అందుతుంది. అదృష్టం తోడుగా నిలుస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు యోగదాయకంగా ఉంటుంది. మిత్రులు సహకరిస్తారు. మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. ఉన్నత స్థానాన్ని చేరుకోవాలన్న ఆకాంక్ష నెరవేరే సూచన ఉంది. ఆత్మధైర్యం పెరుగుతుంది. కీర్తి వృద్ధి చెందుతుంది. అనవసర జోక్యం వద్దు.
ధనుస్సు
పనులు ఆశించిన రీతిలో సాగవు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. బంధువులతో విరోధం గోచరిస్తోంది. బద్ధకం వల్ల ఇబ్బందుల్లో పడతారు. రహస్య ప్రవేశాలకు వెళ్లాల్సి రావచ్చు. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఇతరుల వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. మాట నిలుపుకోని కారణంగా అవమానపడతారు. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో కాస్త కుదుట పడతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నష్టపరిహారం చెల్లించాల్సి రావచ్చు.
మకరం
పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక చికాకులు క్రమంగా తొలగిపోతాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. బంధువులు సహకరిస్తారు. సంతాన సంబంధ వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త స్నేహాలు లాభసాటిగా ఉంటాయి. నూతన వస్తువులను కొంటారు. అదృష్టం తోడుగా నిలుస్తుంది. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం మనశ్శాంతిని కలిగిస్తుంది. అనవసర వ్యవహారాల్లో జోక్యం వల్ల సమస్య వచ్చే వీలుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కుంభం
పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ఆర్థిక ఇక్కట్లు తొలగుతాయి. అభీష్టం నెరవేరుతుంది. మిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. కుటుంబ వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. కొత్త స్నేహితులు తోడుగా ఉంటారు. నూతన విజ్ఞాన సాధనకు అనుకూలం. మంచి సౌకర్యాలు సమకూరతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అనవసర జోక్యాలు వద్దు. వారాంతంలో దూర ప్రయాణం సూచిస్తోంది.
మీనం
యోగదాయకంగా ఉంటుంది. ప్రతి పని సఫలం అవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. రుణ సంబంధ వ్యవహారాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. ఉద్యోగులకు రివార్డులు అందుతాయి. వృత్తి నిపుణులకు తగ్గ ఫలితం లభిస్తుంది. నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. నూతన వస్తువులను కొంటారు. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బంధువులతో వినోదంగా గడుపుతారు. విదేశీ వ్యవహారాలకు అనుకూలం.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire