Telugu Horoscope Today 7th October 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Today Horoscope In Telugu Daily Rashi Phalalu For Monday 7th October 2024
x

Telugu Horoscope Today 7th October 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

Highlights

Telugu Horoscope Today 7th October 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి

07-10-2024 (సోమవారం)

కాలాదులు: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం, దక్షిణాయనం, శరదృతువు, శుక్ల పక్షం

తిధి : చవితి ఉదయం గం.9.47 ని.ల వరకు ఆ తర్వాత పంచమి

నక్షత్రం: అనూరాధ అర్ధరాత్రి దాటాక గం.2.25 ని.ల వరకు ఆ తర్వాత జ్యేష్ట

అమృతఘడియలు: మధ్యాహ్నం గం.3.03 ని.ల నుంచి గం.4.48 ని.ల వరకు

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం : మధ్యాహ్నం గం.12.32 ని.ల నుంచి గం.1.19 ని.ల వరకు మళ్లీ మధ్యాహ్నం గం.2.52 ని.ల నుంచి గం.3.39 ని.ల వరకు

రాహుకాలం : ఉదయం గం.7.45 ని.ల నుంచి గం. 9.13 ని.ల వరకు

సూర్యోదయం : తె.వా. గం. 6.17 ని.లకు

సూర్యాస్తమయం : సా. గం. 6.00 గం.లకు

మేషం :


అనుకున్నట్లుగా పనులు సాగవు. పొరపాట్లకు ఆస్కారముంది. అపోహలు పెరుగుతాయి. సహచరుల వల్ల సమస్యలు వస్తాయి. పోటీల్లో అనుకూల ఫలితాలుండవు. కోపాన్ని అణచుకోవాలి. అజీర్తి సమస్య ఉంటుంది.

వృషభం :


ఆకాంక్ష నెరవేరుతుంది. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. డబ్బుకి ఇబ్బంది ఉండదు. అందరితోనూ సత్సంబంధాలు పెరుగుతాయి. ప్రయాణం లబ్ది చేకూరుస్తుంది. బంధువులతో విందు, వినోదాలకు వెళతారు.

మిథునం :


ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. స్వస్థాన ప్రాప్తి ఉంది. అపార్థాలు తొలగిపోతాయి. ఆర్థిక చిక్కులూ పరిష్కారం అవుతాయి. మిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

కర్కాటకం:


బద్ధకాన్ని వదిలి పనిచేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయి. మీ నిపుణతకు తగిన గుర్తింపు లభించదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. సంతానం తీరు వేదనకు కారణమౌవుతుంది. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త.

సింహం :


పనుల్లో అడ్డంకులు పెరుగుతాయి. వృథా ఖర్చులుంటాయి. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. భూ సంబంధ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

కన్య :


కార్యజయం ఉంది. అన్నివైపులా శుభఫలితాలే ఉంటాయి. సహచరుల తోడ్పాటుతో లక్ష్యాన్ని చేరతారు. తోబుట్టువుల గురించి శ్రద్ధ తీసుకుంటారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తువులను కొంటారు.

తుల :


మనసులోని భావాన్ని వ్యక్తం చేయలేక పోతారు. ఫలితంగా ప్రయత్నం విఫలమవుతుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించండి. వేళకు భోజనం ఉండదు. అగ్రిమెంట్లపై సంతకాలు వాయిదా వేయండి.

వృశ్చికం :


సత్ఫలితాలుంటాయి. మంచి సౌకర్యాలు సమకూరతాయి. శారీరక, మానసిక సౌఖ్యాన్ని పొందుతారు. చిన్నప్పటి విషయాలు గుర్తొస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారం లాభసాటిగా ఉంటుంది.

ధనుస్సు :


అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి. ప్రయాణాలను వాయిదా వేయండి. బంధుమిత్రుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. మిత్రుల వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి.

మకరం :


పనులు శుభప్రదంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. కోరిక తీరుతుంది.ఇతరుల నుంచి కూడా అవసరమైన సహకారం లభిస్తుంది. ఇంటి వ్యవహారాలు తృప్తినిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం :


ఇష్టకార్యం అనుకూలమవుతుంది. ప్రత్యర్థులను జయిస్తారు. అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. అవకాశాలు అందివస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. డబ్బుకి సమస్య ఉండదు. మనశ్శాంతి లభిస్తుంది.

మీనం :


లక్ష్య సాధనలో అడ్డంకులు వస్తాయి. దూర ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అపాత్రదానం పనికిరాదు. ఉదర సమస్యలుంటాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories