Horoscope Today: ఈ రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today: ఈ రాశి వారి ప్రతిభకు తగిన గుర్తింపు.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
26-06-2024 (బుధవారం)
కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్టమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, కృష్ణపక్షం
తిధి : పంచమి రాత్రి గం.8.55 ని.ల వరకు ఆతర్వాత షష్ఠి
నక్షత్రం: ధనిష్ట మధ్యాహ్నం గం.1.05 ని.ల వరకు ఆతర్వాత శతభిషం
అమృతఘడియలు: రేపు తె.వా.గం.4.51 ని.ల నుంచి గం.6.21 ని.ల వరకు
వర్జ్యం: రాత్రి గం.7.50 ని.ల నుంచి గం.9.20 ని.ల వరకు
దుర్ముహూర్తం : ఉదయం గం.11.53 ని.ల నుంచి గం.12.45 ని.ల వరకు
రాహుకాలం : మధ్యాహ్నం గం.12.19 ని.ల నుంచి గం.1.58 ని.ల వరకు
సూర్యోదయం : తె.వా.గం.5.44 ని.లకు
సూర్యాస్తమయం :సా.గం.6.54 ని.లకు
మేషం :
ఆశించిన ఫలితం లభిస్తుంది. ఇంట్లో శుభం జరుగుతుంది. అవసరమైన సౌకర్యాలు ఏర్పరచుకుంటారు. అవసరమైన వారి నుంచి తగిన సహకారం అందుతుంది. సంతాన వ్యవహారాలు మనశ్శాంతిని కలిగిస్తాయి.
వృషభం :
స్థిర చిత్తంతో చేపట్టే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అభీష్టం నెరవేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఉద్యోగులు అధికారుల మన్ననలు పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రుపీడ బాగా తగ్గుతుంది.
మిథునం :
ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థుల ఉన్నత విద్యాప్రయత్నాల్లో జాప్యం ఏర్పడుతుంది. అయినవారితోనే విరోధం గోచరిస్తోంది. సంభాషణల్లో జాగ్రత్త.
కర్కాటకం:
అయిష్టంగానే అయినా పనులు చేయక తప్పదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పైవారి నుంచి మాటలు పడాల్సి వస్తుంది. అపోహలు పెరుగుతాయి. తగాదాలకు ఆస్కారం ఉంది. సుబ్రహ్మణ్యుడిని పూజించండి.
సింహం :
చేపట్టిన పనులు సఫలమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. అందరితోనూ బంధాలు బలపడతాయి. కొత్త విషయాలను తెలుసకుంటారు.
కన్య :
ఆశయ సాధనలో ముందడుగు వేస్తారు. పరిచయస్తులందరి ప్రోత్సాహాన్ని పొందుతారు. మిమ్మల్ని వ్యతిరేకించే వారిని దారిలోకి తెచ్చుకుంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
తుల :
అనవసర ఖర్చులు తగ్గించండి. చేస్తున్న పనుల్లో ఆటంకాలను ఎదుర్కోవాలి. ఆలోచనలు సవ్యంగా సాగవు. అనుమానాలు పెరుగుతాయి. సంతానం తీరు నిరాశను కలిగిస్తుంది. మహాగణపతిని పూజించడం మేలు.
వృశ్చికం :
ప్రతి పనిలోనూ అడ్డంకులుంటాయి. భూసంబంధ వ్యవహారాలు సవ్యంగా సాగవు. విద్యాలయాల నిర్వహణ ఇబ్బందిగా ఉంటుంది. మనశ్శాంతి కరువవుతుంది. వృథాఖర్చులు తగ్గించాలి. శ్రీనివాసుని పూజించండి.
ధనుస్సు :
కార్యాల్లో విశేష లాభం గోచరిస్తోంది. అన్నివైపులా మంచే జరుగుతుంది. ఆదాయం మెరుగవుతుంది. సోదరవర్గం తోడ్పాటుతో కీలక సమస్య నుంచి గట్టెక్కుతారు. ఇంట్లో శాంతి ఉంటుంది. ధైర్యం పెరుగుతుంది.
మకరం :
పనులకు విఘ్నాలు వస్తాయి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆత్మీయులను సంప్రదించండి. మాట తప్పడం వల్ల నిందలు వస్తాయి. కంటిసమస్యలుంటాయి. పార్వతీదేవిని పూజిచండి.
కుంభం :
పనులు అనుకున్న రీతిలోనే సాగుతాయి. అంతులేని ఆనందాన్ని పొందుతారు. ధనలాభం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కష్ట సమయాల్లో అదృష్టం తోడవుతుంది. విందుల్లో పాల్గొంటారు.
మీనం :
ప్రయత్నాలు బెడిసికొట్టడం మనసుని కలతబారుస్తుంది. బంధువుల నుంచి మాట పడాల్సి వస్తుంది. ఇంటికి దూరంగా వెళ్లే పరిస్థితి ఉంది. వేళకు భోజనం ఉండదు. మిత్రుల వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire