Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..2nd october 2024

Today Horoscope In Telugu Daily Rashi Phalalu For Wednesday 2nd october 2024
x

Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..2nd october 2024

Highlights

Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..2nd october 2024

02-10-2024 (బుధవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష రుతువు, కృష్ణ పక్షం

తిధి : అమావాస్య అర్ధరాత్రి గం.12.18 ని.ల వరకు ఆ తర్వాత శుక్ల పాడ్యమి

నక్షత్రం: ఉత్తర మధ్యాహ్నం గం.12.23 ని.ల వరకు ఆ తర్వాత హస్త

అమృతఘడియలు: లేవు

వర్జ్యం: రాత్రి గం.9.53ల నుంచి గం.11.42 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.11.41 ని.ల నుంచి గం.12.29 ని.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.12.05 ని.ల నుంచి గం. 1.35 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.07 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.04 ని.లకు

మేషం :


బలహీనతను జయిస్తారు. పనుల్లో అనుకూల ఫలితాలను పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. మానసిక సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రులు అండగా ఉంటారు. పోటీల్లో గెలుస్తారు.

వృషభం :


కీలక వ్యవహారంలో మిత్రుల సూచనను పాటించండి. ప్రయత్నాలు అంతగా సఫలం కావు. విరోధాలకు ఆస్కారముంది. ఖర్చులు పెరుగుతాయి. పరిస్థితులు భయం కలిగిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి.

మిథునం :


బుద్ధి నిలకడగా ఉండదు. అనవసర తగాదాల్లో తలదూర్చకండి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల తీరు కష్టపెడుతుంది. ఖర్చులు తగ్గించాలి. ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది.

కర్కాటకం:


ముఖ్యమైన సమాచారం ఉత్తేజాన్నిస్తుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభిస్తుంది. బంధాలు బలపడతాయి. మాట పలుకుబడి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా బాగుంటుంది.

సింహం :


అనుకున్నంత వేగంగా పనులు సాగవు. ఆటంకాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలోనూ చికాకులుంటాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. నిందలు వస్తాయి.

కన్య :


ఆశించిన లక్ష్యానికి చేరువవుతారు. అదృష్టం తోడుగా ఉంటుంది. వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగానే సాగుతాయి. చక్కటి సౌకర్యాలు సమకూర్చుకుంటారు. మనశ్శాంతి లభిస్తుంది.

తుల :


శ్రమకు తగిన ఫలితం దక్కదు. అనూహ్య ఖర్చుల వల్ల అప్పు చేయాల్సి రావచ్చు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. కోర్టు లావాదేవీలను నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల వల్ల ఫలితం ఉండదు.

వృశ్చికం :


కాలం ఆనందంగా సాగుతుంది. మీ ప్రయత్నాలకు అన్నివైపుల నుంచీ సహకారం అందుతుంది. పనులు విజయవంతమవుతాయి. కొత్త వస్తువులను సేకరిస్తారు. ఆకాంక్ష నెరవేరుతుంది. ఆరోగ్యం బావుంటుంది.

ధనుస్సు :


అన్ని వ్యవహారాల్లోనూ అనుకూల ఫలితాలుంటాయి. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు. కుటుంబ సభ్యుల తోడ్పాటు లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విందులో పాల్గొంటారు.

మకరం :


ఎంత శ్రమించినా అనుకున్న పని పూర్తి కాదు. ఓపికతో వ్యవహరించాలి. సంతానం తీరుతో విభేదిస్తారు. బంధువులతోనూ సఖ్యత ఉండదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది.

కుంభం :


చిత్తశుద్ధితో పనులు చేయాలి. ఆటంకాలను దాటాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు కూడా ఏమంత సంతృప్తిగా ఉండవు. ఇష్టంలేని పని చేయాల్సి వస్తుంది. తగాదాలకు వీలుంది. అజీర్తి సమస్య ఉంటుంది.

మీనం :


అభీష్టం నెరవేరుతుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. విందుకు హాజరవుతారు. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సూచనలు పాటించడం మేలు.

Show Full Article
Print Article
Next Story
More Stories