Today Horoscope in Telugu, 7 August 2024: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా

Today Horoscope in Telugu 7 August 2024
x

Today Horoscope in Telugu 7 August 2024

Highlights

Today Horoscope in Telugu, 7 August 2024: ఈరోజు రాశి ఫలాలు. 12 రాశుల ఫలితాలు ఇలా

07-08-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, శుక్ల పక్షం

తిధి : తదియ రాత్రి గం. 10.05 ని.ల వరకు ఆ తర్వాత చవితి

నక్షత్రం: పుబ్బ రాత్రి గం. 8.30 ని.ల వరకు ఆ తర్వాత ఉత్తర

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.1.22 ని.ల నుంచి గం.3.09 ని.ల వరకు

వర్జ్యం: రేపు తె.వా. గం.4.37 ని.ల నుంచి గం.6.26 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.56 ని.ల నుంచి గం.12.47 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.22 ని.ల నుంచి గం.1.58 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 5.57 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.46 ని.లకు

మేషం :

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవర వాగ్వాదాలకు దూరంగా ఉండండి. బ్యాంకు లావాదేవీలు ఆశించిన రీతిలో సాగవు. ఇంటి గురించి శ్రద్ధ వహించండి. అనుకున్నవి జరగవు. మనశ్శాంతి లోపిస్తుంది.

వృషభం :

ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన పురోభివృద్ధి ఉంటుంది. విందులో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. గౌరవం వృద్ధి చెందుతుంది.

మిథునం :

బద్ధకాన్ని వదిలించుకోండి. పనుల పూర్తికి బాగా శ్రమ పడాల్సి వుంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణం గోచరిస్తోంది. ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్త. వేళకు భోజనం ఉండదు. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం:

ఆనందంగా గడుపుతారు. కార్యజయం ఉంది. ఆర్థిక లావాదేవీలు చక్కటి లాభాన్ని అందిస్తాయి. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. సంతానం అభివృద్ధి ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. శత్రుజయం ఉంది.

సింహం :

అభీష్టం నెరవేరుతుంది. యత్నకార్యం ఫలిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లోని వారికి యోగవంతమైన రోజు. శత్రుపీడ తొలగుతుంది. అధికారుల మన్ననలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. సుఖాలు పొందుతారు.

కన్య :

నిర్దేశిత సమయానికి పనులు పూర్తి కావు. వృత్తిగత ఒత్తిళ్లు ఉంటాయి. అయినవారే శత్రువులుగా ప్రవర్తిస్తారు. కలహాలకు దూరంగా ఉండండి. త్వరగా అలసిపోతారు. ఉదర సంబంధ సమస్యలుంటాయి.

తుల :

అనుకున్నట్లుగా పనులు సాగవు. ఆశించిన మేర సౌకర్యాలూ సమకూరవు. ఇతరులపై దురభిప్రాయం ఏర్పడుతుంది. తగాదాలకు ఆస్కారం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. అజీర్తి సమస్య వేధిస్తుంది.

వృశ్చికం :

ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణాలు ఆనందకరంగా సాగుతాయి. కీర్తి వృద్ధి చెందుతుంది. మనశ్శాంతిని పొందుతారు.

ధనుస్సు :

అభీష్టం నెరవేరుతుంది. ధన సంబంధ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అవసరమైన వేళ అదృష్టం తోడుగా నిలుస్తుంది. పోటీదారులపై విజయం సాధిస్తారు. మిత్రులు సమకరిస్తారు. ప్రతిష్ట పెరుగుతుంది.

మకరం :

ప్రతి పనికీ ఆటంకాలు వస్తాయి. అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాలి. సోమరితనం వల్ల ఇబ్బందుల్లో పడతారు. మీ మేధస్సుకు తగిన గుర్తింపు ఉండదు. వృథా ఖర్చులను బాగా తగ్గించుకోవాలి.

కుంభం :

బుద్ధి నిలకడగా ఉండదు. అయినవారితోనే విరోధం ఏర్పడుతుంది. పనుల్లో నష్టం గోచరిస్తోంది. వృథా ఖర్చులు వుంటాయి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.

మీనం :

పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. కీలక సమాచారం తృప్తినిస్తుంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సాహసానికి గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories