Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..3rd October 2024

Today Horoscope In Telugu Daily Rashi Phalalu For Thursday 3rd October 2024
x

Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..3rd October 2024

Highlights

Telugu Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి..3rd October 2024

03-10-2024 (గురువారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షినాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి : పాడ్యమి అర్ధరాత్రి దాటాక గం.2.58 ని.ల వరకు ఆ తర్వాత విదియ

నక్షత్రం: హస్త మధ్యాహ్నం గం.3.342 ని.ల వరకు ఆ తర్వాత చిత్త

అమృతఘడియలు: ఉదయం గం.8.45 ని.ల నుంచి గం. 10.33 ని.ల వరకు

వర్జ్యం: అర్ధరాత్రి గం.12.34 ని.ల నుంచి గం.2.22 ని.ల వరకు

దుర్ముహూర్తం : ఉదయం గం.10.06 ని.ల నుంచి గం.10.53 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.52 ని.ల నుంచి గం. 3.40 ని,.ల వరకు

రాహుకాలం : మధ్యాహ్నం గం.1.34 ని.ల నుంచి గం.3.04 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.07 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.03 ని.లకు

మేషం :


పోటీదారులు అడ్డు తొలగుతారు. వివాదాలు సులువుగా పరిష్కారం అవుతాయి. పరిస్థితులు మళ్లీ అదుపులోకి వస్తాయి. కార్యజయం ఉంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.

వృషభం :


ఆటంకాలు ఎక్కువవుతాయి. ఇష్టమైన పని వాయిదా పడుతుంది. మీ తెలివితేటలకు తగిన గుర్తింపు లభించదు. విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకునే వీలుంది. సంతాన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం.

మిథునం :


గుట్టుగా చేసే వ్యవహారాల వల్ల నష్టపోతారు. మీకు తోడుగా ఉన్నవారే దెబ్బతీసే వీలుంది. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు వాయిదా వేయండి. బంధువుల తీరు విచారాన్ని కలిగిస్తుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం:


కీలక వ్యవహారాల్లో సత్తా చాటుతారు. స్వయంకృషితో మెరుగైన ఫలితాలను అందుకుంటారు. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. ప్రయాణం లాభిస్తుంది. బంధాలు బలపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

సింహం :


అనుకున్నవి జరగవు. కార్యనష్టం కూడా ఉంది. అడ్డంకులు సృష్టించేవారిని గుర్తించండి. కుటుంబ సభ్యుల తీరు కలవరపరుస్తుంది. ముక్కుసూటి తనం అన్నివేళలా పనికిరాదు. ఎవరికీ పూచీకత్తును ఇవ్వకండి.

కన్య :


ఆశయం నెరవేరుతుంది. అంతరంగాన్ని అనుసరించి నడచుకోండి. తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. విందుకు హాజరవుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సామాజిక స్పృహ పెరుగుతుంది.

తుల :


తొందరపాటు నిర్ణయం వల్ల ఇబ్బంది పడతారు. దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది. వాహనం నడిపేటప్పుడు, కోర్టు వ్యవహారాల్లోను జాగ్రత్తగా ఉండాలి. అనూహ్య ఖర్చులు చికాకు పెడతాయి.

వృశ్చికం :


పనులు ఆశించిన రీతిలోనే సాగుతాయి. ఆర్థింగా లబ్ది చేకూరుతుంది.. ఆకాంక్ష నెరవేరుతుంది. ఇష్టమైన వారిని కలిసి విందుకు హాజరవుతారు. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. ఆరోగ్యం బావుంటుంది.

ధనుస్సు :


సమర్థతకు తగ్గ ఫలితం లభిస్తుంది. వృత్తి పరమైన సంతృప్తి లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. విదేశాలు, దూర ప్రాంతాల్లో శాశ్వత నివాసానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహశాంతి ఉంటుంది.

మకరం :


న్యాయ పరమైన చిక్కులున్నాయి. సంతానం తీరు బాధిస్తుంది. ఉద్యోగులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఆత్మీయులతో విరోధం వల్ల మానసిక. అశాంతి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది.

కుంభం :


తొందరపాటుతో చేసిన తప్పు వల్ల ఇబ్బంది పడతారు. నిజాయితీగా ఉండండి. ఆర్థిక లావాదేవీల్లోనూ జాగ్రత్త. ప్రయాణాల్లో ఆకస్మిక ఇబ్బందులుంటాయి. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి.

మీనం :


అన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. ఆర్థిక లబ్దిని పొందుతారు. విజ్ఞానాభివృద్ధికి ఆస్కారముంది. బంధాలు బలపడతాయి. ప్రయాణం లాభిస్తుంది. సంతాన వ్యవహారాలు ఆనందాన్నిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories