Horoscope Today in Telugu 22 August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Today Horoscope In Telugu Daily Rasi Phalalu For 22nd August 2024 Thursday In Telugu
x

Today Horoscope in Telugu 22nd August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే

Highlights

Horoscope Today in Telugu, 22 August 2024: ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే. ఈరోజు 12 రాశుల ఫలితాలు ఇలా.

22-08-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : తదియ మధ్యాహ్నం గం.1.46 ని.ల వరకు ఆ తర్వాత చవిత

నక్షత్రం: ఉత్తరాభాద్ర రాత్రి.గం.10.05 ని.ల వరకు ఆ తర్వాత రేవతి

అమృతఘడియలు: సాయంత్రం గం.5.47 ని.ల నుంచి గం.7.13 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.9.10 ని.ల నుంచి గం.10.36 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.13 ని.ల నుంచి గం.11.03 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.3.15 ని.ల నుంచి గం.4.06 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.53 ని.ల నుంచి గంచ3.28 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.01 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.37 ని.లకు

మేషం :


వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. మిత్రుల ఆర్థిక అవసరాలు తీర్చాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇరుగు పొరుగుతో సఖ్యత చెడుతుంది. మనశ్శాంతి వుండదు.

వృషభం :


రోజంతా సుఖంగా గడుస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. సంతాన వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆదాయం మెరుగవుతుంది. గృహావసరాలు తీరుస్తారు. పెద్దవారి మన్నన పొందుతారు.

మిథునం :


అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మెరుగుదల ఉంటుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. అభీష్టం నెరవేరుతుంది. మీ నైపుణ్యానికి ప్రశంసలు అందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

కర్కాటకం:


అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగవు. కలహాలు గోచరిస్తున్నాయి. గురువును కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. దైవ క్షేత్రాలను సందర్శిస్తారు. నిరాశను దూరం చేయండి.

సింహం :


చెప్పుడు మాటలు వినడం వల్ల ఇబ్బందులొస్తాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం ఆగ్రహానికి కారణమవుతుంది. తగాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

కన్య :


పనులు సాఫీగా సాగుతాయి. పోటీలో ముందుంటారు. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. పరిచయస్తులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఆకాంక్ష తీరుతుంది.

తుల :


శుభ ఫలితాలను అందుకుంటారు. బలహీనతలను అధిగమిస్తారు. మానసిక, శారీరక దృఢత్వాన్ని పొందుతారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిత్రులు సహకరిస్తారు.

వృశ్చికం :


ఆటంకాలు ఎదురవుతాయి. బద్ధకం వీడి బాగా కష్టపడాలి. మీ బుద్ధిబలం పనిచేయదు. ప్రత్యర్థుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ విశ్లేషణ విఫలమవుతుంది. విచారం ఏర్పడుతుంది. వాత సంబంధ సమస్యలుంటాయి.

ధనుస్సు :


మనసును అదుపులో పెట్టుకోవాలి. పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. రక్త సంబంధీకులతో సఖ్యత చెడే సూచన ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అవమానాలకు ఆస్కారం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.

మకరం :


కార్యజయం ఉంది. నాయకత్వ లక్షణాన్ని ప్రదర్శిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కీలక సమాచారం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ధైర్యం పెరుగుతుంది.

కుంభం :


మనసుకి కష్టం కలిగించే ఘటనలు గోచరిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఎవరినీ అకారణంగా విమర్శించకండి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. మనసులో మాటను చెప్పలేక ఇబ్బంది పడతారు.

మీనం :


ఆశించిన ప్రయోజనం లభిస్తుంది. మీ వ్యక్తిత్వానికి ప్రశంసలు లభిస్తాయి. ధనలాభం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విందులో పాల్గొంటారు. ఉన్నత స్థాయికి ఎదిగే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదృష్టం తోడవుతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories