Telugu Horoscope Today 26th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Today Horoscope In Telugu Daily Rasi Phalalu For 26th August 2024 Monday In Telugu
x

Telugu Horoscope Today 26th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Highlights

Telugu Horoscope Today 26th August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

26-08-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : అష్టమి అర్ధరాత్రి దాటాక గం.2.19 ని.ల వరకు ఆ తర్వాత నవమి

నక్షత్రం: కృత్తిక మధ్యాహ్నం గం.3.55 ని.ల వరకు ఆ తర్వాత రోహిణి

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.1.36 ని.ల నుంచి గం.3.09 ని.ల వరకు

వర్జ్యం: --

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.43 ని.ల నుంచి గం.1.33 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం. 3.13 ని.ల నుంచి గం.4.04 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.35 ని.ల నుంచి గం.9.10 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.01 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.34 ని.లకు

మేషం :


ముందుచూపు లేక ఆర్థిక చిక్కుల్లో పడతారు. ఆత్మీయులకు సహకరించలేక పోతారు. నిందలు భరించాల్సి వస్తుంది. వేళకు భోజనం ఉండదు. మనశ్శాంతి లోపిస్తుంది. భాగస్వామితో సఖ్యత చెడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

వృషభం :


వ్యవహారాలన్నింట్లో విజయం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సవ్యంగా సాగుతాయి. వృథా ఖర్చులు తగ్గించాలి. మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు అందుతాయి. మానసిక స్థైర్యాన్ని పొందుతారు. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

మిథునం :


అనూహ్య ఖర్చులతో పాటు ఆర్థిక లావాదేవీల్లో నష్టం గోచరిస్తోంది. మిత్రులతోనూ విరోధం ఏర్పడుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం వద్దు. అనవసర ప్రయాణాలు వాయిదా వేయండి. బద్ధకం వల్ల ఇబ్బందులు తప్పవు.

కర్కాటకం:


కోరిక నెరవేరుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. రుణ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. ఇంట్లో శుభకార్య సంబంధ చర్చ సాగుతుంది.

సింహం :


వృత్తి నిపుణతను కనబరుస్తారు. అధికారుల గుర్తింపును పొందుతారు. కిందివారిపై అజమాయిషీ చూపుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. అవకాశాలు అందివస్తాయి. గృహశాంతిని పొందుతారు.

కన్య :


వ్యవహారాలు అనుకున్న స్థాయిలో సాగవు. సంతాన సంబంధ ఆలోచనలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువుల కలయిక మనశ్శాంతినిస్తుంది. కీళ్ల సమస్య ఉంటుంది.

తుల :


ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. సహచరులతో తగాదాలు వస్తాయి. శాస్త్ర విజ్ఞానంపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధన రంగంలో ప్రతికూలతలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

వృశ్చికం :


ఉత్సాహంగా గడుపుతారు. ధన సంబంధ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. బంధువులను కలుస్తారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి. మనశ్శాంతి లభిస్తుంది.

ధనుస్సు :


కార్యాలు సజావుగా సాగుతాయి. ధన సంబంధ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మనోవేదన తీరుతుంది. మిత్రులు తోడ్పడతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

మకరం :


బద్ధకం వల్ల సమస్యలొస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమైన కార్యం విఫలమవడం వేదనను కలిగిస్తుంది. సంతానం తీరు చికాకు పెడుతుంది. తెలివితేటలకు గుర్తింపుండదు. విలువైన వస్తువులు జాగ్రత్త.

కుంభం :


ప్రతి పనికీ అడ్డంకులొస్తాయి. స్థిరచిత్తం లేక పనులు చెడగొట్టుకుంటారు. డబ్బుకి ఇబ్బంది ఉంటుంది. ఆలోచన విధానం మారుతుంది. కుటుంబ సభ్యుల తీరు చికాకు పెడుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మీనం :


పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థికస్థితి మెరుగ్గా వుంటుంది. తోటివారితో సఖ్యత ఏర్పడుతుంది. కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రుల సహకారంతో విశేష లాభం పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories