Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Today Rasi Phalalu Check Zodiac Wise Results For Daily Horoscope In Telugu 16th July 2024
x

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

Highlights

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు

16-07-2024 ‘(మంగళవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, శుక్ల పక్షం

తిధి : దశమి రాత్రి గం.8.33 ని.ల వరకు ఆ తర్వాత ఏకాదశి

నక్షత్రం: విశాఖ ఇవాళ అర్ధరాత్రి దాటాక గం.2.14 ని.ల వరకు ఆ తర్వాత అనూరాధ

అమృతఘడియలు: సాయంత్రం గం.4.48 ని.ల నుంచి గం.6.31 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.6.30 ని.ల నుంచి గం.8.13 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.8.27 ని.ల నుంచి గం.9.19 ని.ల వరకు ఆ తర్వాత రాత్రి గం.11.17 ని.ల నుంచి అర్ధరాత్రి గం.12.01 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.3.38 ని.ల నుంచి గం.5.16 ని.ల వరకు

సూర్యోదయం : తెవా. గం. 5.50 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.54 ని.లకు


మేషం :

కీలకమైన కార్యం నెరవేరుతుంది. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. బంధాలు బలపడతాయి. జీవిత భాగస్వామి సూచనలు ఉపకరిస్తాయి. కొత్త విషయం గురించిన పరిజ్ఞానం ఏర్పడుతుంది. మనశ్శాంతిని పొందుతారు.


వృషభం :

వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. స్వస్థానప్రాప్తి ఉంది. మీ సహాయ గుణానికి ప్రశంసలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. కొత్త వస్తువులు కొంటారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.


మిథునం :

బద్ధకం వదిలి పెట్టాలి. అవరోధాలను అధిగమిస్తారు. అభీష్టం నెరవేరే సూచన లేదు. అకారణ విరోధం ఉంటుంది. సంతాన సంబంధ వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. వాత సంబంధ సమస్యలు నిర్లక్ష్యం చేయకండి.


కర్కాటకం:

పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. అనుమానాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బుద్ధి నిలకడగా ఉండదు. స్థిరాస్తి సంబంధ లావాదేవీలను వాయిదా వేయండి. వృథా ఖర్చులుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.


సింహం :

ఆత్మవిశ్వాసంతో చేపట్టిన కార్యాలు సఫలం అవుతాయి. బెరుకు తగ్గుతుంది. కష్టానికి తగ్గ ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అవసరమైన సమాచారం అందుతుంది. ప్రయాణం గోచరిస్తోంది. ఒప్పందాలకు అనుకూలం.


కన్య :

అనవసర జోక్యాల వల్ల చికాకులు తప్పవు. పెద్దవారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అకారణ విరోధం గోచరిస్తోంది. అనుకున్నరీతిలో పనులు సాగవు. మనశ్శాంతి లోపిస్తుంది. వేళకు భోజనముండదు.


తుల :

అత్యంత యోగదాయకంగా ఉంటుంది. పనులన్నీ సవ్యంగా సాగుతాయి. పెద్దల మన్ననలు పొందుతారు. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. మానసిక స్థితి ఉల్లాసంగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు.


వృశ్చికం :

పనుల్లో జాప్యం చికాకు పెడుతుంది. ఆర్థిక వ్యవహారాలతో ముడిపడ్డ పనులు ఆందోళనను పెంచుతాయి. ఇతరులతో జాగ్రత్తగా మెలగాలి. వీలైనంత మేర ప్రయాణాన్ని వాయిదా వేయండి. బద్ధకాన్ని వదలిపెట్టండి.


ధనుస్సు :

వ్యవహారాల్లో పురోభివృద్ధి కనిపిస్తుంది. ఆనందం రెట్టింపవుతుంది. బాగా ఇష్టమైన వారితో వినోదంగా గడుపుతారు. అవసరమైన సౌకర్యాలు సమకూరుతాయి. సంతాన సంబంధ శుభకార్యం గురించి చర్చిస్తారు.


మకరం :

పనులు విజయవంతమవుతాయి. మంచి అవకాశాలు అందివస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. పెద్దవారి ఆశీస్సులను పొందుతారు. మిత్రులతో వినోదంగా గడుపుతారు. మనశ్శాంతిని పొందుతారు.


కుంభం :

ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. విధినిర్వహణలో నిర్లక్ష్యం వల్ల బాగా ఇబ్బంది పడే సూచన ఉంది. వృథా ఖర్చులుంటాయి. పొట్టలో సమస్యగా ఉంటుంది. ఇంటికి దూరంగా వెళతారు.మనశ్శాంతి లోపిస్తుంది.


మీనం :

నిర్దేశిత గడువులోగా పనులు కావు. ఇతరులపై దురభిప్రాయాలు పెరుగుతాయి. అనుమానాలతో చెడు ఆలోచనలు చేస్తారు. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. ఇష్టంలేని చోట గడపాల్సి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.

Show Full Article
Print Article
Next Story
More Stories