Telugu Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Today Horoscope In Telugu Daily Rasi Phalalu For 21st August 2024 Wednesday In Telugu
x

Telugu Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Highlights

Telugu Horoscope Today: ఆరోగ్యం విషయంలో ఆ రాశి వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

21-08-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : విదియ సాయంత్రం గం.5.06 ని.ల వరకు ఆ తర్వాత తదియ

నక్షత్రం: పూర్వాభాద్ర అర్ధరాత్రి గం.12.33 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తరాభాద్ర

అమృతఘడియలు: సాయంత్రం గం.5.25 ని.ల నుంచి గం.6.51 ని.ల వరకు

వర్జ్యం: ఉదయం గం.8.52 ని.ల నుంచి గం.10.17 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.54 ని.ల నుంచి మ.గం.12.44 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.19 ని.ల నుంచి గం.1.54 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.00 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.38 ని.లకు

మేషం :


ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. చక్కటి సలహాలతో అధికారుల మెప్పును పొందుతారు. స్నేహితుల వల్ల లబ్ది చేకూరుతుంది. సమాజ సేవలో పాల్గొంటారు. శుభకార్యంలో పాల్గొంటారు.

వృషభం :


కార్యనిర్వహణలో మేటిగా ఉంటారు. ప్రభుత్వ వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు పొందుతారు. అభీష్టం నెరవేరుతుంది. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

మిథునం :


గురువుల ఆశీస్సులు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ఉన్నత విద్యకు అవరోధం ఏర్పడుతుంది. విదేశీ అగ్రిమెంట్లకు అనుకూలం.

కర్కాటకం:


పనులు ఆశించిన రీతిలో జరగవు. శత్రువుల తాకిడి పెరుగుతుంది. నిరాశను దూరం చేయండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ఆర్థిక అవసరాలకు రుణం చేయాల్సి రావచ్చు. ప్రతిష్టకు భంగం కలిగే ఘటనలు ఎదురవుతాయి.

సింహం :


పోటీదారులపై విజయం సాధిస్తారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. విదేశీ సంబంధాలు మెరుగవుతాయి. రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక బంధం దృఢమవుతుంది. గౌరవం పెరుగుతుంది.

కన్య :


శుభప్రదంగా సాగుతుంది. బ్యాంకు రుణం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కార్యాలయపు వాతావరణం ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబ అవసరాలపై శ్రద్ధ పెట్టాలి. సాహిత్య సంబంధ వాగ్వాదానికి ఆస్కారం ఉంది.

తుల :


ప్రేమ వ్యవహారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార భాగస్వాములకు లాభదాయకంగా ఉంటుంది. సంతాన వ్యవహారాలు చికాకు పెడతాయి. లాటరీ వంటి జూదాలు కలిసిరావు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.

వృశ్చికం :


పనులు సజావుగా సాగవు. ఆలోచనలు క్రూరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు బెడిసి కొడతాయి. కుటుంబంపై శ్రద్ధ పెట్టాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్త. బంధువులు ఆదుకోరు. అద్దెకున్న వారితో సమస్యలు తలెత్తుతాయి.

ధనుస్సు :


లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థిక లబ్ది చేకూరుతుంది. కీలక వర్తమానం అందుతుంది. ఆలోచనలకు పదును పెడతారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అధ్యయనంపై శ్రద్ధ పెరుగుతుంది. సోదరులతో సఖ్యత ఉంటుంది.

మకరం :


ఆలోచనలను ఆచరణలో పెట్టలేరు. ఆటంకాలను అధిగమించాల్సి వుంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో జాగ్రత్త. మాట నిలుపుకోని పరిస్థితి ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బ తింటుంది. కుడికంటి సమస్య వేధిస్తుంది.

కుంభం :


కార్యాల్లో విజయం సాధిస్తారు. అవసరానికి తగ్గంత డబ్బు అందుతుంది. ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. గౌరవం పెరుగుతుంది. విందులో పాల్గొంటారు. పరిస్థితులపై అవగాహన పెంచుకుంటారు.

మీనం :


ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. మీకు వ్యతిరేకంగా జరిగే కుట్రలను పసిగట్టండి. మోసగాళ్ల వల్ల ధన నష్టం సూచిస్తోంది. విలువైన వస్తువులను భద్రపరచండి. అనవసర ప్రయాణాలు మానండి. ఏకాంతాన్ని ఇష్టపడతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories