Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Today Rasi Phalalu Check Zodiac Wise Results for Daily Horoscope in Telugu 29th June 2024
x

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

Highlights

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

29-06-2024 (శనివారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణ పక్షం

తిధి : అష్టమి మధ్యాహ్నం గం.2.19 ని.ల వరకు ఆ తర్వాత నవమి

నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉదయం గం.8.49 ని.ల వరకు ఆ తర్వాత రేవతి

అమృతఘడియలు: రేపు తె.వా. గం 5.17 ని.ల నుంచి ఉ. గం.6.48 ని.ల వరకు

వర్జ్యం: రాత్రి గం.8.12 ని.ల నుంచి గం.9.43 ని.ల వరకు

దుర్ముహూర్తం : తె.వా.గం.5.45 ని.ల నుంచి ఉ.గం.7.30 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.9.02 ని.ల నుంచి గం.10.41 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా.గం.5.45 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం.6.54 ని.లకు

మేషం : వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. శత్రువుల కుట్రలను గమనిస్తూ ఉండాలి. వైవాహిక సంబంధం చెడకుండా చూసుకోండి. అకారణంగా నిందలొస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

వృషభం : రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. వ్యవహారాలన్నీ అనుకున్నట్లే సాగుతాయి. ఇష్టమైన వారితో విందుల్లో పాల్గొంటారు. మానసిక శాంతిని పొందుతారు. సంతాన సంబంధ గృహ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

మిథునం : ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులతో విరోధం ఏర్పడినా మీరే గెలుస్తారు. అధికారులు, పెద్దల ఆదరాన్ని పొందుతారు. చక్కటి అవకాశాలు అందివస్తాయి. అభీష్టం నెరవేరుతుంది. కీర్తి వృద్ధి చెందుతుంది.

కర్కాటకం: కార్యాలు అనుకున్నట్లుగా సాగవు. సంతానంతో సఖ్యత ఉండదు. బలహీనతలపై దెబ్బ పడుతుంది. ఖర్చులు తగ్గించాలి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. గణపతిని పూజ మేలు.

సింహం: నిర్దేశిత సౌకర్యాలు సకాలంలో సమకూరవు. చెప్పుడు మాటలు వింటే ఇబ్బంది పడతారు. పైత్య సంబంధ సమస్యలుంటాయి. తగాదాలకు దూరంగా ఉండండి. వేళకు భోజనం ఉండదు. శివుణ్ణి పూజించడం మేలు.

కన్య: కార్యాల్లో సత్ఫలితాలతో ఉత్సాహం పెరుగుతుంది. మీ మేధస్సుకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. బంధాలు దృఢమవుతాయి. కీర్తి పెరుగుతుంది.

తుల: శత్రుపీడ తొలగుతుంది. కీలక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. రుణవిముక్తి కోసం జరిపే ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం: ఆటంకాలు చికాకు పెడతాయి. ఇతరుల వల్ల నష్టపోతారు. అనవసర జోక్యాలు మానండి. శత్రువులపై ఓ కన్నేసి ఉంచాలి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు జాగ్రత్త. సాంత్వన కోసం సుబ్రహ్మణ్యుణ్ణి పూజించండి.

ధనుస్సు: ఆస్తి క్రయవిక్రయాలు సజావుగా సాగవు. అడుగడుగునా ఆటంకాలు, విరోధాలు చికాకు పెడతాయి. డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది. అవమానాలకూ ఆస్కారం ఉంది. ఖర్చులు తగ్గించాలి. ఆంజనేయుణ్ణి పూజించండి.

మకరం: ఆదాయం మెరుగవుతుంది. అవసరమైన సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సోదరుల తోడ్పాటు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ముఖ్య వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది.

కుంభం: ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు సరికాదు. విరోధాలకు ఆస్కారం ఉంది. శాంతంగా ఉండండి. వేళ తప్పి భోజనం చేస్తారు. కుటుంబ చికాకులుంటాయి. శనికి ప్రదక్షిణలు చేయండి.

మీనం: అదృష్టం తోడుగా ఉంటుంది. చేపట్టిన ప్రతి కార్యమూ సఫలం అవుతుంది. దీక్షాదక్షతలతో పెద్దల ప్రశంసలను పొందుతారు. విందుల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు మేలు జరుగుతుంది. అంతులేని ఆనందంతో ఉంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories